AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మీ బాత్రూంలో ఈ వస్తువులు ఉన్నాయా? వెంటనే తీసేయండి.. లేదంటే దరిద్రం, ఆర్థిక నష్టాలు తప్పవు!

వాస్తు శాస్త్రం ప్రకారం మనం నివసించే ఇల్లు ఒక శక్తి కేంద్రం. ఇంట్లో ఉంచే ప్రతీ వస్తువు, దాని దిశ మన జీవితంపై సానుకూల లేదా ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయి. చాలామంది పూజ గది, బెడ్‌రూమ్, సింహద్వారం వాస్తు గురించి జాగ్రత్తలు తీసుకుంటారు. కానీ, బాత్రూమ్ విషయంలో నిర్లక్ష్యం వహిస్తారు. వాస్తు ప్రకారం ఇళ్లల్లో అత్యధికంగా ప్రతికూల శక్తి ఉత్పత్తి అయ్యే ప్రదేశం బాత్రూమ్. అక్కడ ఉంచే కొన్ని వస్తువుల వల్ల వాస్తు దోషాలు ఏర్పడి దరిద్రం వెంటాడుతుందని శాస్త్రం చెబుతోంది. బాత్రూంలో పొరపాటున కూడా ఉంచకూడని వస్తువులు ఏవో ఇప్పుడు చూద్దాం.

మీ బాత్రూంలో ఈ వస్తువులు ఉన్నాయా? వెంటనే తీసేయండి.. లేదంటే దరిద్రం, ఆర్థిక నష్టాలు తప్పవు!
Bathroom Vastu Tips
Jyothi Gadda
|

Updated on: Sep 01, 2026 | 2:12 PM

Share

వాస్తు శాస్త్రం ప్రకారం ఇల్లు కేవలం నివాసం మాత్రమే కాదు, అదొక శక్తి కేంద్రం. ఇంటిలోని ప్రతి ప్రదేశం సానుకూల లేదా ప్రతికూల శక్తులను విడుదల చేస్తుంది. ముఖ్యంగా బాత్రూమ్ అత్యధికంగా ప్రతికూల శక్తిని ఉత్పత్తి చేసే అవకాశం ఉన్న ప్రదేశం. బాత్రూమ్‌ను ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచుకోవడం వల్ల ఇంట్లో సానుకూల శక్తి, ప్రశాంతత మరియు ఐశ్వర్యం పెరుగుతాయి. బాత్రూం విషయంలో చేయకూడని తప్పులు ఏంటో ఇప్పుడు చూద్దాం..

తెగిపోయిన లేదా విరిగిన చెప్పులు:

బాత్రూంలో ఉపయోగించడానికి పాతవి లేదా విరిగిన చెప్పులను వాడటం చాలామందికి అలవాటు. కానీ వాస్తు ప్రకారం విరిగిన చెప్పులు ప్రతికూల శక్తిని తీవ్రంగా ఆకర్షిస్తాయి. ఇవి ఇంట్లోకి దరిద్రాన్ని ఆహ్వానిస్తాయి.

పగిలిన అద్దం:

బాత్రూంలో పగిలిన లేదా చీలిన అద్దాన్ని ఉంచడం తీవ్రమైన వాస్తు దోషానికి దారితీస్తుంది. ఇది మానసిక ప్రశాంతతను దెబ్బతీయడమే కాకుండా, ఊహించని ఆర్థిక సమస్యలను తెచ్చిపెడుతుంది.

ఇవి కూడా చదవండి

ఖాళీ బకెట్:

బాత్రూంలో ఖాళీ బకెట్‌ను వదిలేయడం దురదృష్టానికి సంకేతం. బకెట్‌లో ఎప్పుడూ నీటిని నింపి ఉంచాలి. ఒకవేళ నీటితో నింపడం సాధ్యం కాకపోతే, బకెట్‌ను బోర్లించి ఉంచడం శ్రేయస్కరం.

లీకయ్యే కుళాయిలు:

బాత్రూంలో కుళాయి నుండి నీరు నిరంతరం బొట్లు బొట్లుగా కారడం ధన నష్టానికి సంకేతం. నీరు వృథా అయినట్లే ఇంట్లో లక్ష్మీదేవి నిలవక ఐశ్వర్యం హరించిపోతుంది. కాబట్టి లీకేజీలను వెంటనే బాగు చేయించాలి.

