Kids Health: ఈ చిట్కాలతో విద్యార్థుల మానసిక ఆరోగ్యం.. ర్యాన్‌ ఇంటర్నేషనల్‌ స్కూల్‌ కీలక సూచనలు

ఇటీవల చిన్నారుల్లో కూడా మానసిక ఒత్తిడి సమస్యలు పెరుగుతున్నాయి. ఆందోళన, నిరాశ వంటి సమస్యలు వెంటాడుతున్నాయి. అయితే ఇలాంటి సమస్యలకు స్క్రీన్ సమయం పెరగడం మొదలు ఎన్నో కారణాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. చిన్నారులు ఈ సమస్య నుంచి బయటపడాలంటే. కొన్ని చిట్కాలు పాటించాలని ర్యాన్‌ ఇంటర్నేషనల్‌ కీలక సూచనలు చేస్తోంది..

Kids Health: ఈ చిట్కాలతో విద్యార్థుల మానసిక ఆరోగ్యం.. ర్యాన్‌ ఇంటర్నేషనల్‌ స్కూల్‌ కీలక సూచనలు
Studnets Mental Health
Follow us
Narender Vaitla

|

Updated on: Dec 02, 2024 | 7:40 PM

ఆధునిక విద్యారంగంలో, విద్యార్థుల మానసిక క్షేమం కీలక సమస్యగా మారింది. పెరుగుతున్న విద్యాపరమైన ఒత్తిళ్లు, స్క్రీన్ సమయం పెరగడం మానసిక ఆరోగ్య సమస్యలలో ఆందోళనకరమైన ధోరణికి దోహదం చేస్తుంది. యునిసెఫ్ ప్రకారం, భారతదేశంలోని 15 నుంచి 24 సంవత్సరాల మధ్య వయస్సు గల ప్రతి 7గురు యువకుల్లో ఒకరు మానసిక ఆరోగ్యం విషయంలో సవాళ్లను ఎదుర్కొంటున్నారు. అయితే నేషనల్ మెంటల్ హెల్త్ సర్వే గత ఐదేళ్లలో పాఠశాలకు వెళ్లే పిల్లలలో మానసిక ఆరోగ్య సమస్యలలో 15% పెరిగినట్లు నివేదించింది. అయితే ఈ సమస్య నుంచి బయటపడేందుకు కొన్ని చిట్కాలను పాటించాలని ర్యాన్‌ ఇంటర్నేషనల్ స్కూల్‌ పలు కీలక సూచనలు చేసింది. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

* మానసిక ఆరోగ్యం మెరుగుపడాలంటే స్క్రీన్‌ టైమ్‌ను తగ్గించుకోవాల్సి అవసరం ఉందని చెబుతున్నారు. నేషనల్ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హెల్త్‌ (NIH) అధ్యయనాల ప్రకారం రోజు 7 గంటలకు మించి స్క్రీన్ టైమ్‌ గడిపే వారు ఆందోళనకు గురయ్యే అవకాశం రెండు రెట్లు ఎక్కువగా ఉందని తేలింది. డిజిటల్‌ పరికరాల వినియోగంలో హద్దులు ఏర్పాటు చేసుకోవడం అవసరమని అంటున్నారు. రోజులో కొన్ని సమయాల్లో స్క్రీన్‌కు పూర్తిగా దూరంగా ఉండాలని సూచిస్తున్నారు. “డిజిటల్ డిటాక్స్” విధానాన్ని అవలభించాలని సూచిస్తున్నారు.

* మానసిక ఆరోగ్యాన్ని ప్రభావితం చేయడంలో శారీరక కదలికలు కీలక పాత్ర పోషిస్తాయని చెబుతున్నారు. రెగ్యులర్ వ్యాయామం శరీరంలో ఎండార్ఫిన్లను విడుదల చేస్తుంది. ఇది ఆందోఒళన, నిరాశను ఎదుర్కోవడంలో సహాయపడుతుంది. యోగా లేదా 15 నిమిషాల నడక వంటి వాటిని అలవాటు చేయాలి. క్రీడలు, డ్యాన్స్‌ వంటివి కూడా చిన్నారుల్లో మెంటల్‌ హెల్త్‌ను కాపాడుతాయి.

* మానసిక ఆరోగ్యం బాగుండాలంటే కచ్చితంగా రోజుకు 8 నుంచి 10 గంటల నిద్ర అవసరమని నిపుణులు చెబుతున్నారు. పేలవమైన నిద్ర కారణంగా ఆందోళన, నిరాశ పెరిగే అవకాశాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. పడుకునే ముందు కచ్చితంగా గంట ముందే ఎలక్ట్రానిక్‌ డివైజ్‌లను పక్కన పెట్టాలని సూచిస్తున్నారు.

* బలమైన సామాజిక సంబంధాలు కూడా మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. పిల్లలను ఒంటరిగా గడపకుండా ఉండేలా చూసుకోవాలి. నలుగురితో కలిసి ఉండేలా ప్రోత్సహించాలి. పీర్ మెంటరింగ్, గ్రూప్‌ ప్రాజెక్ట్స్‌ వంటి వాటిని అలవాటు చేయాలని చెబుతున్నారు.

* చిన్నారులకు ఒత్తిడిని నిర్వహించే విధానాలను అలవాటు చేయాలి. లోతైన శ్వాస, ధ్యానం వంటివి అలవాటు చేయాలి. ఇవి ఆందోళనను తగ్గిస్తాయి. పాఠ్యాంశాల్లో ఒత్తిడి నిర్వహణకు సంబంధించిన వివరాలను చేర్చాలని చెబుతున్నారు.

ఇక విద్యార్థుల్లో మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించడం అనేది ఒక సమిష్టి బాధ్యత, దీనికి విద్యావేత్తలు, తల్లిదండ్రులు ఇలా అందరూ బాధ్యత తీసుకోవాలి. ఒకే చోట గంటల తరబడి కూర్చొంకుడా చూడాలి. ఒత్తిడిని తగ్గించే క్రమంలో పలు రకాల చిట్కాలను పాటించాలి. చిన్నారుల మానసిక ఆరోగ్యానికి ప్రాధాన్యతనివ్వడం ద్వారా ఆరోగ్యకరమైన భవిష్యత్తు తరాన్ని అందించవచ్చని చెబుతున్నారు.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..