AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

స్ట్రెచ్ మార్క్స్‌తో ఇబ్బంది పడుతున్నారా? డాక్టర్ కవిన్ రామ్ తెలిపిన అద్భుతమైన నివారణ చిట్కాలు ఇవే!

శరీరంలో బరువు వేగంగా పెరిగినా లేదా తగ్గినా, అలాగే గర్భధారణ సమయంలో చర్మం సాగడం వల్ల స్ట్రెచ్ మార్క్స్ ఏర్పడటం సహజం. డాక్టర్ కవిన్ రామ్ ప్రకారం, ప్రారంభంలో ఎర్రగా లేదా గులాబీ రంగులో ఉండే మచ్చలను ఇంటి చిట్కాలతో చాలావరకు తగ్గించవచ్చు.. కానీ పాతబడి తెల్లగా మారిన మచ్చలకు వైద్య చికిత్సలు అవసరమవుతాయని చెబుతున్నారు. ఇందుకోసం ఏం చేయాలో డాక్టర్‌ వివరించారు. ఆ వివరాల్లోకి వెళితే..

స్ట్రెచ్ మార్క్స్‌తో ఇబ్బంది పడుతున్నారా? డాక్టర్ కవిన్ రామ్ తెలిపిన అద్భుతమైన నివారణ చిట్కాలు ఇవే!
Stretch Marks
Jyothi Gadda
|

Updated on: Sep 22, 2026 | 12:30 PM

Share

శరీరంలో ఉన్నట్టుండి బరువు పెరిగినప్పుడు, తగ్గినా లేదా గర్భధారణ సమయంలో చర్మం వేగంగా విస్తరించడం వల్ల పొత్తికడుపు, తొడలు, చేతుల భాగాల్లో స్ట్రెచ్ మార్క్స్ ఏర్పడటం చాలా సాధారణం. ఇవి ఆరోగ్యానికి ఎలాంటి ప్రమాదం కాకపోయినప్పటికీ, చర్మ సౌందర్యాన్ని దెబ్బతీస్తాయి. ప్రముఖ డాక్టర్ కవిన్ రామ్ తెలిపిన వివరాల ప్రకారం, ఈ మచ్చలను ఎలా తగ్గించుకోవచ్చో, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.

స్ట్రెచ్ మార్క్స్ రకాలు – ఎప్పుడు తగ్గించడం సులభం?

డాక్టర్ కవిన్ రామ్ ప్రకారం, స్ట్రెచ్ మార్క్స్ రెండు రకాలుగా ఉంటాయి. మచ్చలు ఏర్పడిన కొత్తలో ఎర్రగా లేదా గులాబీ రంగులో ఉంటాయి. ఈ దశలో రక్తప్రసరణ బాగా జరుగుతుంది కాబట్టి ఇంటి చిట్కాలు, మోయిశ్చరైజర్లు, ఆయిల్ మసాజ్ ద్వారా వీటిని చాలా త్వరగా నివారించవచ్చు. కాలక్రమేణా ఇవి తెల్లగా లేదా వెండి రంగులోకి మారతాయి. ఇవి నయం కావడం కాస్త కష్టం. వీటికోసం లేజర్ ట్రీట్‌మెంట్ లేదా మైక్రోనీడ్లింగ్ వంటి డెర్మటాలజీ చికిత్సలు అవసరమవుతాయి.

స్ట్రెచ్ మార్క్స్ నివారణకు అద్భుతమైన సహజ చిట్కాలు:

కొబ్బరి నూనె, విటమిన్ E ఆయిల్: కొబ్బరి నూనెలో ఉండే ఫ్యాటీ యాసిడ్లు, విటమిన్ E లోని యాంటీఆక్సిడెంట్లు చర్మాన్ని లోతుగా తేమగా ఉంచుతాయి. రోజూ రాత్రి పడుకునే ముందు ప్రభావిత ప్రాంతంలో నూనె రాసి మెల్లగా మర్దన చేయడం వల్ల చర్మానికి స్థితిస్థాపకత పెరుగుతుంది.

ఇవి కూడా చదవండి

అలోవెరా జెల్: కలబందలోని హీలింగ్ గుణాలు చర్మ కణాలను వేగంగా పునరుత్పత్తి చేయడానికి సహాయపడతాయి. తాజా కలబంద జెల్‌ను క్రమం తప్పకుండా అప్లై చేయడం వల్ల మచ్చలు త్వరగా మాయమవుతాయి.

చర్మాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచడం: రోజుకు కనీసం 2-3 లీటర్ల నీరు తాగడం వల్ల చర్మం లోపలి నుండి ఆరోగ్యంగా ఉంటుంది. పొడిబారిన చర్మంపై స్ట్రెచ్ మార్క్స్ త్వరగా ఏర్పడతాయి.

స్ట్రెచ్ మార్క్స్ ఒకే రోజులో మాయం కావు. డాక్టర్ కవిన్ రామ్ సూచించిన విధంగా సహజ చిట్కాలను క్రమం తప్పకుండా పాటిస్తూ, చర్మాన్ని తేమగా ఉంచుకోవడం ద్వారా మంచి ఫలితాలను పొందవచ్చు. పరిస్థితి తీవ్రంగా ఉంటే చర్మవ్యాధి నిపుణుడిని సంప్రదించడం మంచిది.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us