తడి బట్టలు, రాలిపోయిన జుట్టు:

స్నానం చేసిన తర్వాత విడిచిన తడి బట్టలను బాత్రూంలోనే వదిలేయడం వల్ల సూర్య దోషం కలుగుతుంది. అలాగే స్నానం చేసేటప్పుడు రాలిన జుట్టును మురుగు కాల్వ వద్దే వదిలేయడం శని, కుజ దోషాలకు కారణమవుతుంది. ఇది పేదరికానికి దారితీస్తుంది. కాబట్టి, జుట్టును వెంటనే శుభ్రం చేయాలి.

బాత్రూంలో మొక్కలు: సాధారణంగా బాత్రూమ్‌లలో మొక్కలను పెంచడం వాస్తు ప్రకారం మంచిది కాదు. నిపుణుల సలహా లేకుండా మొక్కలను ఉంచితే ప్రతికూలత మరింత పెరుగుతుంది. బాత్రూమ్‌ను ఎల్లప్పుడూ పొడిగా, శుభ్రంగా ఉంచుకుంటూ ఈ వాస్తు నియమాలను పాటిస్తే ఇంట్లో సానుకూల శక్తి పెరిగి ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి.

(Disclaimer: ఈ కథనంలోని రత్నాలు, జ్యోతిష్య ఫలితాలు సంప్రదాయ విశ్వాసాలు, జ్యోతిష్య అభిప్రాయాల ఆధారంగా అందించబడ్డాయి. వీటికి శాస్త్రీయ ఆధారాలు లేవు. రత్నం ధరించే ముందు వ్యక్తిగత జాతకాన్ని పరిశీలించి నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.)

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us
దయచేసి నాకు సపోర్ట్ చేయండి.. పండు మాస్టర్ వీడియో..
దయచేసి నాకు సపోర్ట్ చేయండి.. పండు మాస్టర్ వీడియో..
తెలంగాణకు మూడ్రోజుల పాటు వర్షసూచన.. లేటెస్ట్ రిపోర్ట్..
తెలంగాణకు మూడ్రోజుల పాటు వర్షసూచన.. లేటెస్ట్ రిపోర్ట్..
జుట్టు పెరుగుదలకు కరివేపాకా? రోజ్‌మేరీనా? రెండింట్లో ఏది బెస్ట్‌?
జుట్టు పెరుగుదలకు కరివేపాకా? రోజ్‌మేరీనా? రెండింట్లో ఏది బెస్ట్‌?
రోహిత్ శర్మకు హ్యాండిచ్చేస్తాడా.. అగార్కర్ మార్క్ వన్డే టీం ఇదేనా
రోహిత్ శర్మకు హ్యాండిచ్చేస్తాడా.. అగార్కర్ మార్క్ వన్డే టీం ఇదేనా
పెళ్లి చేసుకోకపోవడానికి కారణం అదే.. కోవై సరళ..
పెళ్లి చేసుకోకపోవడానికి కారణం అదే.. కోవై సరళ..
వారెవ్వా.. అదృష్టం అంటే వీరిదే..కేతువు ఎఫెక్ట్‌తో వీరి లైఫ్ టర్న్
వారెవ్వా.. అదృష్టం అంటే వీరిదే..కేతువు ఎఫెక్ట్‌తో వీరి లైఫ్ టర్న్
ఈ రాశులవారి జీవితంలో ఊహించని టర్నింగ్ పాయింట్.. మీరున్నారా?
ఈ రాశులవారి జీవితంలో ఊహించని టర్నింగ్ పాయింట్.. మీరున్నారా?
వీరికి అడుగడుగునా ఐశ్వర్యం అదృష్టమే..బుధ సంచారంతో ఊహించని ధన లాభం
వీరికి అడుగడుగునా ఐశ్వర్యం అదృష్టమే..బుధ సంచారంతో ఊహించని ధన లాభం
విశ్వకర్మ పూజ ఎప్పుడు? పూజా సమయం, ప్రాముఖ్యత, విశేషాలు ఇవే!
విశ్వకర్మ పూజ ఎప్పుడు? పూజా సమయం, ప్రాముఖ్యత, విశేషాలు ఇవే!
పాక్ దౌత్యవేత్తకు భారత్ సమన్లు.. సముద్రంలో భారత యుద్ధనౌకను..
పాక్ దౌత్యవేత్తకు భారత్ సమన్లు.. సముద్రంలో భారత యుద్ధనౌకను..