AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తమలపాకు తీగకు అరుదైన పువ్వు.. మీరు ఎప్పుడైనా చూశారా? ఎంతటి అదృష్టమో కదా!

తమలపాకులు భారతీయ సంస్కృతిలో ఒక అంతర్భాగం. పెళ్లిళ్లలో, మతపరమైన వేడుకలలో, అతిథులుగా, లేదా కేవలం మన దైనందిన జీవితంలో వక్క, పాన్ తినే అలవాటులో భాగంగా తమలపాకులు ప్రతిచోటా కనిపిస్తాయి. ప్రజలు వాటిని ఇష్టంగా తింటారు. అనేక ఆయుర్వేద మందుల తయారీలో కూడా వీటిని ఉపయోగిస్తారు. కానీ, మీరు ఎప్పుడైనా తమలపాకు పువ్వును చూశారా? చాలా మంది చూడలేదు అని సమాధానం ఇస్తారు. కానీ, ఇది నిజం. తమలపాకు పువ్వును చూడటం కూడా అదృష్టం అంటున్నారు చాలా మంది నెటిజన్లు.

తమలపాకు తీగకు అరుదైన పువ్వు.. మీరు ఎప్పుడైనా చూశారా? ఎంతటి అదృష్టమో కదా!
Rare Betel Leaf Flower
Jyothi Gadda
|

Updated on: Sep 02, 2026 | 11:02 AM

Share

మీరు తమలపాకులను చాలాసార్లు చూసి ఉంటారు. పండుగలు, పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాల్లోనూ తమలపాకులను విరివిగా ఉపయోగిస్తూ ఉంటారు. చాలా మంది ప్రజలు తమలపాకులను ఎంతో ఇష్టంగా తింటారు. అంతేకాకుండా, ఈ ఆకులను వివిధ ఔషధ మూలికలను తయారు చేయడానికి కూడా ఉపయోగిస్తారు. కానీ, తమలపాకు పువ్వులు కూడా ఉన్నాయని చెబితే నమ్ముతారా..? చాలా మందికి ఈ విషయం తెలిసి ఉండకపోవచ్చు. కానీ, ఇటీవల ఒక మహిళ సోషల్ మీడియాలో ప్రజలకు తమలపాకు పువ్వులను చూపించినప్పుడు, అందరూ ఆశ్చర్యపోయారు.

ఇటీవల, ఒక మహిళ తమలపాకు తీగపై పూస్తున్న పువ్వుల ఫోటోలు, వీడియోలను సోషల్ మీడియాలో పంచుకోవడంతో ప్రజలు ఆశ్చర్యపోయారు. తాము ఎన్నో ఏళ్లుగా తమలపాకులను చూస్తున్నామని, కానీ పువ్వులను చూడటం ఇదే మొదటిసారి అని చాలామంది వ్యాఖ్యానించారు. తమలపాకు మొక్క శాస్త్రీయ నామం పైపర్ బెటెల్ అనేది పైపరేసియే కుటుంబానికి చెందిన ఒక తీగలాంటి మొక్క. దీనిని ప్రధానంగా ఆకుల కోసం పెంచుతారు. దీని ఆకులు గుండె ఆకారంలో, ప్రకాశవంతమైన ఆకుపచ్చ రంగులో, సువాసనతో ఉంటాయి. అయితే, ఇది పువ్వులను కూడా పూస్తుందని చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు.

ఇవి కూడా చదవండి

తమలపాకు తీగ పూత పూయాలంటే దానికి ప్రత్యేకమైన ఉష్ణోగ్రత, అధిక తేమ, తగినంత వయస్సు ఉండాలి. సాధారణంగా మన ఇళ్లల్లో లేదా కుండీలలో పెరిగే తీగలకు అనుకూలమైన వాతావరణం దొరకక ఇవి పూత పూయవు. సరైన సహజ వాతావరణం లభించినప్పుడు మాత్రమే సంవత్సరాల తర్వాత ఇవి వికసిస్తాయి.

భారతీయ సాంప్రదాయ విశ్వాసాల ప్రకారం తమలపాకు తీగ పూత పూయడం ఎంతో అరుదైన, పవిత్రమైన విషయంగా పరిగణిస్తారు. తమలపాకు మొక్క ఇంట్లో పూత పూస్తే ఆ ఇంట ఐశ్వర్యం, శ్రేయస్సు కలుగుతాయని, లక్ష్మీదేవి ఆశీస్సులు ఉంటాయని నమ్ముతారు. ఎన్నో ఏళ్ల తర్వాత తమలపాకు తీగ వికసించడం అనేది ఆ కుటుంబానికి శుభ పరిణామాలకు సూచిక అని పెద్దలు అంటారు.

వీడియో ఇక్కడ చూడండి..

సాధారణంగా ఆకులను మాత్రమే చూసే ప్రజలు, ఈ అరుదైన తమలపాకు పువ్వును చూసి ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. మా జీవితంలో తమలపాకు పువ్వును చూడటం ఇదే మొదటిసారి అంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు ఫోటోలను షేర్ చేస్తూ కామెంట్లు పెడుతున్నారు.

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us