ప్రపంచంలో అత్యధికంగా కాలుష్య నగరాలు ఇవే!

TV9 Telugu

12 March 2025

ద వరల్డ్‌ ఎయిర్‌ క్వాలిటీ రిపోర్ట్-2024 నివేదిక షాకిస్తోంది. ప్రపంచంలో అత్యధికంగా కాలుష్యం వెలువడే 20 నగరాల్లో 13 భారత్‌లోనే ఉన్నాయనే రిపోర్ట్‌ ఆందోళన.

స్విస్ ఎయిర్ క్వాలిటీ టెక్నాలజీ కంపెనీ ఐక్యూ ఎయిర్ కాలుష్యంపై రూపొందించిన ద వరల్డ్‌ ఎయిర్‌ క్వాలిటీ రిపోర్ట్-2024 నివేదిక.

ఈ జాబితాలో భారతదేశంలో అత్యధిక కాలుష్యంలో అసోం రాష్ట్రంలోని బైర్నీహాట్‌ అనే నగరం తొలిస్థానం నిలిచింది.

తర్వాతి స్థానాల్లో ఢిల్లీ, పంజాబ్‌లోని ముల్లన్‌పుర్, ఫరీదాబాద్, గురుగ్రామ్, గంగానగర్, గ్రేటర్ నోయిడా, భివాడి, ముజఫర్‌నగర్, హనుమాన్‌గఢ్, నోయిడా.

ప్రపంచంలోనే అత్యంత కాలుష్యపూరిత రాజధానిగా భారతదేశంలోని ఢిల్లీ తొలి స్థానంలో కొనసాగుతున్నట్లు నివేదిక.

2023లో ఈ సంస్థ విడుదల చేసిన జాబితాలో ప్రపంచంలోని మూడో అత్యంత కలుషిత వాతావరణ దేశంగా భారత్‌. ప్రస్తుతం విడుదలైన జాబితాలో భారత్ ఐదో స్థానం.

కాలుష్యం వల్ల భారతదేశంలో నివసిస్తున్న ప్రజల ఆయుర్దాయం దాదాపు 5.2 సంవత్సరాలు తగ్గినట్లు నివేదికలు చెబుతున్నాయి.

2009 నుంచి 2019 వరకు భారత్‌లో ప్రతియేటా కాలుష్య సంబంధిత వ్యాధుల వల్ల దాదాపు 1.5 మిలియన్ల మంది మృతి చెందారు.

కొన్నిరకాల వాహనాలపై జరిమానాలు, పరిశ్రమలు, నిర్మాణసంస్థలు తగిన నిబంధనలు పాటించడం వల్ల కాలుష్యాన్ని అరికట్టవచ్చంటున్న సౌమ్య స్వామినాథన్.