AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఎక్కడ్నుంచి వచ్చిందో తెలియదు గానీ.. కోతులను తరిమికొడుతున్న ఎలుగుబంటి? అసలు సంగతి ఇదే!

ఎక్కడ చూసినా కోతుల బెడదతో ప్రజలు, రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చేతికి వచ్చిన పంటలను కోతుల దండు ధ్వంసం చేస్తుండటంతో రైతులకు తీవ్ర నష్టం వాటిల్లుతోంది. ఈ సమస్యను అధిగమించడానికి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం కాకర్లకు చెందిన రైతు వేముల నాగయ్య ఓ వినూత్న ఆలోచన చేశారు. తన పత్తి చేనును కోతుల నుండి కాపాడుకోవడానికి అతడు వేసిన ప్లాన్‌ ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్‌ అవుతోంది.

ఎక్కడ్నుంచి వచ్చిందో తెలియదు గానీ.. కోతులను తరిమికొడుతున్న ఎలుగుబంటి? అసలు సంగతి ఇదే!
Farmer Bear Costume
N Narayana Rao
| Edited By: |

Updated on: Sep 01, 2026 | 8:18 AM

Share

ప్రస్తుతం గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో కోతుల సంచారం తీవ్ర సమస్యగా మారింది. ఇళ్లపై బడటం, మనుషులపై దాడులు చేయడమే కాకుండా, కష్టపడి పంటలు సాగు చేసే రైతులకు కోతులు పెద్ద సవాలుగా పరిణమించాయి. ఒకవైపు ఎల్ నినో ప్రభావంతో వర్షాలు లేక, ఎండలకు వడలిపోతున్న పంటలను కాపాడుకునేందుకు రైతులు అరకొర నీటితో పోరాటం చేస్తున్నారు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో కోతుల దండు పంటలపైపడి కాపు, పూత, పిందెలను నాశనం చేస్తుండటంతో రైతులు దిక్కుతోచని స్థితిలో పడిపోతున్నారు.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం, కాకర్ల గ్రామానికి చెందిన వేముల నాగయ్య అనే రైతు తన పొలంలో పత్తి సాగు చేశారు. ప్రస్తుతం పత్తి పంట కాపు, పూత, పిందె దశలో ఉంది. అయితే, ప్రతిరోజూ వందలాదిగా వస్తున్న కోతుల దండు చేనుపైబడి పూతను తుంచేస్తూ, పిందెలను కొరికి పడేస్తున్నాయి. కోతులను బెదిరించడానికి నాగయ్య ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలితం లేకుండా పోయింది. కోతుల బారి నుండి తన ప్రాణప్రదమైన పంటను రక్షించుకోవడానికి నాగయ్య ఒక వినూత్నమైన ఉపాయాన్ని ఆలోచించారు. ఆన్‌లైన్ షాపింగ్ ద్వారా దాదాపు రూ. 1,500 ఖర్చు చేసి ఎలుగుబంటిని పోలిన దుస్తులు, మాస్క్‌ను తెప్పించారు.

ఈ ఎలుగుబంటి దుస్తులను ధరించి ఆయన ప్రతిరోజూ తన పత్తి చేనులో తిరగడం ప్రారంభించారు. పొలంలో ఎలుగుబంటి సంచరిస్తుందని భావించిన కోతులు భయపడి ఆ దరిదాపుల్లోకి రావడానికి జంకుతున్నాయి. ఈ వినూత్న ప్రయోగంతో తన పొలంలో కోతుల బెడద గణనీయంగా తగ్గిందని నాగయ్య సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

సాధారణంగా దిష్టిబొమ్మలు లేదా శబ్దాలు చేసే పరికరాలు కొద్దిరోజులకే ప్రభావం కోల్పోతాయి. కానీ, మనిషే స్వయంగా ఎలుగుబంటి వేషధారణలో పొలంలో కదలడంతో కోతులు నిజంగానే క్రూరమృగం వచ్చిందేమోనని భయాందోళన చెందుతున్నాయి. రైతు నాగయ్య చేసిన ఈ తెలివైన ఆలోచన ఇప్పుడు చుట్టుపక్కల గ్రామాల రైతుల్లో తీవ్ర ఆసక్తిని రేకెత్తిస్తోంది. పలువురు రైతులు ఆయనను కలిసి ఈ ఎలుగుబంటి డ్రెస్ వివరాలు, దాన్ని ఎలా ఉపయోగించాలనే విశేషాలను అడిగి తెలుసుకుంటున్నారు. తక్కువ ఖర్చుతో పంటను కాపాడుకున్న ఈ రైతు ఆలోచనను పలువురు అభినందిస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us
ఇంగ్లిష్ అంటే భయం.. ఇప్పుడేమో Googleలో రూ.3 కోట్ల ప్యాకేజీతో జాబ్
ఇంగ్లిష్ అంటే భయం.. ఇప్పుడేమో Googleలో రూ.3 కోట్ల ప్యాకేజీతో జాబ్
గ్యాస్ కనెక్షన్ అడ్రస్ మార్చుకోవాలా..? ప్రాసెస్ చాలా సింపుల్..
గ్యాస్ కనెక్షన్ అడ్రస్ మార్చుకోవాలా..? ప్రాసెస్ చాలా సింపుల్..
ఒక వ్యక్తికి ఎన్ని బ్యాంక్ అకౌంట్స్ ఉండాలి.. ఎక్కువ ఉంటే ఏమౌతుంది
ఒక వ్యక్తికి ఎన్ని బ్యాంక్ అకౌంట్స్ ఉండాలి.. ఎక్కువ ఉంటే ఏమౌతుంది
రొయ్యల వెనుక ఉన్న నల్లటి నరాన్ని ఎందుకు తొలగించాలి? ఆరోగ్యానికి
రొయ్యల వెనుక ఉన్న నల్లటి నరాన్ని ఎందుకు తొలగించాలి? ఆరోగ్యానికి
'తల్లి బీడీలు చుట్టి చదివిస్తే.. కొడుకు IAS అయ్యాడు' UPSC టాపర్‌
'తల్లి బీడీలు చుట్టి చదివిస్తే.. కొడుకు IAS అయ్యాడు' UPSC టాపర్‌
ఆ హీరో నేను మారువేషంలో బిర్యానీ తినడానికి వెళ్లేవాళ్లం..
ఆ హీరో నేను మారువేషంలో బిర్యానీ తినడానికి వెళ్లేవాళ్లం..
గురుకుల విద్యతో లక్ష్యం వైపు దీక్షిత..
గురుకుల విద్యతో లక్ష్యం వైపు దీక్షిత..
మునగాకుతో రోటీ పచ్చడి.. ఇలా చేస్తే ముద్ద ముద్దకు ఆహా అనాల్సిందే
మునగాకుతో రోటీ పచ్చడి.. ఇలా చేస్తే ముద్ద ముద్దకు ఆహా అనాల్సిందే
'బదిలీ ఆర్డర్ టైప్ చేసేలోపు మంత్రిని అరెస్ట్ చేసి CMకే చుక్కలు'
'బదిలీ ఆర్డర్ టైప్ చేసేలోపు మంత్రిని అరెస్ట్ చేసి CMకే చుక్కలు'
తెలుగు సినిమా దెబ్బకు కన్నీళ్లు పెట్టుకుంటున్న నార్త్ ఆడియన్స్..
తెలుగు సినిమా దెబ్బకు కన్నీళ్లు పెట్టుకుంటున్న నార్త్ ఆడియన్స్..