AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఈ జంతువుల ఆయుష్షు కొన్ని రోజులు మాత్రమే..! అవేంటో తెలిస్తే ఆశ్చర్యపోతారు..

Shortest Life Span: భూమిపై నివసించే అన్ని ప్రాణులకు జీవితకాలం వేర్వేరుగా ఉంటుంది. తిమింగలాలు, సొరచేపలు, తాబేళ్లకు ఆయుష్షు ఎక్కువగా ఉంటుంది. అదే

ఈ జంతువుల ఆయుష్షు కొన్ని రోజులు మాత్రమే..! అవేంటో తెలిస్తే ఆశ్చర్యపోతారు..
Rabbit
uppula Raju
|

Updated on: Oct 17, 2021 | 4:47 PM

Share

Shortest Life Span: భూమిపై నివసించే అన్ని ప్రాణులకు జీవితకాలం వేర్వేరుగా ఉంటుంది. తిమింగలాలు, సొరచేపలు, తాబేళ్లకు ఆయుష్షు ఎక్కువగా ఉంటుంది. అదే సమయంలో చాలా తక్కువ ఆయుష్షు గల జీవులు కూడా ఉన్నాయి. ఒక సంవత్సరం లేదా కొన్ని నెలలు మాత్రమే జీవిస్తాయి. అతి తక్కువ రోజులు బతికే ప్రాణుల గురించి ఒక్కసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

1. కుందేలు కుందేలు అడవులలో కనిపించే ఒక అమాయక జంతువు. ప్రజలు తమ ఇళ్లలో కూడా పెంచుకుంటారు. అవి 8-12 సంవత్సరాలు మాత్రమే బతుకుతాయి. వీటిలో అనేక జాతులు కూడా ఉంటాయి. కుందేళ్ళ మరణానికి అతి పెద్ద కారణం ఆడ కుందేళ్ళలో అధిక కొవ్వు చేరడం లేదా గర్భాశయ క్యాన్సర్.

2. గినియా పందులు ఈ జంతువు దక్షిణ అమెరికాలో కనిపిస్తుంది. దీని జీవితకాలం 4 నుంచి 8 సంవత్సరాల మధ్య ఉంటుంది. వయోజన గినియా పంది బరువు 700 నుంచి1200 గ్రాములు మాత్రమే.

3. ఎలుకలు మన ఇళ్లలో కనిపించే ఎలుకల వయస్సు కూడా చాలా తక్కువ. ఎలుకలు గరిష్టంగా ఒక సంవత్సరం జీవితకాలం కలిగి ఉంటాయి.

4. డ్రాగన్ ఫ్లై నాలుగు రెక్కల డ్రాగన్ ఫ్లై సాయంత్రం పూట ఎక్కువగా కనిపిస్తుంది. ఇది అనేక రంగులను కలిగి ఉంటుంది. ఈ ప్రాణి గరిష్టంగా 4 నెలలు సజీవంగా ఉంటుంది.

5. ఈగలు సాధారణంగా ఈగలు ప్రతిచోటా కనిపిస్తాయి. ముఖ్యంగా తీపి వస్తువులు, మురికి ప్రదేశాలలో ఎక్కువగా ఉంటాయి. వీటి జీవితకాలం 4 వారాలు మాత్రమే.

6. దోమ దోమ భూమిపై అతి తక్కువ ఆయుష్షు గల ప్రాణి. కేవలం 24 గంటలు మాత్రమే బతుకుతుంది. అందుకే వాటిని ‘వన్ డే బగ్స్’ అని కూడా అంటారు.

టీమిండియా కోచ్‌ ఆఫర్‌ని తిరస్కరించిన ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్‌.. ఎందుకో తెలుసా..?