మీ పిల్లలకు డాల్ఫీన్స్ చూడటం అంటే ఇష్టమా.? ఇక్కడికి తీసుకొని వెళ్ళండి..
TV9 Telugu
11 March 2025
భారతదేశంలోని ప్రశాంతమైన బ్యాక్ వాటర్స్ నుంచి తీరప్రాంత స్వర్గధామాల వరకు, అడవిలో డాల్ఫిన్లను చూడటానికి ఉత్తమమైన 7 ప్రదేశాలు గురించి చూద్దాం.
చిలికా సరస్సు, ఒడిశా: ఒడిశాలోని అద్భుతమైన చిలికా సరస్సులో, ముఖ్యంగా సతపదలో అరుదైన ఇరావడి డాల్ఫిన్‌లను చూడవచ్చు.
గోవా: పలోలెం బీచ్, మోర్జిమ్ బీచ్, మాండోవి నది చుట్టూ ఇండో-పసిఫిక్ హంప్‌బ్యాక్ డాల్ఫిన్‌లను చూసి ఎంజాయ్ చేయవచ్చు.
లక్షద్వీప్ దీవులు: స్పిన్నర్ డాల్ఫిన్లు, సముద్ర జీవులను చూడటానికి అనువైన లక్షద్వీప్ దీవుల అందాలను ఆస్వాదించవచచ్చు.
మహారాష్ట్ర: కొంకణ్ తీరం, ముఖ్యంగా దపోలి, తార్కర్లి, హంప్‌బ్యాక్, హిందూ మహాసముద్ర డాల్ఫిన్‌లకు ప్రసిద్ధి చెందాయి.
సుందర్బన్స్ నేషనల్ పార్క్, పశ్చిమ బెంగాల్: ఇరావడి, గంగా డాల్ఫిన్లను చూడటానికి సుందర్బన్స్ నేషనల్ పార్క్‌కు వెళ్లొచ్చు.
గంగా నది: విక్రమశిల డాల్ఫిన్ అభయారణ్యం, వారణాసి వద్ద అంతరించిపోతున్న గంగా నది డాల్ఫిన్‌లను చూడవచ్చు.
దిబ్రు-సైఖోవా జాతీయ ఉద్యానవనం, అసోం: మంచినీటి గంగా నది డాల్ఫిన్లను చూడటానికి అస్సాంలోని దిబ్రు-సైఖోవా జాతీయ ఉద్యానవనాన్ని సందర్శించండి.
మరిన్ని వెబ్ స్టోరీస్
దానిమ్మ ఆకుల కాషాయం.. ఆ సమస్యలకు యమపాశం..
సమ్మర్‌కి ఛలో సౌత్ ఇండియా.. ఉత్తమ ప్రదేశాలు ఇవే..
ముస్సోరీలో చాలామందికి తెలియని 8 రహస్య పట్టణాలు..