Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Parenting Tips: తల్లిదండ్రులు పిల్లలపై ఇలా ప్రవర్తిస్తున్నారా..? అయితే జాగ్రత్త.. వారిపై తీవ్ర ప్రభావం

పిల్లల పెంపకంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యం. చదువులు ముందుండటం, ఇతరులను గౌరవించడం లాంటివి పిల్లలకు చాలా ముఖ్యం. పిల్లల విషయంలో తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ద ఉంచాలి. చిన్నపాటి విషయాలే..

Parenting Tips: తల్లిదండ్రులు పిల్లలపై ఇలా ప్రవర్తిస్తున్నారా..? అయితే జాగ్రత్త.. వారిపై తీవ్ర ప్రభావం
Parenting Tips
Follow us
Subhash Goud

|

Updated on: Apr 09, 2023 | 8:47 PM

పిల్లల పెంపకంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యం. చదువులు ముందుండటం, ఇతరులను గౌరవించడం లాంటివి పిల్లలకు చాలా ముఖ్యం. పిల్లల విషయంలో తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ద ఉంచాలి. చిన్నపాటి విషయాలే పిల్లలపై తీవ్ర ప్రభావం చూపుతుంది. మీ చిన్న పోలిక మీ చిన్న పిల్లల మనస్సుపై ఎలా చెడు ప్రభావాన్ని చూపుతుందో, అది వారి ఆత్మగౌరవాన్ని ఎలా తగ్గించగలదో తెలుసుకుందాం..

  1. తల్లిదండ్రులు పెద్ద పిల్లలను వారి తమ్ముళ్లతో పోల్చినట్లయితే, అది పిల్లలలో పోటీ భావనను పెంపొందిస్తుంది. పెద్ద పిల్లలు చిన్న పిల్లలతో ఆటపట్టించడం, గొడవ చేయడం, కొట్టడం, దూకుడుగా ప్రవర్తించడం ప్రారంభించే అవకాశాలుంటాయి.
  2. పిల్లలను వారి తోబుట్టువులు, స్నేహితులు లేదా బంధువులతో పోల్చినప్పుడు, వారు అసురక్షితంగా భావిస్తారు. వారి తల్లిదండ్రుల నుంచి దూరం ఉంచడానికి ప్రయత్నిస్తారు. ఇది వారి సంబంధాన్ని కూడా బలహీనపరుస్తుంది.
  3. పిల్లలను ప్రశంసించనప్పుడు, ఇతరులతో నిరంతరం పోల్చినప్పుడు వారి ప్రతిభ వికసించదు. వారు అదే ఉత్సాహంతో, అభిరుచితో పని చేయరు.
  4. పిల్లలు తమ తల్లితండ్రులు ఇతర పిల్లలను ఎక్కువగా అభినందిస్తున్నట్లు చేస్తే వారు అసహ్యించుకుంటారు. వారి తల్లిదండ్రులను సంతోషపెట్టడానికి ఎప్పుడూ ప్రయత్నించరు.
  5. పిల్లలను తల్లిదండ్రులు నిరంతరం దూషించినట్లయితే వారు తల్లిదండ్రులను దూరం పెట్టడం ప్రారంభిస్తారట. అలాగే సామాజిక సంబంధాలను నివారించడం ప్రారంభిస్తారు.
  6. ఇతర పిల్లలతో పోల్చడం పిల్లల విశ్వాసాన్ని ప్రభావితం చేస్తుంది. ఒక పిల్లవాడు తనకు ‘ఉపయోగం లేదు’ అని భావిస్తే, అతని పనితీరు మరింత దిగజారవచ్చు.
  7. పిల్లలు బాగా రాణించలేరని నమ్మడం మొదలుపెట్టినప్పుడు పిల్లల ఎదుగుదల మందగిస్తుంది. తల్లిదండ్రుల అంచనాలకు తగ్గట్టుగా ఉండలేమని ఎప్పుడూ అనుకుంటారట.

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. మానసిక సైకాలజీ నిపుణుల ప్రకారం అందించడం జరుగుతుంది. ఏవైనా సందేహాలు ఉంటే నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి