Food: పండ్లపై ఉప్పు చల్లుకొని తింటున్నారా.? నిపుణులు ఏమంటున్నారంటే..
పైనాపిల్ మొదలు పుచ్చకాయ వరకు కొన్ని రకాల పండ్లను మనం తీసుకునే సమయంలో ఉప్పును చల్లుకుంటాం. దీనివల్ల నిజానికి వాటి రుచి కాస్త పెరిగినట్లు అనిపిస్తుంది. అయితే రుచికి బాగున్నా ఆరోగ్యానికి మాత్రం చేటు చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఇంతకీ పండ్లపై ఉప్పును చల్లుకొని తినడం వల్ల కలిగే నష్టాలు ఏంటంటే....

పండ్లు ఆరోగ్యానికి ఎంతలా మేలు చేస్తాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే పండ్లు తీసుకునే సమయంలో మనం తెలిసో తెలియకో చేసే కొన్ని తప్పుల వల్ల లాభం కంటే నస్టాలు ఎక్కువగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. ఉదాహరణకు మనం కొన్ని రకాల పండ్లను తీసుకునే సమయంలో వాటిపై ఉప్పును చల్లుకొని తింటుంటాం. అయితే దీని వల్ల నష్టం తప్పదని నిపుణులు చెబుతున్నారు. ఇంతకీ ఆ నష్టాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
పైనాపిల్ మొదలు పుచ్చకాయ వరకు కొన్ని రకాల పండ్లను మనం తీసుకునే సమయంలో ఉప్పును చల్లుకుంటాం. దీనివల్ల నిజానికి వాటి రుచి కాస్త పెరిగినట్లు అనిపిస్తుంది. అయితే రుచికి బాగున్నా ఆరోగ్యానికి మాత్రం చేటు చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఇంతకీ పండ్లపై ఉప్పును చల్లుకొని తినడం వల్ల కలిగే నష్టాలు ఏంటంటే..
* పండ్లపై ఉప్పు చల్లితే వాటిలోని పోషకాలు తగ్గుతాయని నిపుణులు చెబుతున్నారు. పండ్లపై ఉప్పు చల్లితే వాటి నుంచి నీరు రావడం గమనిస్తాం. పండులోని పోషకాలు నాశనమవుతాయని చెప్పడానికి ఇదే సాక్ష్యం. కాబట్టి ఉప్పు చల్లిన పండ్లను తింటే ఉపయోగం ఉండదు.
* పండ్ల మీద ఉప్పును చల్లుకొని తింటే శరీరంలో ఉప్పు పరిమాణం పెరుగుతుంది. దీనివల్ల బీపీతో పాటు గుండె సమస్యలు వస్తాయని నిపుణులు సూచిస్తున్నారు.
* పండు మీద ఉప్పు చల్లడం ద్వారా, శరీరంలో ఉప్పు పరిమాణం పెరుగుతుంది. ఏది శరీరానికి హానికరం. ప్రతి ఒక్కరూ ఉప్పును పరిమిత పరిమాణంలో తీసుకోవాలి. ఇలా పండుపై కూడా ఉప్పు చల్లితే శరీరంలో ఉప్పు పెరిగి బీపీ, గుండె సమస్యలు వస్తాయి.
* ఉప్పును ఎక్కువగా పండ్లపై చల్లుకొని తింటే శరీరంలో సోడియం స్థాయిలు పెరుగుతాయి. దీనివల్ల శరీరం ఉబ్బినట్లు కనిపిస్తాయి. చేతులు, కాళ్లు ఉబ్బినట్లు కనిపిస్తే మీరు ఉప్పు ఎక్కువగా తీసుకుంటున్నట్లు అర్థం చేసుకోవచ్చు.
* పండ్లపై ఉప్పును చల్లుకొని తినడం వల్ల కిడ్నీ సంబంధిత సమస్యలు కూడా వస్తాయని నిపుణులు చెబుతున్నారు. దీనికి ప్రధాన కారణం శరీరంలో సోడియం స్థాయిలు పెరగడమే.
* చూశారుగా పండ్లపై ఉప్పును చల్లుకొని తినడం వల్ల ఎన్ని నష్టాలు కలుగుతాయో. కాబట్టి ఈ అలవాటు మీక్కూడా ఉంటే వెంటనే మానేయాలని నిపుణులు చెబుతున్నారు. పండ్లను నేరుగా తీసుకుంటేనే మేలు జరుగుతుంది.
నోట్: పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి నిపుణుల సూచనలు పాటించడమే ఉత్తమం.
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..




