- Telugu News Photo Gallery What is the Cholera Symptoms and Causes, Treatment, Check here is details in Telugu
Cholera Disease: ముంచుకొస్తున్న కలరా.. జాగ్రత్తగా ఉండకపోతే డేంజరే!
చలి కాలం పోయి.. ఎండా కాలం వచ్చింది. దీంతో వాతావరణంలో పరిస్థితులు మారాయి. ఈ క్రమంలోనే వ్యాధులు కూడా విజృంభిస్తున్నాయి. వేడి వాతావరణం కారణంగా.. వ్యాధులు విస్తరిస్తున్నాయి. మొన్నటిమొన్న గవదబిల్లల వైరస్‌తో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇప్పుడు మళ్లీ కలరా వేగంగా విస్తరిస్తోంది. ముందుగా బెంగుళూరులో కలరా కేసులు మొదలయ్యాయి. ఇప్పటికే పలువురు ఆస్పత్రి పాలయ్యారు. దీంతో అలెర్ట్ అయిన ఆరోగ్య శాఖ పలు..
Updated on: Apr 13, 2024 | 5:14 PM

చలి కాలం పోయి.. ఎండా కాలం వచ్చింది. దీంతో వాతావరణంలో పరిస్థితులు మారాయి. ఈ క్రమంలోనే వ్యాధులు కూడా విజృంభిస్తున్నాయి. వేడి వాతావరణం కారణంగా.. వ్యాధులు విస్తరిస్తున్నాయి. మొన్నటిమొన్న గవదబిల్లల వైరస్‌తో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇప్పుడు మళ్లీ కలరా వేగంగా విస్తరిస్తోంది.

ముందుగా బెంగుళూరులో కలరా కేసులు మొదలయ్యాయి. ఇప్పటికే పలువురు ఆస్పత్రి పాలయ్యారు. దీంతో అలెర్ట్ అయిన ఆరోగ్య శాఖ పలు రకాల జాగ్రత్తలు జారీ చేశారు. కలరా ముఖ్య లక్షణాలు ఏంటంటే అతిసారం, వాంతులు మొదలవుతాయి.

కలుషితమైన ఆహారం, నీరు తీసుకోవడం వల్ల కలరా వ్యాధి వస్తుంది. వైరస్, బ్యాక్టీరియాలు చిన్న ప్రేగుల్లోకి ప్రవేవించి విరోచనాలు, వాంతులకి కారణం అవుతుంది. రోడ్ల పక్కన ఆహారం తీసుకోవడం, వ్యక్తిగత పరిశుభ్రత పాటించకపోవడం వల్ల కూడా కలరా వ్యాప్తి చెందుతుంది.

కలరా వచ్చిన వాళ్లు కాళ్లూ, చేతులూ శుభ్రంగా కడుగుతూ ఉండాలి. వేడి నీరు, ఇంట్లో చేసిన ఆహారం మాత్రమే తీసుకోవాలి. ఈ వ్యాధి సోకడానికి 15 నుంచి 16 రోజులు పడుతుంది. కాబట్టి ముందుగానే వ్యాధి తీవ్రతరం కాకుండా చూసుకోండి.

అలాగే కలరా వచ్చిన వ్యక్తికి దూరగా ఉండాలి. చేతులు సరిగ్గా కడుక్కోకుండా మరొకరికి షేక్ హ్యాండ్ వంటివి ఇవ్వకూడదు. విరేచనాలు, వాంతులు జ్వరం, నీరసం, కండరాల తిమ్మిరి, బీపీ తగ్గడం వంటివి కలరా లక్షణాలు. సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే.. డేంజర్ అని నిపుణులు సూచిస్తున్నారు.




