AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Cardamom Plant: కుండీ ఉంటే చాలు.. ఈ ఖరీదైన ఇలాచీలను మీ బాల్కనీలోనే పెంచుకోవచ్చు..

మసాలా దినుసుల ప్రపంచంలో భారతదేశం అగ్రస్థానంలో ఉంది. అలాంటి మసాలా దినుసులలో అత్యంత విలువైనది, "మసాలా దినుసుల రాణి"గా పిలువబడే యాలకులు. ఈ యాలకులను మీ ఇంట్లోనే, బాల్కనీలో లేదా టెర్రస్ పైన సులభంగా పెంచుకోవచ్చని మీకు తెలుసా? స్వచ్ఛమైన, సేంద్రీయ యాలకుల ప్రయోజనాలను మీ ఇంటి వద్దే పొందడానికి ఇది ఒక అద్భుతమైన అవకాశం. సరైన పద్ధతి, కొద్దిపాటి శ్రద్ధ ఉంటే చాలు, మీరే యాలకుల మొక్కలను పెంచుకోవచ్చు. అది ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం.

Cardamom Plant: కుండీ ఉంటే చాలు.. ఈ ఖరీదైన ఇలాచీలను మీ బాల్కనీలోనే పెంచుకోవచ్చు..
Cardamom Plant At Home
Bhavani
|

Updated on: May 22, 2025 | 12:09 PM

Share

యాలకుల మొక్కను నాటడానికి పెద్దగా స్థలం లేదా శ్రమపడాల్సిన అవసరం లేదు. సరైన పద్ధతి, క్రమం తప్పకుండా చూసుకుంటే మీ ఇంటి బాల్కనీలో లేదా డాబా పైన కూడా పెంచుకోవచ్చు. మార్కెట్లో దొరికే వాటిలో చాలా మట్టుకు నకిలీవి, సువాసన, రుచి లేనివి ఉంటున్నాయి. ఇలా ఇంట్లో పెంచుకోవడం వల్ల ఇందులో ఉండే ఔషధ గుణాలు పూర్తిగా పొందవచ్చు. దీని కోసం ముందుగా ఒక చిన్న కుండ లేదా కంటైనర్‌ను తీసుకోవాలి.

తోట నుండి లభించే సారవంతమైన మట్టిని, ఆవు పేడ ఎరువును కలిపి కుండను నింపాలి. మార్కెట్ నుండి 4 నుండి 5 ఎండు యాలకులను తీసుకోండి. వాటిలోని విత్తనాలను వేరు చేసి, పై తొక్కను పక్కన పెట్టుకోవాలి.

యాలకలు పెంచే విధానం:

వేరు చేసిన విత్తనాలను ఒక కప్పు నీటిలో 7 నుండి 8 గంటల పాటు నానబెట్టండి.

నానబెట్టిన తర్వాత, విత్తనాలను నీటి నుండి తీసి, కుండలోని మట్టిలో తేలికగా నొక్కండి.

విత్తనాల పైన కొద్దిగా వదులుగా ఉండే మట్టిని వేసి, కుండలో నీరు పోయాలి.

సుమారు రెండు వారాలలో విత్తనాలు మొలకెత్తి చిన్న మొక్కలుగా మారతాయి.

రెండు నెలల్లో మొక్క బాగా పెరగడం ప్రారంభించి, క్రమం తప్పకుండా చూసుకుంటే ఫలాలను ఇచ్చే స్థితికి చేరుకుంటుంది.

త్వరగా పెరగడానికి చిట్కాలు:

యాలకుల మొక్కల పెరుగుదలను వేగవంతం చేయాలనుకుంటే, ఇంట్లో తయారుచేసిన సేంద్రీయ ఎరువులను ఉపయోగించండి. దీని కోసం, కూరగాయల తొక్కలు, పండిన అరటిపండు తొక్కలను 8 నుండి 10 గంటల పాటు నీటిలో నానబెట్టండి. ఈ నీటిని మొక్కకు పోయాలి. ఈ ఎరువులోని పోషకాలు మొక్కల వేళ్ళను బలంగా, వేగంగా పెరగడానికి సహాయపడతాయి.

యాలకుల మొక్క సంరక్షణ:

యాలకుల మొక్కలు నీడ పడే ప్రదేశాలలో బాగా పెరుగుతాయి, కాబట్టి వాటిని ప్రత్యక్ష సూర్యరశ్మి నుండి కాపాడాలి.

మట్టిలో తేమను ఉండేలా చూసుకోండి, కానీ అధికంగా నీరు పోయకుండా జాగ్రత్త వహించండి.

ఎప్పటికప్పుడు కలుపు మొక్కలను తొలగిస్తూ ఉండండి.

నెలకు ఒకసారి ఎరువు వేయడం మర్చిపోవద్దు.

ఈ పద్ధతులను క్రమం తప్పకుండా పాటిస్తే, మీరు మీ ఇంట్లోనే సులభంగా యాలకలను పండించుకోవచ్చు.