Umbrellas: గొడుగులు గుండ్రంగానే ఎందుకు ఉంటాయో తెలుసా? అసలు సీక్రెట్ ఇదే
వర్షాకాలంలో గొడుగు చాలా అవసరం. జనాలను ఆకర్షించడానికి ఈ గొడుగులను వివిధ రంగులు, పరిమాణాలు, డిజైన్లలో తయారు చేస్తారు. కానీ వాటి ఆకారం మాత్రం ఎల్లప్పుడూ ఒకేలా ఉంటుంది. ఇలా ఎందుకు ఉంటుందో మీరెప్పుడైనా ఆలోచించారా? అన్ని గొడుగులు గుండ్రని ఆకారంలో..

వర్షం, ఎండ నుంచి మనల్ని రక్షించుకోవడానికి గొడుగులు చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. ముఖ్యంగా వర్షాకాలంలో అవి చాలా అవసరం. జనాలను ఆకర్షించడానికి ఈ గొడుగులను వివిధ రంగులు, పరిమాణాలు, డిజైన్లలో తయారు చేస్తారు. కానీ వాటి ఆకారం మాత్రం ఎల్లప్పుడూ ఒకేలా ఉంటుంది. ఇలా ఎందుకు ఉంటుందో మీరెప్పుడైనా ఆలోచించారా? అన్ని గొడుగులు గుండ్రని ఆకారంలో మాత్రమే ఎందుకు తయారు చేస్తారు? అవి చతురస్రం వంటి ఆకారాలలో ఎందుకు ఉండవు? ఈ విషయాలు ఇక్కడ తెలుసుకుందాం..
గొడుగులు గుండ్రంగా ఎందుకు ఉంటాయంటే?
సాధారణంగా గొడుగులు గుండ్రని ఆకారంలో ఉంటాయి. అయినప్పటికీ అవి వివిధ రంగులు, డిజైన్లు, పరిమాణాలలో వస్తాయి. గొడుగులు చతురస్రాకారంలో లేదా మరే ఇతర ఆకారంలో కనిపించవు. గొడుగులను గుండ్రంగా కాకుండా వేరే ఆకారంలో ఎందుకు తయారు చేయరంటే.. దీని వెనుక చాలా కారణాలు ఉన్నాయి. ముందుగా చతురస్రాకార లేదా ఇతర ఆకారపు గొడుగు గుండ్రని గొడుగు మాదిరి రక్షణను అందించదు. గుండ్రని గొడుగుకు బదులుగా చతురస్రాకార గొడుగును తయారు చేయాలని ఎవరూ ఆలోచించలేదని కాదు. కానీ చతురస్రాకార గొడుగు గుండ్రని గొడుగు వలె రక్షణను అందించదు.
గుండ్రని ఆకారపు గొడుగులు అన్ని వైపుల నుంచి వర్షపు నీరు మనపై పడకుండా నిరోధిస్తాయి. ఇది గొడుగుపై పడే నీరు సమానంగా ప్రవహించడానికి అవకాశం ఉంటుంది. గుండ్రని గొడుగుల రూపకల్పన ప్రత్యేకమైనది. ఇది వర్షం లేదా గాలి ఏ వైపు నుండి వీచినా సమతుల్య రక్షణను అందిస్తుంది. అంటే ఈ ఆకారపు గొడుగు ఉపరితలం గాలి, నీటి ఒత్తిడిని సమానంగా పంపిణీ చేస్తుంది. అదే చతురస్రాకార గొడుగు ఉంటే, మీరు గొడుగు పట్టుకున్నప్పటికీ వర్షపు నీరు మీపై పడే అవకాశం ఉంది. అలాగే చతురస్రాకారంగా ఉండటం వలన గొడుగు అన్ని వైపుల నుంచి నీటిని సమానంగా వెళ్ళనివ్వడం సాధ్యం కాదు. గొడుగు చతురస్రాకారంలో ఉంటే దానిని మేనేజ్ చేయడం కూడా కష్టం అవుతుంది. గాలి ఒత్తిడి కారణంగా అది విరిగిపోయే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. ఈ కారణంగా గొడుగులను గుండ్రని ఆకారంలో మాత్రమే తయారు చేస్తుంటారు.
మరిన్ని లైఫ్‌స్టైల్ కథనాల కోసం క్లిక్ చేయండి.








