Tips for Heat Stroke: భగభగ మండే భానుడి సెగకు ఇలా చెక్ పెట్టండి..
మార్చి నెలలోనే ఎండలు ముదిరిపోతున్నాయి. రోజు రోజుకూ ఉష్ణోగ్రత లెవల్స్ పెరుగుతున్నాయి. భానుడి సెగకు అప్పుడే జనం అల్లాడుతున్నారు. మధ్యాహ్నం సమయంలో ఎవరూ రోడ్లపై కనిపించడం లేదు. ఎండ దెబ్బకు ఇప్పటి నుంచే జాగ్రత్తలు తీసుకుంటున్నారు జనం. ఎంత ఇంట్లో ఉన్నా.. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా హీట్ స్ట్రోక్‌కు ఖచ్చితంగా గురవుతారు. వడదెబ్బ బారిన పడకుండా ఉండాలంటే ఖచ్చితంగా..
Updated on: Mar 27, 2024 | 3:24 PM

మార్చి నెలలోనే ఎండలు ముదిరిపోతున్నాయి. రోజు రోజుకూ ఉష్ణోగ్రత లెవల్స్ పెరుగుతున్నాయి. భానుడి సెగకు అప్పుడే జనం అల్లాడుతున్నారు. మధ్యాహ్నం సమయంలో ఎవరూ రోడ్లపై కనిపించడం లేదు. ఎండ దెబ్బకు ఇప్పటి నుంచే జాగ్రత్తలు తీసుకుంటున్నారు జనం.

ఎంత ఇంట్లో ఉన్నా.. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా హీట్ స్ట్రోక్‌కు ఖచ్చితంగా గురవుతారు. వడదెబ్బ బారిన పడకుండా ఉండాలంటే ఖచ్చితంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. లేదంటే ప్రాణినికే ప్రమాదం అని నిపుణులు చెబుతున్నారు.

వడ దెబ్బ తగలకుండా ఉండాలంటే.. యాపిల్ సైడర్ వెనిగర్‌ను మీ డైట్‌లో చేర్చుకోవడం ముఖ్యం. ఇందులో చాలా రకాల పోషకాలు ఉన్నాయి. ఇవి వేసవి తాపం నుంచి మిమ్మల్ని బయట పడేస్తుంది. అదే విధంగా కొబ్బరి నీటిని తప్పకుండా తీసుకోండి.

పుదీనా రసం తీసుకోవడం వల్ల కూడా మీరు వడదెబ్బకు గురయ్యే అవకాశాలు తక్కువగా ఉంటాయి. పుదీనా శరీరాన్ని చల్లబరుస్తుంది. మార్కెట్లో దొరికే వాటికంటే.. మీరు ఇంట్లోనే పుదీనా రసం తయారు చేసుకోవచ్చు. మజ్జిగలో కూడా పుదీనా పేస్ట్ కలుపుకోవచ్చు.

Heat wave




