Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Lifestyle: పాదాలలో నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది దేనికి సంకేతమో తెలుసా.?

దీర్ఘకాలికంగా పాదాల్లో నొప్పిగా ఉండడం అధిక కొలెస్ట్రాల్‌కు సంకేతం కావొచ్చని నిపుణులు చెబుతున్నారు. అలాగే కాళ్లలో సరైన రక్తప్రసరణ లేనిసమయంలో కాళ్లలో జలదరింపు, నొప్పి ఉంటుందని చెబుతున్నారు. ఇది శరీరంలో కొవ్వు పెరుగుతోందని చెప్పడానికి ప్రాథమిక సమాచారం. నెల రోజులకుపైగా నొప్పి కొనసాగితే వెంటనే వైద్యులను సంప్రదించాలని నిపుణులు చెబుతున్నారు...

Lifestyle: పాదాలలో నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది దేనికి సంకేతమో తెలుసా.?
Pain In Legs
Follow us
Narender Vaitla

|

Updated on: Mar 27, 2024 | 4:14 PM

మనలో తలెత్తే అనారోగ్య సమస్యల గురించి శరీరం మనల్ని ముందుగానే హెచ్చరిస్తుంది. వీటినే లక్షణాలుగా చెబుతుంటాం. కొన్ని రకాల వ్యాధులకు కొన్ని రకాల లక్షణాలు కనిపిస్తుంటాయి. అయితే వీటిని ముందుగా గుర్తించి సరైన చికిత్స తీసుకుంటే సమస్య జటిలం కాకుండా ఉంటుంది. అలా కాకుండా నిర్లక్ష్యం చేస్తే తీవ్ర నష్టాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇలాంటి లక్షణాల్లో ఒకటి పాదాల్లో నొప్పి. సహజంగా పాదాల్లో నొప్పిని మనం లైట్ తీసుకుంటాం కానీ ఇది తీవ్రమైన వ్యాధికి దారి తీయొచ్చని నిపుణులు చెబుతున్నారు. ఇంతకీ పాదాల్లో నొప్పి దేనికి సంకేతమో ఇప్పుడు తెలుసుకుందాం.

దీర్ఘకాలికంగా పాదాల్లో నొప్పిగా ఉండడం అధిక కొలెస్ట్రాల్‌కు సంకేతం కావొచ్చని నిపుణులు చెబుతున్నారు. అలాగే కాళ్లలో సరైన రక్తప్రసరణ లేనిసమయంలో కాళ్లలో జలదరింపు, నొప్పి ఉంటుందని చెబుతున్నారు. ఇది శరీరంలో కొవ్వు పెరుగుతోందని చెప్పడానికి ప్రాథమిక సమాచారం. నెల రోజులకుపైగా నొప్పి కొనసాగితే వెంటనే వైద్యులను సంప్రదించాలని నిపుణులు చెబుతున్నారు. కొన్ని సందర్భాల్లో నడవడానికి కూడా ఇబ్బంది మారుతుందని చెబుతున్నారు.

పాదాలు, కాళ్లలో దీర్ఘకాలికంగా నొప్పి ఉంటే కాళ్లలో రక్త ప్రసరణ సరిగా లేకపోవడంతో పాటు కొలెస్ట్రాల్‌ పెరగడం కూడా ఒక కారణమని చెబుతున్నారు. ఇది గుండె సంబంధిత సమస్యలకు కూడా సూచనగా చెబుతున్నారు. గణంకాల ప్రకారం భారత దేశంలో 25 నుంచి 30 శాతం మంది అధిక కొలెస్ట్రాల్‌తో బాధపడుతున్నట్లు తేలింది. దీంతో గుండెపోటు, పక్షవాతం వంటి సమస్యలకు దారి తీస్తుందని చెబుతున్నారు.

అయితే పెరిఫెరల్‌ ఆర్టరీ అనే సమస్య వల్ల కూడా పాదాలలో నొప్పి వేధిస్తుందని నిపుణులు చెబుతున్నారు. అయితే ఇది కొంత సమయానికే దానంతట అదే తగ్గిపోతుంది. ఎక్కువకాలంపాటు కాళ్లలో బిగుసుకుపోయి నొప్పి ఉంటే మాత్రం వెంటనే వైద్యులను సంప్రదించాలని చెబుతున్నారు. సాధారణంగా ఊబకాయం లేదా 60 ఏళ్లు పైబడిన వారిలో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుంది. కాళ్లలో వాపు నొప్పి తగ్గాలంటే కొలెస్ట్రాల్ స్థాయిలు సమతుల్యంగా ఉండేలా చూసుకోవాలని చెబుతున్నారు. ముఖ్యంగా అధికంగా కొవ్వు ఉండే పదార్థాలకు దూరంగా ఉండాలని చెబుతున్నారు. స్మోకింగ్, ఆల్కహాల్‌ వంటి వాటికి దూరంగా ఉండాలి.

నోట్‌: పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..