చొక్కా గుండీలు మహిళలకు ఎడమవైపు.. పురుషులకు కుడి వైపున ఉంటాయి..! ఎందుకో మీకు తెలుసా..?

Shirt Buttons : ప్రాచీన కాలంలో పురుషులు ఎప్పుడూ ధోతి-కుర్తా, మహిళలు చీరలు ధరించేవారు. ప్రత్యేక ప్రమాణాలు అంటూ ఏవీ ఉండేటివి కాదు.

చొక్కా గుండీలు మహిళలకు ఎడమవైపు.. పురుషులకు కుడి వైపున ఉంటాయి..! ఎందుకో మీకు తెలుసా..?
Men Woman Shirts
Follow us

|

Updated on: May 06, 2021 | 5:54 PM

Shirt Buttons : ప్రాచీన కాలంలో పురుషులు ఎప్పుడూ ధోతి-కుర్తా, మహిళలు చీరలు ధరించేవారు. ప్రత్యేక ప్రమాణాలు అంటూ ఏవీ ఉండేవి కాదు. కానీ మారుతున్న కాలంతో పాటు చాలా విషయాల్లో మార్పు వచ్చింది. ఫ్యాషన్ పరిశ్రమ వచ్చిన తరువాత దుస్తుల రంగు, వాటి శైలి, వాటిని ధరించే పద్దతి అన్నీ మారిపోయాయి. ఫ్యాషన్ పరిశ్రమలో మహిళలకు వివిధ రకాల దుస్తులు ఎంచుకుంటే, పురుషులకు కూడా అనేక రకాల దుస్తులు ఉంటున్నాయి.

ఈ రోజు దుస్తులకు సంబంధించి ఫ్యాషన్ షోలు కూడా నిర్వహిస్తున్నారు. ఎలాంటి దుస్తులు వేసుకోవాలో నిర్ణయిస్తున్నారు. ఇప్పుడు తెలుసుకోవాల్సింది ఏంటంటే గమనించండి.. దుస్తులు ధరించేటప్పుడు లేదా కొనేటప్పుడు మహిళల షర్ట్ బటన్స్ ఎల్లప్పుడు ఎడమ వైపున ఉంటాయి. పురుషుల షర్ట్ బటన్స్ కుడి వైపున ఉంటాయి. అయితే ఇవి అలా ఎందుకు ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం.

అయితే షర్ట్ బటన్స్ ఇలా ఉండటం వెనుక చాలా కథలున్నాయి. ఒక ప్రసిద్ధ సిద్ధాంతం ప్రకారం.. పురుషులు ఆయుధాలను చేరుకోవడం కోసం సులభంగా ఉండటానికి చొక్కా బటన్లు కుడి వైపున అమర్చారని చెప్పారు. ప్రాచీన కాలంలో మహిళలు గుర్రపు స్వారీ చేసేవారు అప్పుడు ఎదురుగా వచ్చే గాలి వల్ల వారు ఇబ్బందిపడకూడదని వారి షర్ట్స్‌కు ఎడమ వైపున బటన్లు అమర్చారని చెబుతారు. ఇలా చేయడం వల్ల వారికి సౌకర్యంగా ఉండేదని తేలింది.

మరొక సిద్ధాంతం ప్రకారం.. సామాన్య ప్రజలు ధనవంతుల వలె దుస్తులు ధరించాలని కోరుకుంటారు. ఆ సమయంలో ధనిక మహిళల చొక్కాలకు ఎడమ వైపున బటన్లు ఉండేవి. ఈ పద్దతి ప్రజలను ఆకర్షించింది దీంతో మహిళలందరూ అలాగే దుస్తులు ధరించడం ప్రారంభించారు. బలమైన కారణం అంటూ దీనికి ఏది లేదు కానీ ఫ్యాషన్ పరిశ్రమలో ఈ పద్దతి ఇంకా ఎందుకు కొనసాగుతుందో మాత్రం తెలియదు.

Sri Lanka Bans: మా ఇంటికి రావద్దు.. మీ ఇంటికి పిలవద్దు.. భారతీయులకు మరో దేశం షాక్.. ప్రయాణ రాకపోకలపై శ్రీలంక నిషేధం

మాటలు వినలేం.. ఫోన్ కూడా రాదు.. నా జీవితంలో అతి పెద్ద దుర్దినం ఇదే.. ఎమోషనల్ పోస్ట్ చేసిన సురేఖా వాణి కూతురు