Parents Tips: తల్లిదండ్రులు పిల్లల ముందు ఇలాంటి మాటలు మాట్లాడకపోవడం చాలా మంచిది
సాధారణంగా చాలా మంది తల్లిదండ్రులు పిల్లలను ఎప్పుడు తిడుతుంటారు. వారు చేసే అల్లరి వల్ల తల్లిదండ్రులకు తెగ కోపం వస్తుంటుంది. దీంతో పిల్లలను తల్లిదండ్రులు ఇష్టానుసారంగా తిడుతుంటారు. అలాగే పిల్లలు ఎలాంటి ప్రశ్నలు అడిగినా సహనం కోల్పోకుండా సమాధానాలు చెప్పడం మంచిది. అలాగే ఏదైనా..
సాధారణంగా చాలా మంది తల్లిదండ్రులు పిల్లలను ఎప్పుడు తిడుతుంటారు. వారు చేసే అల్లరి వల్ల తల్లిదండ్రులకు తెగ కోపం వస్తుంటుంది. దీంతో పిల్లలను తల్లిదండ్రులు ఇష్టానుసారంగా తిడుతుంటారు. అలాగే పిల్లలు ఎలాంటి ప్రశ్నలు అడిగినా సహనం కోల్పోకుండా సమాధానాలు చెప్పడం మంచిది. అలాగే ఏదైనా తెలియకపోతే వారిపై కోపగించుకోవద్దని సైకాలజీ నిపుణులు చెబుతున్నారు. తల్లిదండ్రులు చెప్పే మాటలను బట్టి పిల్లల్లో మార్పులు వస్తుంటాయి. వారి వ్యక్తిత్వ వికాసంలో కీలక పాత్రలు పోషిస్తాయి.
అలాగే పిల్లలు అడిగే ప్రశ్నలను సాధారణంగా మనం ఎదురు చెబుతావా అని నిలదీస్తే పిల్లలు తమ ఆలోచనలు తమలోనే అగణదొక్కి.. మొండిగా ప్రవర్తించే అవకాశాలున్నాయి. దీని వల్ల కుటుంబానికి, సమాజానికి చెడ్డ పేరు వచ్చే అవకాశాలున్నాయి. పిల్లలపై తల్లిదండ్రులు ప్రవర్తించే తీరును బట్టి వారిలో మార్పులు వచ్చే అవకాశాలున్నాయి. వారిని చీటికి మాటికి తిడుతుంటే వారు మరింత మొండిగా మారే అవకాశాలున్నాయని నిపుణులు చెబుతున్నారు.
ముఖ్యంగా తల్లిదండ్రులు పిల్లల ముందు కొన్ని అనరాని మాటలను అనకపోవడం చాలా మంచిదంటున్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలను చెడు ప్రభావంతో చూడకూడదు. వారిని ఇష్టానుసారంగా మాటలు అంటూ వారిని బాధపెట్టకూడదు. వారి ముందు చెడుగా మాట్లాడటం వల్ల ఈ విషయాలను ఎవ్వరితో షేర్ చేసుకోలేక బాధపడుతుంటారు. తల్లిదండ్రులు మాట్లాడే మాటలు బాణంలా గుచ్చుకునేలా ఉంటే వారి మనసు చాలా గాయపడే అవకాశం ఉంది. తల్లిదండ్రులకు ఎవరికైనా కోపం వస్తుంది. నువ్వు ఎందుకు పుట్టావురా అనవసరంగా.. నీ వల్ల మాకు ఎలాంటి లాభం లేదు.. నీకు ఏ పని చేతకాదు.. నీవల్లే నాకు మనశ్శాంతి లేదు. నీవల్లే ఇంట్లో దరిద్రం తలెత్తుతుందంటూ పిల్లలను పదేపదే అనడం వల్ల ప్రమాదం తలెత్తే అవకాశం ఉంది. దీనివల్ల వారి మనసు మరింత గాయమై ప్రాణాల మీదకు వచ్చే అవకాశం ఉందంటున్నారు. పిల్లలను పదేపదే తిడుతుండటం వల్ల వారిపై తీవ్ర ప్రభావం చూపే అవకాశాలున్నాయి. అందుకే పిల్లలను పదేపదే తిట్టకూడదని సూచిస్తున్నారు.
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి