AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తిరుపతిలో ఏసీబీ మెరుపు దాడులు..! టీటీడీ డిప్యూటీ ఈవో ఇంట్లో సోదాలు.. మరో 5 చోట్ల రైడ్స్!

తిరుపతిలో టీటీడీ డిప్యూటీ ఈవో లోకనాథం నివాసంతో సహా ఆరు ప్రాంతాల్లో ఏసీబీ దాడులు తీవ్ర కలకలం రేపాయి. అవినీతి ఆరోపణలు, ఆదాయానికి మించిన ఆస్తులపై అధికారులు ఏకకాలంలో తనిఖీలు నిర్వహిస్తున్నారు. రికార్డులు, పత్రాలను పరిశీలిస్తున్నారు. అత్యంత కీలకమైన ధార్మిక సంస్థలో ఉన్నతాధికారిపై సోదాలు జరగడం ప్రాధాన్యతను సంతరించుకుంది. పూర్తి వివరాలు ఏసీబీ అధికారిక ప్రకటన తర్వాత వెల్లడవుతాయి.

తిరుపతిలో ఏసీబీ మెరుపు దాడులు..! టీటీడీ డిప్యూటీ ఈవో ఇంట్లో సోదాలు.. మరో 5 చోట్ల రైడ్స్!
Tirupati Acb Raids
Balaraju Goud
|

Updated on: Sep 02, 2026 | 10:28 AM

Share

తిరుపతిలో అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులు చేపట్టిన సోదాలు కలకలం రేపుతున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీవారి ఆలయ డిప్యూటీ ఈవో లోకనాథం నివాసంతో పాటు మరో ఐదు ప్రాంతాల్లో ఏసీబీ అధికారులు ఏకకాలంలో తనిఖీలు నిర్వహిస్తున్నారు. పెద్దకాపు వీధిలోని ఆయన నివాసంలో ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి. లోకనాథం ప్రస్తుతం తిరుమల శ్రీవారి ఆలయ డిప్యూటీ ఈవోగా విధులు నిర్వహిస్తున్నారు. టీటీడీ అధికారిక సమాచారంలో కూడా ఆయన డిప్యూటీ ఈవోగా పలు కీలక కార్యక్రమాల్లో పాల్గొన్నట్లు నమోదైంది.

ఆరు ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు

ఏసీబీ అధికారులు లోకనాథానికి సంబంధించినట్లు భావిస్తున్న పలు ప్రాంతాల్లో ఏకకాలంలో తనిఖీలు చేపట్టారు. తిరుమలలోని బీ-టైప్ క్వార్టర్స్‌లో ఉన్న ఆయన నివాసం, క్యాంపు కార్యాలయం, తిరుపతి పెద్దకాపు వీధిలోని నివాసం, బంధువులకు సంబంధించిన ప్రాంతాలు, ఏర్పేడు మండలం చెల్లూరులో ఉన్న ఇంటితో పాటు మరో ప్రాంతంలో సోదాలు కొనసాగుతున్నట్లు సమాచారం. సోదాల సందర్భంగా అధికారులు పలు రికార్డులు, పత్రాలు, ఆస్తులకు సంబంధించిన వివరాలను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఇప్పటివరకు ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్న నగదు, బంగారం, ఆస్తుల పత్రాలు లేదా ఇతర కీలక ఆధారాలపై అధికారికంగా పూర్తి వివరాలు వెల్లడించలేదు.

టీటీడీ వంటి అత్యంత కీలకమైన ధార్మిక సంస్థలో పనిచేస్తున్న ఉన్నతాధికారి నివాసాలపై ఏసీబీ దాడులు జరగడం ప్రాధాన్యత సంతరించుకుంది. దీంతో ఈ సోదాల్లో ఏం వెలుగులోకి వస్తుందన్న దానిపై ఆసక్తి నెలకొంది. లోకనాథం విధులకు సంబంధించిన వ్యవహారాలు, ఆయన ఆస్తులు, ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నాయా? లేదా ఇతర అక్రమాలకు సంబంధం ఉందా? అనే అంశాలపై ఏసీబీ అధికారులు దృష్టి సారించినట్లు తెలుస్తోంది. సోదాలు పూర్తయిన తర్వాతే ఏసీబీ అధికారులు కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను వెల్లడించే అవకాశం ఉంది.

ప్రస్తుతం పలు ప్రాంతాల్లో సోదాలు కొనసాగుతున్న నేపథ్యంలో.. అధికారులు స్వాధీనం చేసుకున్న పత్రాలు, ఆస్తుల వివరాలు, ఇతర ఆధారాల ఆధారంగా తదుపరి చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ఏసీబీ అధికారిక ప్రకటన వెలువడిన తర్వాతే ఈ దాడులకు సంబంధించిన పూర్తి కారణాలు, కేసు స్వరూపం, స్వాధీనం వివరాలపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

వీడియో ఇక్కడ చూడండి..

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us