AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Optical Illusion: దమ్ముంటే కాస్కో.. ఈ ఫోటోలో 8 మంది, ఓ పిల్లి కనిపిస్తే.. మీ కళ్లు షార్ప్‌గా ఉన్నట్టే!

సోషల్ మీడియాలో వైరల్ అయ్యే ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రాలు, ఫజిల్ ఫోటోస్ మన కళ్లకు పనిచెప్పడమే కాకుండా తెలివితేటలను పెంచడంలో కూడా సహాయపడుతాయి. అందుకే జనాలు వీటిని సాల్వ్ చేసేందుకు ఎక్కువగా ఇష్టపడతారు. మీకు ఇలా ఫజిల్ చిత్రాలు సాల్వ్ చేసే అలవాటు ఉంటే ఈ చిత్రంలో దానిగి ఉన్న మనుషులు, పిల్లిని గుర్తించండి.

Optical Illusion: దమ్ముంటే కాస్కో.. ఈ ఫోటోలో 8 మంది, ఓ పిల్లి కనిపిస్తే.. మీ కళ్లు షార్ప్‌గా ఉన్నట్టే!
Viral Pencil Sketch Optical Illusion
Anand T
|

Updated on: Sep 03, 2026 | 2:21 PM

Share

ఇంటర్నెట్ ప్రపంచంలో సోషల్ మీడియా యూజర్ల కళ్లకు, బ్రెయిన్‌కు పని చెప్పే ఎన్నో వైరల్ ఫోటోలు తరచూ వైరల్ అవుతూ ఉంటాయి. వాస్తవానికి ఈ చిత్రాలలో అనేక విషయాలు దాగి ఉంటాయి, అవి సాధారణంగా సులభంగా కనిపించవు. వాటిని చూసి అర్థం చేసుకోవడానికి మెదడుకు కాస్త పని చెప్పాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియ మన ఆలోచనా శక్తిని పెంచడంతో పాటు ఫ్యూచర్ మన నిజజీవితంలో ఎదురయ్యే సమస్యలను సాల్వ్ చేసేందుకు కూడా సహాయపడుతాయి. మీరు కూడా ఇలాంటి చిత్రాలను సాల్వ్ చేసి తెలివితేటలను పెంచుకోవాలి అంటే తాజాగా వైరల్ చిత్రాన్ని సాల్వ్ చేయండి.

ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్న ఈ పెన్సిల్ ఆర్ట్‌లో 8 మంది వ్యక్తులు, ఒక పిల్లి దాగి ఉన్నాయి. వీటిని మీరు కనిపెట్టగలిగితే మీ మెదడు చాలా చురుగ్గా పనిచేస్తోందని అర్థం. అయితే, 99 శాతం మంది వీటిని పూర్తిగా కనిపెట్టడంలో ఫెయిన్ అయ్యారు. కానీ కాస్త దృష్టి సారించి చూస్తే మీరు ఈజీగా ఈ చిత్రాన్ని సాల్వ్ చేయవచ్చు. మీరు సవాల్‌కు సిద్ధమైతే.. మీ టైం ఇప్పుడే ప్రారంభమవుతుంది.

కనిపెట్టడాలినికి సలహా

అయితే ఈ చిత్రంలో ఉన్న మనుషులను కనిపెట్టడం మీకు కష్టంగా ఉంటే మీకు చిన్న సలహా ఇస్తాం.. చిత్రాన్ని మీరు నిశితంగా గమనిస్తే మధ్యలో ఒక కారు కనిపిస్తుంది. దాని చుట్టూ మీకు కొందరు వ్యక్తులు కనిపిస్తారు. అయితే, పిల్లి ఎక్కడ దాగి ఉందో కనిపెట్టడం అందరికీ అంత సులభం కాదు. చాలామంది పిల్లిని వెతకడంలోనే తడబడుతున్నారు. కాబట్టి మీరు కాస్త జాగ్రత్తగా గమనిస్తే ఆ పిల్లి కూడా కనిపిస్తుంది.

మీరు కనిపెట్టారా?

మీరు కనుక ఈ చిత్రంలో ఉన్న 7 మంది వ్యక్తులు, ఒక పిల్లిని కనిపెడితే మీ బ్రెయిన్, కళ్లు షార్ప్‌గా ఉన్నాయని అర్థం. ఒక వేళ మీరు కేవలం 6 మందిని మాత్రమే గుర్తిస్తే పర్వాలేదు, మీ పరిశీలన బాగున్నట్లే అని అర్థం. అదే మీరు 2 నుండి 3 మంది మాత్రమే గుర్తిస్తే మీ బ్రెయిన్‌కు మీరు మరింత పని చెప్పాలి ఉందని అర్థం.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us