AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రోజూ అవే పూరీలు ఏం తింటారు..ఓ సారి ఇలా ట్రై చేయండి..హెల్దీ, టేస్టీ మూంగ్‌దాల్ పాలక్ పూరీ మీ కోసమే..

మార్నింగ్‌ బ్రేక్‌ఫాస్ట్‌ తయారీ అంటే దాదాపు అందరూ తల్లులకు పెద్ద తలనొప్పిలాగే ఉంటుంది.. ఎందుకంటే.. ఇంట్లో పిల్లల నుంచి పెద్దల వరకు ఒకే రకం టిఫిన్ పెడితే ఒప్పుకోరు.. ఒక్కోక్కరూ ఒక్కోటి అడుగుతుంటారు.. అలాంటి టైమ్‌లోనే ఇలా కొత్త రుచితో పాలకూర, పెసరపప్పు పూరీలు చేయండి..! ప్రతిరోజూ చేసుకునే సాధారణ పూరీల కంటే భిన్నంగా, ఆరోగ్యకరమైన పద్ధతిలో రుచికరమైన మూంగ్‌దాల్ పాలక్ పూరీని సులభంగా తయారు చేసుకోవచ్చు. పిల్లల లంచ్ బాక్స్‌లోకి, టిఫిన్ సమయానికి లేదా పండుగల వేళ ప్రత్యేక వంటకంగా ఈ పూరీలు ఎంతో అనువుగా ఉంటాయి.

రోజూ అవే పూరీలు ఏం తింటారు..ఓ సారి ఇలా ట్రై చేయండి..హెల్దీ, టేస్టీ మూంగ్‌దాల్ పాలక్ పూరీ మీ కోసమే..
Moong Dal Palak Poori
Jyothi Gadda
|

Updated on: Sep 01, 2026 | 7:32 AM

Share

పొద్దున బ్రేక్ ఫాస్ట్ అయినా లేదా సాయంత్రం పూట ఏదైనా ప్రత్యేకమైన రుచిని ఆస్వాదించాలనుకున్నప్పుడు మూంగ్‌దాల్ పాలక్ పూరీ సరైన ఎంపిక. సాధారణ పూరీలతో పోలిస్తే ఇది మరింత రుచికరంగా ఉండటమే కాకుండా ఆరోగ్యాన్ని పెంపొందించడంలోనూ కీలక పాత్ర పోషిస్తుంది. పెసరపప్పు, పాలకూర కలయిక వల్ల ఇది ప్రొటీన్లు, ఫైబర్ నిండిన బలవర్ధకమైన ఆహారంగా మారుతుంది.

కావలసిన పదార్థాలు:

గోధుమ పిండి: 2 కప్పులు

పెసరపప్పు: 1/2 కప్పు (కనీసం 2 గంటలు నానబెట్టినది)

ఇవి కూడా చదవండి

పాలకూర తురుము/పేస్ట్: 1 కప్పు (తేలికగా ఉడికించినది)

పచ్చిమిర్చి: 2

అల్లం: చిన్న ముక్క

వాము (అజ్వైన్): 1/2 స్పూన్

జీలకర్ర, పసుపు, కారం: తగినంత

ఉప్పు: రుచికి సరిపడా

నూనె: వేయించడానికి సరిపడా

తయారీ విధానం:

ముందుగా నానబెట్టిన పెసరపప్పు, ఉడికించిన పాలకూర, పచ్చిమిర్చి, అల్లం ముక్కలను మిక్సీ జార్‌లో వేసి మెత్తటి పేస్ట్‌లా రుబ్బుకోవాలి. ఒక పాత్రలో గోధుమ పిండి తీసుకుని అందులో రుబ్బిన మూంగ్‌దాల్-పాలకూర పేస్ట్, వాము, జీలకర్ర, పసుపు, కారం, రుచికి సరిపడా ఉప్పు, ఒక స్పూన్ నూనె వేయాలి. పదార్థాలన్నీ పిండికి పట్టేలా కలిపి, అవసరమైతే కొద్దిగా నీరు చేర్చి పూరీ పిండిలా కాస్త గట్టిగా కలుపుకోవాలి. పిండిపై మూత పెట్టి 10-15 నిమిషాలు నాననివ్వాలి.

