పోషకాల పరంగా పాలకు సాటి వచ్చేది మరేదీ లేదు. క్యాల్షియం, మాంసకృత్తులు, కొవ్వులు, విటమిన్ ఎ, బి.. ఒకటేమిటి పాలతో లభించే పోషకాలు బోలెడు
TV9 Telugu
శరీరానికి అవసరమైన కేలరీలు, ప్రోటీన్, ఫైబర్, చక్కెర, కొవ్వు, కాల్షియం, అనేక రకాల విటమిన్లు, పోషకాలను అందిస్తాయి
TV9 Telugu
అలాగే అరటిపండ్లలో కేలరీలు, ప్రోటీన్, కార్బోహైడ్రేట్లు, చక్కెర, ఫైబర్, కొవ్వు, పొటాషియం, విటమిన్ బి6, విటమిన్ సి వంటి అనేక ఇతర పోషకాలు లభిస్తాయి
TV9 Telugu
అందుకే చాలా మంది అరటిపండు, పాలతో షేక్స్ తయారు చేసి తాగుతారు. కానీ అరటిపండు, పాలు కలిపి తీసుకోవడం సరైనదేనా? నిపుణులు ఏం చెబుతున్నారంటే
TV9 Telugu
అరటిపండు షర్బత్ కు బదులుగా అరటిపండు తిని పాలు తాగితే మంచిదని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు. సన్నగా ఉన్నవారు పాలు తాగిన తర్వాత అరటిపండు తింటే, వేగంగా బరువు పెరగడానికి సహాయపడుతుందని నిపుణులు అంటున్నారు. అయితే దానిలో చక్కెర వేసుకోకపోవడమే మంచిది
TV9 Telugu
చక్కెర తీసుకుంటే కేలరీలు అధికంగా ఒంట్లోకి చేరుతాయి. అందువల్లనే ఈ పాలు, అరటి పండుతో చక్కెర తీసుకోకూడదని ఆరోగ్య నిపుణులు అంటున్నారు
TV9 Telugu
పాలు, అరటి పండు కలిపి తీసుకుంటే శరీరానికి సమృద్ధిగా ప్రోటీన్, వివిధ రకాల విటమిన్లు, ఖనిజాలు అందుతాయి. అయితే దీనిని సాయంత్రం లేదా ఉదయం వేళల్లో తీసుకుంటే మరింత ప్రయోజనకరంగా ఉంటుంది
TV9 Telugu
అరటిపండు తియ్యగా ఉంటుంది. కాబట్టి మధుమేహం ఉన్నవారు, అధిక బరువు ఉన్నవారు, అరటిపండు - పాలతో అలెర్జీ ఉన్నవారు దీనిని తినకపోవడమే మంచిది