అయ్యో పాపం.. ఈ బ్లడ్ గ్రూప్ వ్యక్తులకు లవ్ ఫెయిల్యూర్స్ ఎక్కువట! జర భద్రం..
ఒక్కొక్కరికి ఒక్కో విధమైన బ్లడ్ గ్రూప్ ఉంటుందన్న సంగతి తెలిసిందే. ప్రతి వ్యక్తి శరీరంలో వేర్వేరు రక్త వర్గాలు ఉంటాయి. అయితే రక్త వర్గం ఆధారంగా కూడా మనుషుల వ్యక్తిత్వాన్ని తెలుసుకోవచ్చని మానసిక నిపుణులు అంటున్నారు. అదేవిధంగా రక్త వర్గం ద్వారా ప్రేమలో ఎవరు ఎక్కువగా మోసపోతారో కూడా తెలుసుకోవచ్చట..

మనిషి ఒంట్లో రక్తం చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. అయితే అందరికి ఒకే విధమైన బ్లడ్ గ్రూప్‌లు ఉండవ్. A+, A-, AB+, AB-, O+, O- అనే రక్త వర్గాలు ఉంటాయి. వీటిల్లో ఒక్కొక్కరికి ఒక్కో విధమైన బ్లడ్ గ్రూప్ ఉంటుంది. ప్రతి వ్యక్తి శరీరంలో ఈ విధంగా వేర్వేరు రక్త వర్గాలు ఉంటాయి. అయితే రక్త వర్గం ఆధారంగా కూడా మనుషుల వ్యక్తిత్వాన్ని తెలుసుకోవచ్చని మానసిక నిపుణులు అంటున్నారు. అదేవిధంగా రక్త వర్గం ద్వారా ప్రేమలో ఎవరు ఎక్కువగా మోసపోతారో కూడా తెలుసుకోవచ్చట. వ్యక్తిత్వ పరీక్షల వంటి కొన్ని పద్ధతుల ద్వారా మన ప్రేమ జీవితం ఎలా ఉంటుందో తెలుసుకోవచ్చు. అలాగే రక్త వర్గం ద్వారా ప్రేమలో ఎవరు ఎక్కువగా మోసపోతారో కూడా మనం చూడవచ్చు. కాబట్టి ప్రేమలో ఏ రక్త వర్గం వ్యక్తులు ఎక్కువగా మోసపోతారో ఇక్కడ తెలుసుకుందాం..
ʼOʼ బ్లడ్ గ్రూప్ ఉన్నవారు ప్రేమలో మోసపోయే అవకాశం ఎక్కువగా ఉంటుందని మానసిక నిపుణులు అంటున్నారు. అవును.. వీరిని ఇతరులు సులభంగా మోసగిస్తారు. అందుకే వారు మళ్లీ మళ్లీ మోసపోతుంటారు. వీరు ప్రేమ గురించి చాలా సీరియస్‌గా ఉంటారు. తమ భాగస్వామిని ఎక్కువగా ప్రేమిస్తారు. వారు ఎంత ప్రేమ చూపించినా, ప్రేమలో మోసపోయే అవకాశం ఎక్కువగా ఉంటుందట. కానీ ఇది ఎంతవరకు నిజమో శాస్త్రీయంగా నిరూపితం కాలేదు.
ʼOʼ రక్త వర్గం ఉన్న వ్యక్తుల స్వభావం ఎలా ఉంటుందంటే..
O బ్లడ్ గ్రూప్ ఉన్నవారి స్వభావాన్ని మనం పరిశీలిస్తే.. వారు ఎల్లప్పుడూ ఇతరులకు సహాయం చేయడం ద్వారా ఆనందిస్తారు. వారు తమ జీవితాంతం ఇతరులకు సహాయం చేయడానికి ఎల్లప్పుడు ముందు వరుసలో ఉంటారు. O బ్లడ్ గ్రూప్ ఉన్నవారు స్వతహాగా ఉల్లాసంగా ఉంటారు. అందరితో చాలా బాగా కలిసిపోతారు. వారు తమను తాము ఎంతో ప్రేమిస్తారు. ప్రేమలో మోసపోయినా ‘O’ రక్త వర్గం ఉన్నవారు చాలా సానుకూలంగా, నమ్మకంగా ఉంటారు. ఎక్కువగా కష్టపడి పనిచేసే తత్వం కలిగి ఉంటారు. మంచి నాయకత్వ లక్షణాలు వీరిలో ఉంటాయి.
మరిన్ని లైఫ్‌స్టైల్ కథనాల కోసం క్లిక్ చేయండి.








