- Telugu News Photo Gallery Suffering from dust allergy? Reduce with these tips, check details in Telugu
Remedies for Dust Allergy: డస్ట్ అలెర్జీతో ఇబ్బంది పడుతున్నారా.. ఈ చిట్కాలతో చెక్ పెట్టండి!
డస్ట్ అలెర్జీ అనేది సాధారణ సమస్యే ఉన్నా.. దీని వల్ల చాలా రకాల ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి ఉంటుంది. డస్ట్ అలెర్జీ కారణంగా ముక్కు కారడం, తుమ్ములు, దగ్గు, కళ్లు ఎర్రబడటం, గొంతు మంట వంటి లక్షణాలు కలుగుతాయి. చలి కాలంలో ఈ సమస్య మరింత ఇబ్బంది పెడుతుంది. డస్ట్ అలెర్జీ అనేది దుమ్ములోని సూక్ష్మ పురుగుల వల్ల వస్తుంది. కొన్ని చిట్కాలు పాటిస్తే ఈ సమస్యను సులువుగానే..
Updated on: Mar 27, 2024 | 2:46 PM

డస్ట్ అలెర్జీ అనేది సాధారణ సమస్యే ఉన్నా.. దీని వల్ల చాలా రకాల ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి ఉంటుంది. డస్ట్ అలెర్జీ కారణంగా ముక్కు కారడం, తుమ్ములు, దగ్గు, కళ్లు ఎర్రబడటం, గొంతు మంట వంటి లక్షణాలు కలుగుతాయి. చలి కాలంలో ఈ సమస్య మరింత ఇబ్బంది పెడుతుంది.

డస్ట్ అలెర్జీ అనేది దుమ్ములోని సూక్ష్మ పురుగుల వల్ల వస్తుంది. కొన్ని చిట్కాలు పాటిస్తే ఈ సమస్యను సులువగానే అధిగమించవచ్చు. డస్ట్ అలెర్జీ సమస్యకు చెక్ పెట్టేందుకు కొన్ని ఈ చిట్కాలు బాగా హెల్ప్ చేస్తాయి.

డస్ట్ అలెర్జీ ఉన్నవారు యాంటీ ఆక్సిడెంట్లు ఉన్నటువంటి ఆహారాలను ఎక్కువగా తీసుకోవాలి. తేనె, పసుపు, బెర్రీలు, ఆకు కూరలు, ఫ్రెష్ పండ్లు, కూరగాయలు, నట్స్ వంటి వాటిని తీసుకోవాలి. అలాగే డైరీ ప్రోడెక్ట్స్, ప్రాసెస్ చేసిన ఆహారాలు చాలా తక్కువ మోతాదులో తీసుకోవాలి.

తులసి, బ్రామ్మీ, అశ్వగంధ వంటి ఆయుర్వేద మూలికలు తీసుకుంటే.. డస్ట్ అలెర్జీ సమస్యలను తగ్గించడంలో హెల్ప్ చేస్తాయి. ఈ మూలికలతో తయారు చేసిన టీలు, డ్రింక్స్, కషాలు తాగవచ్చు.

అలాగే డస్ట్ అలెర్జీ ఉన్నవారు క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. శ్వాస వ్యాయామాలు, ముఖ్యంగా ప్రాణాయామం వంటివి చేయాలి. పుష్కలంగా నీటిని తాగాలి. తగినంత నిద్ర కూడా పోతూ ఉండాలి.




