AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Covid Care: వీరికి కరోనా సోకే ప్రమాదం మరింత ఎక్కువ… హోం ఐసోలేషన్‏లో తీసుకోవాల్సిన జాగ్రత్తలెంటో తెలుసా..

కరోనా సెకండ్ వేవ్ ప్రస్తుతం భారతాన్ని అల్లోకల్లంగా మార్చేసింది. ఈ వైరస్ బారిన పడి ప్రాణాలు కోల్పోతుండగా.. మరికొందరు హోం ఐసోలేషన్ లో ఉంటూ

Covid Care: వీరికి కరోనా సోకే ప్రమాదం మరింత ఎక్కువ... హోం ఐసోలేషన్‏లో తీసుకోవాల్సిన జాగ్రత్తలెంటో తెలుసా..
Covid 19
Rajitha Chanti
|

Updated on: May 06, 2021 | 2:53 PM

Share

కరోనా సెకండ్ వేవ్ ప్రస్తుతం భారతాన్ని అల్లోకల్లంగా మార్చేసింది. ఈ వైరస్ బారిన పడి ప్రాణాలు కోల్పోతుండగా.. మరికొందరు హోం ఐసోలేషన్ లో ఉంటూ చికిత్స తీసుకుంటున్నారు. అయితే ఈ కోవిడ్ సెకండ్ వేవ్ లో వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికి సోకుతుంది. అయితే అందులో కొందరు మాత్రమే ఈ మహమ్మారి నుంచి కోలుకుంటున్నారు. తాజాగా అధ్యయనాల ప్రకారం గుండె జబ్బుల్లాంటి సీరియస్ వ్యాధులతో బాధపడే వారికి వైరస్ త్వరగా సోకే ప్రమాదముందని తెలీంది. ఇక దీనికి తగిన జాగ్రత్తలు తీసుకోకుండా నిర్లక్ష్యం చేస్తే చాలా ప్రమాదం ఎక్కువే. అయితే ఈ కరోనాకు సంబంధించిన కచ్చితమైన చికిత్స, అవసరమైన నియమ, నిబంధనలను పాటించకపోతే తీవ్ర సమస్యలు వస్తాయి. అలాగే కరోనాలో ఉండే అన్ని రకాల కాంప్లికేషన్లు వచ్చి మల్టీ ఆర్గాన్ ఫెయుల్యూర్ వరకు ప్రమాదం కూడా ఉంటుంది.

ఇక షుగర్, బీపీ ఉండి కరోనా సోకినంత మాత్రాన వెంటనే ఆసుపత్రిలో చేరాల్సిన అవసరం లేదని నిపుణులు సూచిస్తున్నారు. షుగర్, బీపీని నియంత్రణలో ఉంచుకోగలిగినవారు సులువుగానే బయటపడతారు. అలాగే అందరూ ఆసుపత్రులకు వెళ్ళాల్సిన అవసరం ఏమాత్రం లేదు. మీకు అలాంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించి వారి సూచనల మేరకే వేసుకోవాల్సిన మందులు, ఇతర విషయాలపై జాగ్రత్తలు తీసుకోవడం ఉత్తమం. ఇక కరోనా పాజిటివ్ అని వచ్చిన తర్వాత మరి అత్యవసరమైతే కానీ ఆసుపత్రులకు వెళ్ళకూడదు. హోం ఐసోలేషన్లో ఉంటూ మల్టీ విటమిన్లను బాగా తీసుకోవాలి. కడుపు, ఛాతీపై బోర్లా పడుకొని బాగా బ్రీతింగ్ ఎక్సర్ సైజులు చేయాలి. ఇక డాక్టర్లు ఇచ్చిన మందులను కూడా క్రమం తప్పకుండా వాడాలి. భయం, ఆందోళన, ఒత్తిళ్లకు గురికాకుండా సమస్యను ధైర్యంగా ఎదుర్కోవాలని.. భయంతో వ్యాధి సమస్య మరింత పెరుగే అవకాశం ఉందని డాక్టర్స్ సూచిస్తున్నారు.

Also Read: కరోనా కాలంలో ఇంట్లో ఉండే బరువు తగ్గడానికి ప్రయత్నిస్తున్నారా ? అయితే ఇలాంటి ఫుడ్ తీసుకుంటే రిజల్ట్ పక్కా..

Covid Care: బీపీ, షుగర్, ఒబేసిటీ ఉన్నవారు కరోనా రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఎంటో తెలుసా..