Banana Peel: అరటి పండు తిన్నాక తొక్క పడేస్తున్నారా? ఈ విషయం తెలిస్తే ఎగిరి గంతేస్తారు..
అరటిపండ్లు తినడానికి ఇష్టపడతారు. చాలా మంది అరటిపండ్లతో వివిధ రకాల రుచికరమైన డిజర్ట్స్ కూడా చేస్తారు. కానీ అరటిపండ్లు మాత్రమే కాదు, అరటి తొక్కలు కూడా ఉపయోగకరంగా ఉంటాయని మీకు తెలుసా? అవును, అరటిపండు తిని తొక్క పడేసే ముందు, మీరీ విషయం తప్పక తెలసుకోవాలి. అరటిపండ్ల తొక్కలజజ

దాదాపు అందరూ అరటిపండ్లు తినడానికి ఇష్టపడతారు. చాలా మంది అరటిపండ్లతో వివిధ రకాల రుచికరమైన డిజర్ట్స్ కూడా చేస్తారు. కానీ అరటిపండ్లు మాత్రమే కాదు, అరటి తొక్కలు కూడా ఉపయోగకరంగా ఉంటాయని మీకు తెలుసా? అవును, అరటిపండు తిని తొక్క పడేసే ముందు, మీరీ విషయం తప్పక తెలసుకోవాలి. అరటిపండ్ల తొక్కల వల్ల కలిగే వివిధ ఉపయోగాలు మీ రోజువారీ జీవితంలో బోలెడంత డబ్బును కూడా ఆదా చేస్తుంది.
నిజానికి, అరటిపండ్లు మాత్రమే కాదు.. అరటి తొక్కలు కూడా మన చర్మానికి చాలా మేలు చేస్తాయి. డ్రై చర్మ సమస్యలతో బాధపడేవారు రాత్రి పడుకునే ముందు అరటి తొక్కలను ముఖంపై రుద్దడం ప్రయోజనకరంంగా ఉంటుంది. ఇలా ఏడు రోజులు చేస్తే, చర్మం కాంతివంతంగా మారడం పక్కా. ఇక పగిలిన పెదవులతో బాధపడేవారు రాత్రి పడుకునే ముందు అరటిపండు తొక్కను పెదవులపై రుద్దాలి. దీనివల్ల పెదవులు మెరుస్తూ అందంగా మారుతాయి. ఇక సమస్య కూడా పరిష్కారమవుతుంది. బాల్కనీలో ఉంచిన మొక్కల ఆకులు తరచుగా మురికిగా మారుతుంటాయి. కానీ ఆకులను ఎక్కువ నీటితో శుభ్రం చేయడం వల్ల మొక్కకు హాని కలుగుతుంది. కాబట్టి మొక్క ఆకులను శుభ్రం చేయడానికి అరటి తొక్కలను ఉపయోగించవచ్చు.
దంతాలు రోజురోజుకూ పసుపు రంగులోకి మారుతున్నాయా? అయితే దంతాలను తెల్లగా ఉంచుకోవడానికి అరటి తొక్కకు మించిన ప్రత్యామ్నాయం మరొకరటి లేదంటే అతిశయోక్తి కాదు. మీ దంతాలను శుభ్రం చేసుకోవడానికి టూత్‌పేస్ట్ కంటే అరటి తొక్క చాలా ప్రభావవంతంగా పని చేస్తుంది. రాత్రి పడుకునే ముందు అరటి తొక్కతో పళ్ళు తోముకోవాలి. ఇలా తరచూ చేయడం వల్ల దంతాలు తెల్లగా మారడం కేవలం వారం రోజుల్లోనే గమనిస్తారు.
మరిన్ని ఆరోగ్య వార్తల కోసం క్లిక్ చేయండి.