AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Personality Test: మీ కాలి వేళ్లు ఇలా ఉన్నాయా? అయితే ఇదే మీ క్యారెక్టర్.. ఎలా తెలుసుకోవాలంటే?

ఒక వ్యక్తి గురించి తెలుసుకోవాలంటే జోతిష్యం ద్వారానో లేదా అతని ప్రవర్తనను బట్టినో తెలుసుకుంటాం. కానీ సాముద్రిక శాస్త్రం ప్రకారం ఒక వ్యక్తి అరచేతి రేఖలు, కాలి వేళ్లును బట్టి కూడా ఒక వ్యక్తి ఎలాంటి వాడు, అతని భవిష్యత్తు ఎలా ఉండబోతుంది అనేది తెలుసుకోవచ్చని మీకు తెలుసా? అయితే కాలివేళ్లు ఆకారాన్ని బట్టి ఒకరి వ్యక్తిత్వాన్ని ఎలా గుర్తించాలో ఇక్కడ తెలుసుకుందాం.

Personality Test: మీ కాలి వేళ్లు ఇలా ఉన్నాయా? అయితే ఇదే మీ క్యారెక్టర్.. ఎలా తెలుసుకోవాలంటే?
Toe Personality Test
Anand T
|

Updated on: Mar 29, 2026 | 9:10 AM

Share

పండితులు, ఆచార్యులు మన అరచేతి రేఖలను చూసి మన భవిష్యత్తును అంచనా వేస్తారు. చేతిపై ఉండే రకరకాల రేఖలు మన అదృష్టం, భవిష్యత్తుకు సంబంధించిన ఎన్నో రహస్యాలను వెల్లడిస్తాయి. మన చేతి రేఖలు మన జీవితం గురించి ఎలాగైతే చెబుతాయో, అదేవిధంగా మన కాలి వేళ్లు కూడా మన జీవితానికి సంబంధించిన అనేక ముఖ్యమైన విషయాలను తెలియజేస్తాయి. సాముద్రిక శాస్త్రం ప్రకారం మన కాలి బొటనవేలు, మిగిలిన వేళ్లను బట్టి మన వ్యక్తిత్వాన్ని ఎలా తెలుసుకోవాలో చూద్దాం.

సమానమైన వేళ్లు: ఎవరికైతే కాలి బొటనవేలు, దాని పక్కన ఉండే వేలు సమానంగా ఉంటాయో, వారు చాలా ధనవంతులు అవుతారట, వీరి జీవితం సుఖసంతోషాలతో, ఐశ్వర్యంతో నిండి ఉంటుందట. వీరికి వైవాహిక జీవితం కూడా ఎప్పుడూ ఆనందంగా ఉంటుందట, ఇలాంటి వ్యక్తులకు పిల్లలు, కుటుంబ సభ్యుల నుండి పూర్తి సహకారం, సంతోషం లభిస్తాయట.

బొటనవేలు పెద్దదిగా ఉంటే: కాలి బొటనవేలు పక్క వేలు కంటే పెద్దదిగా ఉన్నవారు ఇతరుల మాటలను ఎక్కువగా గౌరవిస్తారుట. అయితే, వీరికున్న ఈ మంచి గుణమే కొన్ని సార్లు వాళ్లను తక్కువ చేస్తుందట, అవును కొన్నిసార్లు వీరు ఇతరులకు లొంగిపోయి ఉండాల్సి వస్తుంది. ఇలాంటి వ్యక్తులు తమ సొంత అభిప్రాయాలను చెప్పుకోలేక ఇతరుల మాటలను సులభంగా అంగీకరిస్తారట.

చిన్న వేలు ఉంటే: కాలి బొటనవేలు పక్కన ఉండే వేలు, మధ్య వేలు కంటే చిన్నదిగా ఉంటే.. వారి జీవితం నార్మల్‌గానే ఉంటుదట. ఇలాంటి వ్యక్తులను పెళ్లిచేసుకోబోయే వారు పేద కుటుంబం నుండి వచ్చే అవకాశం ఉందని సాముద్రిక శాస్త్రం చెబుతోంది.

బొటనవేలు పక్కన వేలు పెద్దదిగా ఉంటే: బొటనవేలు పక్కన ఉండే వేలు పరిమాణంలో పెద్దదిగా ఉన్నవారు చాలా అదృష్టవంతులు. వీరికి భార్య నుండి పూర్తి సుఖసంతోషాలు లభిస్తాయి. వీరి భార్యలు చాలా పొదుపుగా, తెలివిగా ఖర్చు చేస్తారు. అంతేకాకుండా, వారు మంచి పనిమంతులుగా ఉండి సంపాదిస్తారు కూడా.

చివరి రెండు వేళ్లు సమానంగా ఉంటే: కాలి చివరి రెండు వేళ్లు ఒకే పరిమాణంలో ఉంటే, వారికి తమ పిల్లల నుండి పూర్తి సుఖం లభిస్తుంది. అయితే, వీరి ఆయుష్షు కొంత తక్కువగా ఉండే అవకాశం ఉంది.

అన్నీ సమానంగా ఉంటే: కాలి బొటనవేలుతో సహా అన్ని వేళ్లు ఒకే పరిమాణంలో ఉన్నవారు అత్యంత అదృష్టవంతులు. వీరు సాధారణ జీవితం కాకుండా సెలబ్రిటీ హోదాలో జీవిస్తారు. సమాజంలో మంచి గుర్తింపు తెచ్చుకుంటారు. అయితే, కొన్ని సందర్భాల్లో వీరు ఏమీ చేయలేక పేదరికంలోకి వెళ్లే ప్రమాదం కూడా ఉంటుంది.

(Note: పైన పేర్కొన్న అంశాలు కేవలం ఇంటర్నెట్, నిపుణుల నుంచి సేకరించిన వివరాల ఆధారంగా మాత్రమే అందించబడినవి.. వీటిని TV9 దృవీకరించడం లేదు. వీటిపై మీకేవైనా సందేహాలు ఉంటే నిపుణులను సంప్రదించండి)

మరిన్ని  లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us