పసిడి వర్ణంతో మెరిసిపోయే ఈ పండు ఎన్నో పోషకాలను అందిస్తుంది. అలసటను తగ్గించడం దగ్గరి నుంచి రోగనిరోధకతను పెంచడం వరకూ ఈ పండు ప్రత్యేకతలు ఎన్నో
TV9 Telugu
బొప్పాయిలో విటమిన్-ఎ, బి, సి, ఇ, కెలతోపాటు క్యాల్షియం, మెగ్నీషియం, జింక్, ఫోలేట్ మూలకాలుంటాయి. దీనిలోని విటమిన్-సి దంతాలు, చిగుళ్ల సమస్యలను తగ్గించడంతోపాటు రోగనిరోధకతను పెంచడానికి సాయపడుతుంది
TV9 Telugu
దీన్ని తరచూ తీసుకుంటే రకరకాల జబ్బుల బారిన పడకుండా ఉంటాం. ఈ పండులోని పొటాషియం, యాంటీఆక్సిడెంట్లు, పీచు గుండె ఆరోగ్యాన్ని కాపాడతాయి. అధిక రక్తపోటును నియంత్రిస్తాయి
TV9 Telugu
అందుకే బొప్పాయి తినడం ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరంగా పరిగణించబడుతుంది. ఇందులో ఉండే యాంటీఆక్సిడెంట్లు శరీరాన్ని వ్యాధుల నుంచి రక్షించడంలో చాలా ప్రయోజనకరంగా ఉంటుంది
TV9 Telugu
అయితే కొందరు బొప్పాయి రాత్రిపూట తినకూడదని అంటుంటారు. నిజానికి, నిపుణుల అభిప్రాయం ప్రకారం రాత్రిపూట బొప్పాయి తినవచ్చని అంటున్నారు
TV9 Telugu
రాత్రిపూట బొప్పాయి తినాలని భావిస్తే, భోజనానికి ముందు తినడం మంచిది. బొప్పాయిలో విటమిన్ సి, ఫోలేట్, ఫైబర్, పొటాషియం బరువు తగ్గడానికి ఉపయోగపడతాయి
TV9 Telugu
ఇందులో ఉండే యాంటీఆక్సిడెంట్లు, ఫైబర్ కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో ప్రయోజనకరంగా ఉంటాయి. దీనివల్ల గుండె జబ్బుల ప్రమాదం తగ్గుతుంది
TV9 Telugu
జీర్ణవ్యవస్థను మెరుగుపరచడానికి బొప్పాయి తినడం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఇందులో ఉండే ఫైబర్ జీర్ణవ్యవస్థను బలపరుస్తుంది