Sago Benefits: రోజూ సగ్గుబియ్యం తింటే ఆ సమస్యల నుంచి ఉపశమనం.. ఇంకా బోలెడన్ని ప్రయోజనాలు..

రోజూ సగ్గుబియ్యం తింటే.. ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుందని ఆరోగ్య నిపుణులు పేర్కొంటున్నారు. సగ్గుబియ్యంతో ఇంట్లోనే వివిధ రకాల వంటకాలను తయారు చేసుకోవచ్చు.

Sago Benefits: రోజూ సగ్గుబియ్యం తింటే ఆ సమస్యల నుంచి ఉపశమనం.. ఇంకా బోలెడన్ని ప్రయోజనాలు..
Sago Benefits
Follow us

|

Updated on: Oct 13, 2022 | 8:01 PM

తెల్లటి ముత్యాల మాదిరిగా కనిపించే సగ్గుబియ్యంలో ఎన్నో పోషకాలు దాగున్నాయి. రోజూ సగ్గుబియ్యం తింటే.. ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుందని ఆరోగ్య నిపుణులు పేర్కొంటున్నారు. సగ్గుబియ్యంతో ఇంట్లోనే వివిధ రకాల వంటకాలను తయారు చేసుకోవచ్చు. ముఖ్యంగా దీని ద్వారా ఖిచ్డీ, పాయసం, గంజిలా తయారు చేస్తారు. చాలామంది దీనిని ఉపవాస సమయంలో తినడానికి ఇష్టపడతారు. దీన్ని రోజూ తీసుకోవడం వల్ల అనేక సమస్యలను అధిగమించవచ్చని నిపుణులు పేర్కొంటున్నారు. సగ్గుబియ్యంలో ప్రొటీన్, క్యాల్షియం, ఐరన్, మెగ్నీషియం, పొటాషియం వంటి పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. దీనితో పాటు క్యాలరీల పరిమాణం కూడా చాలా తక్కువగా కనిపిస్తుంది. ఇవి ఎముకలను బలోపేతం చేయడంతో పాటు రక్తపోటును నియంత్రణలో ఉంచుతాయి. అటువంటి పరిస్థితిలో సగ్గుబియ్యం తినడం వల్ల ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం..

శరీరాన్ని షేప్‌గా మారుస్తాయి: సగ్గుబియ్యం తినడం వల్ల శరీర బరువు పెరుగుతుంది. ఇది మంచి మొత్తంలో కార్బోహైడ్రేట్లు, కేలరీలను కలిగి ఉంటుంది, ఇది బరువును పెంచడంలో సహాయపడుతుంది. శరీరం సన్నగా ఉంటే, మీ ఆహారంలో సగ్గుబియ్యాన్ని ఖచ్చితంగా చేర్చుకోండి. ఇవి శరీరాన్ని ఫిట్‌గా, షేప్ గా మారుస్తాయి.

ఎముకలను బలంగా మారుస్తాయి: రోజూ సగ్గుబియ్యం తింటే ఎముకలు దృఢంగా మారుతాయి. ఇందులో మంచి మొత్తంలో కాల్షియం, మెగ్నీషియం ఉంటుంది. ఇది ఎముకల పెరుగుదల, బలాన్ని ప్రోత్సహిస్తుంది. ఇది కాకుండా, సగ్గుబియ్యంలో ఐరన్ కూడా ఉంటుంది. ఇది బోలు ఎముకల వ్యాధి ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది.

ఇవి కూడా చదవండి

రక్తపోటును నియంత్రిస్తాయి: అధిక రక్తపోటు సమస్యను అధిగమించాలనుకుంటే సగ్గుబియ్యం తినాలని నిపుణులు సూచిస్తున్నారు. దీనిలో ఫైబర్, ఫాస్పరస్, పొటాషియం, ఫాస్పరస్ ఉన్నాయి. ఇవి రక్తపోటును నియంత్రించడంతోపాటు శరీరంలోని కొలెస్ట్రాల్ స్థాయిని కూడా తగ్గిస్తాయి.

మెదడుకు మేలు: సగ్గుబియ్యం తినడం వల్ల మంచి శారీరక అభివృద్ధి జరగడమే కాకుండా మెదడు ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. ఇందులో ఉండే ఫోలేట్ మెదడు సమస్యలను దూరం చేస్తుంది.

గమనిక: ఈ కథనంలో పేర్కొన్న పద్ధతులు కేవలం అవగాహన కోసమే అందించాం. వీటిని పాటించే ముందు దయచేసి డాక్టర్ లేదా నిపుణుల సలహాలు తప్పక తీసుకోవాలి.

మరిన్ని హెల్త్ వార్తల కోసం..

రూ. 7 లక్షల పన్ను ఆదా.. ఐటీఆర్ ఫైల్‌ చేసే ముందు ఇవి తెలుసుకోండి
రూ. 7 లక్షల పన్ను ఆదా.. ఐటీఆర్ ఫైల్‌ చేసే ముందు ఇవి తెలుసుకోండి
ఆవు మూత్రంతో స్నానం,పేడతో సన్‌స్క్రీన్‌..! వాటికి మెషీన్ గన్స్ తో
ఆవు మూత్రంతో స్నానం,పేడతో సన్‌స్క్రీన్‌..! వాటికి మెషీన్ గన్స్ తో
గెస్ట్ హౌస్‌కు రాకపోతే ఫొటోలు మార్ఫ్ చేస్తా..
గెస్ట్ హౌస్‌కు రాకపోతే ఫొటోలు మార్ఫ్ చేస్తా..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
ప్రమాదకరమైన కామెర్ల వ్యాధికి చెక్ పెట్టే మొక్క ఇదే!
ప్రమాదకరమైన కామెర్ల వ్యాధికి చెక్ పెట్టే మొక్క ఇదే!
అయ్య బాబోయ్.. వీడెవడండి బాబు.. థియేటర్‌లో ల్యాప్‌టాప్‌తో వర్క్
అయ్య బాబోయ్.. వీడెవడండి బాబు.. థియేటర్‌లో ల్యాప్‌టాప్‌తో వర్క్
లసిత్ మలింగను పక్కకు తోసేసిన హార్దిక్ పాండ్యా! వీడియో వైరల్
లసిత్ మలింగను పక్కకు తోసేసిన హార్దిక్ పాండ్యా! వీడియో వైరల్
వరంగల్ రాజకీయాల్లో నాటకీయ పరిణామం.. ఒకరు ఇన్.. మరొకరు అవుట్.?
వరంగల్ రాజకీయాల్లో నాటకీయ పరిణామం.. ఒకరు ఇన్.. మరొకరు అవుట్.?
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
తమలపాకును దిండు కింద పెట్టి పడుకుంటే అద్భుత లాభాలు..
తమలపాకును దిండు కింద పెట్టి పడుకుంటే అద్భుత లాభాలు..