AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అన్నను స్కూల్ బస్సు ఎక్కించేందుకు తల్లి వెంటే వచ్చి.. అదే బస్సు కిందపడి మూడేళ్ల బాలుడు మృతి!

పల్నాడు జిల్లా లంకెలకురపాడులో స్కూల్ బస్సు ఢీకొని మూడేళ్ల బాలుడు నితిన్ మృతి చెందాడు. అన్నను బస్సు ఎక్కించడానికి తల్లి వెంట వెళ్లిన నితిన్‌ను డ్రైవర్ గమనించలేదు. ఈ ప్రమాదంతో గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి. డ్రైవర్ పరారవడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పాఠశాల బస్సు భద్రతా ప్రమాణాలపై ప్రశ్నలు తలెత్తాయి.

అన్నను స్కూల్ బస్సు ఎక్కించేందుకు తల్లి వెంటే వచ్చి.. అదే బస్సు కిందపడి మూడేళ్ల బాలుడు మృతి!
Palnadu School Bus Tragedy
Balaraju Goud
|

Updated on: Sep 22, 2026 | 1:15 PM

Share

పల్నాడు జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. ముప్పాళ్ల మండలం లంకెలకూరపాడులో ప్రైవేట్ స్కూల్ బస్సు ఢీకొనడంతో మూడేళ్ల బాలుడు మృతి చెందాడు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు.

స్థానికుల వివరాల ప్రకారం.. లంకెలకూరపాడుకు చెందిన ఓ కుటుంబం తమ పిల్లలను పాఠశాలకు పంపేందుకు సిద్ధమైంది. బాలుడి అన్న సిద్దార్థ్‌ను స్కూల్ బస్సు ఎక్కించేందుకు తల్లి రోడ్డుపైకి వచ్చింది. ఆమె వెంట మూడేళ్ల చిన్నారి నితిన్ కూడా బయటకు పరిగెత్తుకుంటూ వచ్చాడు. అదే సమయంలో విద్యార్థులను తీసుకెళ్లేందుకు వచ్చిన ప్రైవేట్ స్కూల్ బస్సు అక్కడికి చేరుకుంది.

అయితే బస్సు డ్రైవర్ రవి రోడ్డుపై ఉన్న నితిన్‌ను గమనించకపోవడంతో చిన్నారిని బస్సు ఢీకొట్టింది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన నితిన్ అక్కడికక్కడే మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. ఒక్కసారిగా జరిగిన ఘటనతో తల్లి, కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. ప్రమాదం జరిగిన వెంటనే బస్సును అక్కడే వదిలి డ్రైవర్ రవి పరార్ అయ్యాడు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని వివరాలు సేకరించారు. బస్సును స్వాధీనం చేసుకుని ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేపట్టినట్లు తెలుస్తోంది. డ్రైవర్ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

చిన్నారి మృతితో లంకెలకూరపాడులో విషాద ఛాయలు అలుముకున్నాయి. పాఠశాల బస్సుల డ్రైవర్లు అప్రమత్తంగా వ్యవహరించాల్సిన అవసరాన్ని ఈ ఘటన మరోసారి గుర్తు చేసింది.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us