Chinni Enni |
Updated on: Dec 02, 2024 | 6:22 PM
ఈ మధ్య కాలంలో గడ్డం పెంచుకోవడం అనేది చాలా ట్రెండ్‌గా మారింది. గడ్డం పెంచుకోవడం వల్ల మగవారు అందంగా కూడా కనిపిస్తున్నారు. ఎంతో మంది యూత్ కూడా ఇదే ట్రెండ్ ఫాలో అవుతున్నారు. అయితే తెలియని విషయం ఏంటంటే.. గడ్డం పెంచుకోవడం వల్ల చాలా లాభాలు ఉన్నాయి.
గడ్డం పెంచుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని పరిశోధనలో తేలింది. గడ్డం ఉండటం వల్ల హానికరమైన యూవీ కిరణాల నుంచి ముఖం కవర్ అవుతుంది. దీని వల్ల చర్మ క్యాన్సర్ వంటి వ్యాధులు వచ్చే ప్రమాదం తగ్గుతుంది. గడ్డం వల్ల స్కిన్ ట్యాన్ కూడా అవ్వదు.
మగవారికి గడ్డం గుబురుగా ఉండటం వల్ల ముఖం పొడిగా మారే అకాశం ఉంది. చర్మం తేమగా ఉండటం వల్ల ముఖంపై పగుళ్లు వంటి మొటిమలు వంటి సమస్యలు రాకుండా ఉంటాయి. కేవలం ముఖం మాత్రమే కాదు.. గొంతు కూడా సురక్షితంగా ఉంటుంది.
త్వరగా గాలిలో ఉండే బ్యాక్టీరియా పురుషుల నోటిలోకి చేరదు. గొంతు ఇన్ఫెక్షన్ ప్రమాదం కూడా తగ్గుతుంది. శరీర ఉష్ణోగ్రత కూడా కంట్రోల్‌లో ఉంటుంది. జలుబు, అలర్జీలు, ఉబ్బరం వంటి సమస్యలు రావు.
గడ్డం ఎక్కువగా ఉండటం వల్ల ముఖంపై ఎక్కువగా ముడతలు రాకుండా ఉంటాయి. త్వరగా వృద్ధాప్య ఛాయలు రావు. ముఖంపై ఎక్కువగా దుమ్ము, ధూళి చేరకుండా ఉంటాయి.