కలుపుకున్న పిండిని చిన్న చిన్న ఉండలుగా చేసి, పూరీపీటపై కొద్దిగా నూనె రాసి మందంగా ఉండేలా పూరీలను ఒత్తుకోవాలి. బాణలిలో నూనె బాగా వేడెక్కిన తర్వాత ఒత్తుకున్న పూరీలను వేసి, రెండు వైపులా దోరగా కాలే వరకు వేయించి తీయాలి. అంతే, వేడి వేడిగా హెల్దీ, టేస్టీ మూంగ్‌దాల్ పాలక్ పూరీలు సిద్ధం!

ఆరోగ్య ప్రయోజనాలు:

పాలకూరలో ఐరన్, ఫోలిక్ యాసిడ్ పుష్కలంగా ఉంటాయి, ఇవి రక్తహీనతను నివారిస్తాయి. పెసరపప్పు సులభంగా జీర్ణమయ్యే ప్రొటీన్‌ను అందిస్తుంది. పిల్లలు సాధారణంగా ఆకుకూరలు తినడానికి ఇష్టపడరు, అలాంటి వారికి ఈ విధంగా పూరీల రూపంలో చేసి పెడితే ఇష్టంగా తింటారు. ఈ వేడివేడి మూంగ్‌దాల్ పాలక్ పూరీలను పెరుగు, ఆవకాయ లేదా బంగాళాదుంప కూరతో కలిపి తింటే రుచి అద్భుతంగా ఉంటుంది!

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us
జడ్జి కుర్చీలో గణపయ్య.. సుప్రీంకోర్టు సెట్టింగ్ ప్రత్యేక ఆకర్షణ!
జడ్జి కుర్చీలో గణపయ్య.. సుప్రీంకోర్టు సెట్టింగ్ ప్రత్యేక ఆకర్షణ!
ఆ సమస్యకు చెక్‌..వాట్సాప్‌లో ఈ ట్రిక్‌ గురించి తెలిస్తే షాకవుతారు
ఆ సమస్యకు చెక్‌..వాట్సాప్‌లో ఈ ట్రిక్‌ గురించి తెలిస్తే షాకవుతారు
2027 ఆసియా కప్ నకు ముందు టీమిండియాకు గుడ్ న్యూస్..!
2027 ఆసియా కప్ నకు ముందు టీమిండియాకు గుడ్ న్యూస్..!
అబ్బబ్బా..వీరికి రెండు మహా యోగాలు.. ఇక తిరుగులేని లాభాలు!
అబ్బబ్బా..వీరికి రెండు మహా యోగాలు.. ఇక తిరుగులేని లాభాలు!
ఈ కొత్త రకం సీసీ కెమెరా ఫీచర్స్, ధర తెలిస్తే వెంటనే కోనేస్తారు..!
ఈ కొత్త రకం సీసీ కెమెరా ఫీచర్స్, ధర తెలిస్తే వెంటనే కోనేస్తారు..!
బంగారంలో ఇప్పుడు లక్ష పెడితే.. 10ఏళ్ల తర్వాత ఎంత వస్తుందో తెలుసా?
బంగారంలో ఇప్పుడు లక్ష పెడితే.. 10ఏళ్ల తర్వాత ఎంత వస్తుందో తెలుసా?
మేడమ్ సార్ మేడమ్ అంతే..!
మేడమ్ సార్ మేడమ్ అంతే..!
US విషాదం.. ట్రాక్‌పై జారిపడ్డ స్నేహితుడు.. కాపాడబోయి యువతి సైతం
US విషాదం.. ట్రాక్‌పై జారిపడ్డ స్నేహితుడు.. కాపాడబోయి యువతి సైతం
ఒకే ఒక్క సినిమా.. విపరీతమైన క్రేజ్ తెచ్చిపెట్టింది..
ఒకే ఒక్క సినిమా.. విపరీతమైన క్రేజ్ తెచ్చిపెట్టింది..
ధాన్య లక్ష్మి ఒడిలో లంబోదరుడు.. రామకోటి రామరాజు వినూత్న కళారూపం
ధాన్య లక్ష్మి ఒడిలో లంబోదరుడు.. రామకోటి రామరాజు వినూత్న కళారూపం