Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Parle-G biscuits: కొత్త ప్యాకెట్‌తో సందడి చేస్తున్న పార్లే-జి బేబీ.. ఇప్పుడు మరింత మధురంగా..

80వ దశకం ప్రారంభం వరకు దీని పేరు అలాగే ఉంది. కానీ 1981లో కంపెనీ పార్లేజ్-గ్లూకోను కేవలం ‘G’గా మార్చింది. ఈ ‘G’ అంటే గ్లూకోజ్. 80వ దశకంలో ఈ బిస్కెట్ పిల్లల నుండి పెద్దల వరకు ప్రాచుర్యం పొందింది. పిల్లలకు నచ్చడంతో కంపెనీ ఈ ‘జీ’ పదాన్ని జీనియస్‌గా మార్చింది. అయితే,..

Parle-G biscuits: కొత్త ప్యాకెట్‌తో సందడి చేస్తున్న పార్లే-జి బేబీ..  ఇప్పుడు మరింత మధురంగా..
Parle G Biscuits
Follow us
Jyothi Gadda

|

Updated on: Jan 05, 2023 | 7:32 AM

పార్లే -జి బిస్కెట్లు ఎన్నో చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తుకు తెస్తాయి. మీరు ఎప్పుడో ఒకసారి పార్లే-జిని తిని ఉంటారు. ఈ బిస్కెట్‌ ఎన్నో ఏళ్ల నుంచి ఫేమస్‌గా ఉంది. ఒక కప్పు టీ, పార్లే-జి బిస్కెట్ ఆ పూటకి సరిపోతుంది. పార్లే-జి బిస్కెట్ల తర్వాత వెంటనే పసుపు ప్యాకెట్, చిన్న అమ్మాయి ఫోటో గురించి ఆలోచించడం సాధారణం. అయితే ఇప్పుడు రకరకాల ఫ్లేవర్లలో లభించే బిస్కెట్ల ప్యాకెట్ల ట్విట్టర్ యూజర్ @hojevlo పార్లే-జి ప్యాకెట్ చిత్రాన్ని షేర్‌ చేశారు. పార్లే-జి ఇప్పుడు పండ్లు ,ఓట్స్ వంటి కొత్త రుచులతో నిండిపోయింది. అయితే ఇది మీరు సాధారణంగా తినే పార్లే-జీ కాదు. బదులుగా అది పండ్లు, ఓట్స్‌తో తయారు చేసి ప్యాక్‌ చేయబడింది. ఇది ఇప్పటికే దేశవ్యాప్తంగా మార్కెట్ అవుతోంది. అతను పంచుకున్న పోస్ట్ ఇప్పుడు నెట్టింట వైరల్‌ అవుతోంది.

ఈ పోస్ట్‌ను 18.7 వేల మంది వీక్షించారు. అలాగే తమ చిన్ననాటి జ్ఞాపకాల గురించి కూడా పలువురు కామెంట్ల రూపంలో వ్యక్తం చేస్తున్నారు. ఫోటోను రిట్విట్‌ చేస్తూ మరింత వైరల్‌గా మార్చేస్తున్నారు. ఇక పోస్ట్‌కు సంబంధించి కామెంట్స్ చాలా వైవిధ్యంగా ఉన్నాయి. కొందరు పార్లే-జి అసలు రుచిని ఎలా ఇష్టపడతారో రాస్తే.. మరికొందరు కొత్త రుచిని ప్రయత్నించడానికి ఉత్సాహంగా ఉన్నారు. కొంతమంది సోషల్ మీడియా వినియోగదారులు తమ బాధను వ్యక్తం చేస్తూ, పార్లే-జి బిస్కెట్ల రుచి, ప్యాకేజింగ్ తమ చిన్ననాటి జ్ఞాపకాలకు ప్రతీకగా చెబుతున్నారు. ఎందుకంటే చాలా ఏళ్లుగా ఓ చిన్నారి బొమ్మతో కూడిన ప్యాకెట్ వస్తోందని.. ఆ ప్యాకెట్ చూడగానే చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తుకొచ్చాయని చెబుతున్నారు. ఇకపోతే, కొత్త డిజైన్, అభిరుచితో ప్రజలకు చేరువ కావడం సంతోషించదగ్గ విషయమని మరికొందరు నెటిజన్లు కామెంట్ చేశారు.

ఇవి కూడా చదవండి

ఇకపోతే, పార్లే ఉత్పత్తులు 1929లో స్థాపించబడ్డాయి. అప్పుడు అక్కడ 12 మంది మాత్రమే ఈ కంపెనీలో పని చేసేవారు. 1938లో మొదటిసారి బిస్కెట్‌ను తయారు చేశారు. బిస్కెట్‌కి పార్లేజ్-గ్లూకో అని పేరు పెట్టారు. 80వ దశకం ప్రారంభం వరకు దీని పేరు అలాగే ఉంది. కానీ 1981లో కంపెనీ పార్లేజ్-గ్లూకోను కేవలం ‘G’గా మార్చింది. ఈ ‘G’ అంటే గ్లూకోజ్. 80వ దశకంలో ఈ బిస్కెట్ పిల్లల నుండి పెద్దల వరకు ప్రాచుర్యం పొందింది. పిల్లలకు నచ్చడంతో కంపెనీ ఈ ‘జీ’ పదాన్ని జీనియస్‌గా మార్చింది. అయితే ప్యాకెట్‌పై పార్లే-జి అని రాసి ఉంది.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..