Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Oxygen Cylinder: ఆక్సిజన్ సిలిండర్ల వినియోగంలో జాగ్రత్తలు.. ప్రమాదాల నివారణకు పాటించాల్సిన సూచనలు

Oxygen Cylinder: కరోనా మహహ్మారి నేపథ్యంలో ముఖ్యంగా ఆక్సిజన్‌ అనేది అత్యవసరంగా మారింది. పేషెంట్ల ఆరోగ్యం విషమిస్తున్నందున ఆక్సిజన్‌ అవసరం ఎక్కువైపోయింది. దీంతో.

Oxygen Cylinder: ఆక్సిజన్ సిలిండర్ల వినియోగంలో జాగ్రత్తలు.. ప్రమాదాల నివారణకు పాటించాల్సిన సూచనలు
Oxygen Cylinder
Follow us
Subhash Goud

|

Updated on: May 06, 2021 | 2:56 PM

Oxygen Cylinder: కరోనా మహహ్మారి నేపథ్యంలో ముఖ్యంగా ఆక్సిజన్‌ అనేది అత్యవసరంగా మారింది. పేషెంట్ల ఆరోగ్యం విషమిస్తున్నందున ఆక్సిజన్‌ అవసరం ఎక్కువైపోయింది. దీంతో ఆక్సిజన్‌ సిలిండర్లకు డిమాండ్‌ పెరిగిపోయింది. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాల చొరవతో ఆక్సిజన్‌ సిలిండర్ల సరఫరా ఊపందుకుంది. అయితే ఆక్సిజన్‌కు పెరిగిన డిమాండ్ నేపథ్యంలో సిలిండర్ల తరలింపులో ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఆక్సిజన్‌ సిలిండర్ల తరలింపు, నిల్వ, ఆసుపత్రుల్లో పైపుల ద్వారా రోగుల ఛాంబర్లకు సరఫరా, ఖాళీ అయిన సిలిండర్ల మార్పు తదితర పనులు లోపించడంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. అమెరికాలోని ప్రముఖ ఇంజనీరింగ్ కన్సల్టెంట్‌ సంస్థ డబ్ల్యు హెచ్ ఏ ఇంటర్నేషనల్ సిలిండర్ల వినియోగం, నిల్వపై పలు సిఫారసులు చేసింది. ఈ సంస్థ అమెరికా అంతరిక్ష సంస్థ ‘నాసా’కు సేవలందిస్తోంది. ఇందుకు సంబంధించిన  పలు సూచనలు, సలహాలు అందజేస్తోంది.

నిల్వ చేయడంలో.. ఈ ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన చర్యలు..

► సిలిండర్లు ఎల్లప్పుడు నిలువుగా ఉంచి స్టోర్ చేయాలి. ► సిలిండర్లకు వాల్వ్ రక్షణ క్యాప్‌లు, వాల్వ్‌ అవుట్ లెట్‌లకు సీల్ ఉండేలా చూడాలి ► సిలిండర్లను నిర్ణీత ప్రదేశంలోనే స్టోర్ చేయాలి. ► ఖాళీ, ఆక్సిజన్ తో కూడిన సిలిండర్లను వేరు వేరుగా ఉంచాలి. ► నిల్వ ప్రదేశాల్లో గాలి, వెలుతురు వచ్చే విధంగా ఉండాలి. ► వాతావరణంలోని మార్పులతో ప్రభావితం కాని ప్రదేశాలు ఉండాలి. ► సిలిండర్లను మండే స్వభావమున్న మెటిరీయల్స్‌కు 20 అడుగుల దూరంగా, చల్లని, పొడి ప్రదేశాల్లో ఉంచాలి. ► ఇంధన గ్యాస్ సిలిండర్లకు 20 అడుగుల దూరంలో ఆక్సిజన్ సిలిండర్లను ఉంచాలి ► సిలిండర్లలో వాయువును అత్యంత పీడనం(కంప్రెస్) తో నింపుతారు కాబట్టి వాటిని జాగ్రత్తగా ఉపయోగించాల్సుంటుంది. ► వీటిని ఎత్తైన ప్రదేశం నుంచి జారవిడవడం, ఎత్తేయడం చేస్తే.. ఆక్సిజన్ వాయువు లీక్ అయి సిలిండర్లు రాకెట్ వలే పైకెగరే ప్రమాదాలు జరుగుతాయి. ► ఆక్సిజన్ వాయువు సొంతంగా మండిపోయే స్వభావం లేదు. కానీ మండటానికి అక్సిజన్ అవసరం కాబట్టి మండే స్వభావమున్న ఇంధనం, గ్యాస్ తదితర మెటీరియల్స్ కు దూరంగా ఉంచాలి. ► అనుభవమున్న, శిక్షణ పొందిన వారే సిలిండర్లను హ్యాండిల్ చేయాలి ► వ్యక్తిగత రక్షణ పరికరాలు(పీపీఈ), రక్షణ గ్లాస్‌లను ధరించాలి. ► చేతులకు, గ్లోవ్స్ కు ఎలాంటి ఆయిల్, గ్రీజ్ లాంటివి అంటించుకోకూడదు. ► వాడే ముందు సిలిండర్ లేబుల్‌ను తప్పకుండా పరిశీలించాలి.

