AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘ఈ కూరతో చిరుధాన్యాల రోటీ తింటే ఒంట్లో రోగాలన్నీ మటాష్‌..’ ఎలా వండాలో చెప్పిన బాబా రాందేవ్‌

శీతాకాలంలో మిల్లెట్స్‌ను ఆహారంగా తీసుకోవడం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఇది శరీరాన్ని వెచ్చగా ఉంచడానికి, బలాన్ని అందించడానికి సహాయపడుతుంది. ఆయుర్వేదం కూడా వీటివల్ల అపారమైన ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నట్లు చెబుతుంది. ఇప్పటికీ రాజస్థాన్‌ సహా దేశంలోని అనేక గ్రామీణ ప్రాంతాలు స్వచ్ఛమైన నెయ్యితో మిల్లెట్ రోటీలు చేసుకుని భుజిస్తుంటారు. వెల్లుల్లి చట్నీతో దీని రుచి మరింత అద్భుతంగా ఉంటుంది..

'ఈ కూరతో చిరుధాన్యాల రోటీ తింటే ఒంట్లో రోగాలన్నీ మటాష్‌..' ఎలా వండాలో చెప్పిన బాబా రాందేవ్‌
Patanjali Founder Baba Ramdev Speech On Bajra And Ragi Roti
Srilakshmi C
|

Updated on: Nov 13, 2025 | 5:04 PM

Share

మిల్లెట్ పిండి శీతాకాలం సూపర్‌ఫుడ్‌గా పరిగణిస్తారు. అందుకే ప్రముఖ యోగా గురువు, పతంజలి ఆయుర్వేద సంస్థ వ్యవస్థాపకులు రాందేవ్‌ బాబా ప్రయోజనాలను పదే పదే ప్రచారం చేస్తుంటారు. మిల్లెట్ ఆరోగ్యానికి అనేక విధాలుగా ప్రయోజనం చేకూరుస్తుందని ఆయుర్వేదం కూడా చెబుతుంది. ముఖ్యంగా శీతాకాలంలో జొన్న రొట్టెను ఎలా తినాలో, దానిని తప్పుగా తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రమాదాలు ఏమిటో బాబా రామ్‌దేవ్ మాటల్లో ఇక్కడ తెలుసుకుందాం..

మిల్లెట్స్ దాగిన పోషకాలు ఇవే

మిల్లెట్స్‌ ఆరోగ్యానికి ఓ వరం. ఎందుకంటే వీటిల్లో కేలరీలు, ప్రోటీన్, కార్బోహైడ్రేట్లు, ఫైబర్, కొవ్వు, కాల్షియం, ఐరన్‌, మెగ్నీషియం, భాస్వరం, పొటాషియం, సోడియం, జింక్ , విటమిన్ బి1, బి2 , బి3, ఫోలేట్ వంటి అనేక పోషకాలు పుష్కలంగా ఉంటాయి .

గోధుమ కంటే జొన్న ఎందుకు మంచిదంటే?

మన దేశంలో చాలా మందికి రోజూ గోధుమ రొట్టె, బియ్యం తినడం అలవాటు. గోధుమ రొట్టె హానికరం కాకపోయినా, అది ఆరోగ్యానికి అంత మంచిది కాదని జైపూర్‌కు చెందిన ఆయుర్వేద నిపుణుడు కిరణ్ గుప్తా అంటున్నారు. అయితే మిల్లెట్ పిండిలో ఫైబర్ పుష్కలంగా ఉంటుందని, ఇది పేగు ఆరోగ్యానికి ప్రయోజనకరంగా ఉంటుందని బాబా రాందేవ్ అంటున్నారు. దీనిని ఎలా తినాలో వివరిస్తూ బాబా రాందేవ్‌ సోషల్ మీడియాలో ఓ వీడియో పోస్టు చేశారు.

ఇవి కూడా చదవండి

బాబా రాందేవ్ ఏం చెబుతున్నారంటే?

జొన్న, రాగి పిండిని కలిపి తినడం వల్ల రెట్టింపు ప్రయోజనాలు లభిస్తాయని బాబా రాందేవ్‌ తన వీడియోలో వివరించారు. ఆర్థరైటిస్, ఊబకాయంతో బాధపడుతున్న ఎవరైనా జొన్న, రాగులను కలిపి తినడం మంచిదని ఆయన చెబుతున్నారు. ఈ రెండు మిల్లెట్ల పిండిని కలిపి రోటీలు తయారు చేయడం వల్ల అవి మృదువుగా మారుతాయి. జొన్నపిండితో తయారు చేసిన రోటీలు చాలా గట్టిగా ఉంటాయి. అయితే జొన్న పిండిలో రాగి పిండి కలిపితే అవి మృదువుగా, రుచికరంగా మారుతాయి. రాగులు, మిల్లెట్లలో స్టార్చ్, సహజ చక్కెరలు తక్కువగా ఉంటుందని, వాత వ్యాధులను తగ్గించడంలో, బరువు నిర్వహణలో ఇవి ప్రభావవంతంగా ఉంటాయని బాబా రాందేవ్‌ వివరించారు. కలబంద, మెంతి మొలకలు, పచ్చి పసుపుతో తయారు చేసిన కూరతో రాగి, జొన్న రోటీలు తినాలని బాబా రాందేవ్ సిఫార్సు చేస్తున్నారు. ఈ కూరను ఎలా తయారు చేయాలో కూడా ఆయన వివరించారు.

ముందుగా 200 గ్రాముల కలబంద జెల్, 20 గ్రాముల మెంతి మొలకలు, 10 గ్రాముల పచ్చి పసుపుతో కూర తయారు చేసి మిల్లెట్, రాగి రోటీలతో తినాలి. ఈ వంటకం తిన్న తర్వాత దాదాపు 99 శాతం మందిలో ఆర్థరైటిస్ సమస్యలు తగ్గాయని బాబా రాందేవ్ చెప్పారు. ఇందులో వాడిన కలబందను సర్వరోగ నివారిణిగా బాబా రామ్‌దేవ్ అభివర్ణించారు. మెక్సికన్లు సైతం మధుమేహం, ఆర్థరైటిస్, కడుపు సమస్యలకు కలబందను ఉపయోగిస్తుంటారని బాబా రామ్‌దేవ్ తెలిపారు. అందుకే ఈ ఇండియన్‌ మొక్కను శతాబ్దాలుగా ఔషధంగా ఉపయోగిస్తున్నారు. దీనిని వండుకుని కూరగా కూడా తినవచ్చరి పేర్కొన్నారు. అందుకే ప్రతి ఇంట్లో కలబందతో పాటు తులసి మొక్కలను నాటాలని ఆయన సూచించారు .

మరిన్ని ఆరోగ్య కథనాల కోసం క్లిక్‌ చేయండి.