రెండో దశలో…

► సిలిండర్ ఉపయోగించడానికి ముందు వాల్వ్ కు అమర్చిన రక్షణ క్యాప్ తొలగించాలి. దానికి ఒకవేళ ప్లాస్టిక్ ర్యాపింగ్ ఉంటే దాన్ని పూర్తిగా తొలగించాలి. ► వాల్వ్ సరిగ్గా ఉందన్న విషయాన్ని చూసి నిర్ధారించుకోవాలి. ఒకవేళ వాల్వు వద్ద లీకేజ్, ఇతర పదార్థాలు పేరుకుపోయి ఉంటే సిలిండర్‌ను ఓపెన్ చేయకుండా తిరిగి వెండర్ (విక్రేత)కు వాపస్ చేయాలి. ► సిలిండర్‌కు పక్కగా నిలబడి వాల్వును చిన్నగా ఓపెన్ చేసి చెక్ చేసుకోవాలి. అనంతరం వాల్వును మూసివేయాలి. ఓపెన్, మూసివేసే సమయాల్లో వాల్వును నిర్ణీత పరిధి మేరకు పనిముట్లతో ఓపెన్, టైట్ చేయాల్సి ఉంటుంది. ► సిలిండర్‌ను వినియోగించడానికి వాయువు అవుట్ లెట్‌కు కనెక్షన్ ఇవ్వడానికి పూర్తి స్థాయిలో వాల్వును ఓపెన్ చేయాల్సి ఉంటుంది. ► నిర్ణీత గేజ్ పరికరంతో.. వాయువు ఒత్తిడిని కొలవాలి. ► 25-100 పీఎస్ ఐ(170-700కేపీఎ) కంటె తక్కవగా ఉంటే సిలిండర్ ను ఉపయోగించకూడదు. ► వాల్వును ఓపెన్ చేస్తున్న సమయంలో ఆక్సిజన్ లీక్ అవుతున్న శబ్ధం వచ్చినట్లయితే .. వాల్వును వెంటనే మూసివేయాలి ► పై పరిశీలనలు పూర్తయిన తర్వాత రెగ్యులేటర్ నుంచి ఆక్సిజన్ సరఫరా జరిగేలా చేయాల్సి ఉంటుంది. ► నిర్ణీత పరిమాణంలో అవుట్ లెట్ నుంచి ఆక్సిజన్ సరఫరా పూర్తయిన తర్వాత వాల్వును మూయాల్సి ఉంటుంది.

సిలిండర్ ఖాళీ అయితే..

► సిలిండర్‌లో ఒత్తిడి( 25-100పీఎస్ఐజీ) కంటే తక్కువగా ఉంటుంది. సిలిండర్ అవుట్ లెట్ కనెక్షన్ డిస్ కనెక్ట్ చేయాలి. ► వాయువు సరఫరా అయ్యే పైప్‌కు డస్ట్ క్యాప్, బిగించాలి. సిలిండర్ వాల్వుకు రక్షణ క్యాప్ బిగించాలి.