సమ్మర్‎కి ఛలో సౌత్ ఇండియా.. ఉత్తమ ప్రదేశాలు ఇవే.. 

TV9 Telugu

10 March 2025

అరకు వ్యాలీ, ఆంధ్రప్రదేశ్: ఇక్కడ వ్యాలీ కాఫీ తోటలు, గుహలు, ఉత్సాహభరితమైన గిరిజన సంస్కృతిని ఆస్వాదించవచ్చు.

మారేడుమిల్లి, ఆంధ్రప్రదేశ్: ఇది గొప్ప జీవవైవిధ్యాన్ని కలిగి తూర్పు కనుమలలో ఉన్న ప్రాంతం. ఇక్కడ అందమైన జలపాతాల్లో హాయిగా జలకాలు ఆడవచ్చు.

మున్నార్, కేరళ: ఇది ప్రకృతి ప్రేమికులకు అనువైన ప్రదేశం. ఇక్కడ పచ్చని తేయాకు తోటలు, చల్లని వాతావరణాన్ని ఆస్వాదించవచ్చు.

ఊటీ, తమిళనాడు: సుందరమైన బొమ్మ రైలులో ప్రయాణిస్తూ ఊటీలోని ఆహ్లాదకరమైన వాతావరణం, అద్భుతమైన తోటలను చూడవచ్చు.

కూర్గ్, కర్ణాటక: మరపురాని విహారయాత్ర కోసం కూర్గ్ బెస్ట్, సుందరమైన కాఫీ తోటలు, ఉత్కంఠభరితమైన జలపాతాలను వీక్షించవచ్చు.

హంపి, కర్ణాటక: విజయనగర సామ్రాజ్య వైభవాన్ని ప్రదర్శిస్తూన్న హంపి పురాతన శిథిలాలు, చారిత్రాత్మక దేవాలయాలను అన్వేషించండి.

వర్కల, కేరళ: ఇక్కడ నిర్మలమైన బీచ్‌లు, అద్భుతమైన కొండ చరియలతో పాటు ఆయుర్వేద వెల్‌నెస్ రిట్రీట్‌లలో విశ్రాంతి తీసుకోవచ్చు.

రామేశ్వరం, తమిళనాడు: ఇది పవిత్రమైన రామనాథస్వామి ఆలయానికి ప్రసిద్ధి. ఇక్కడ ప్రశాంతమైన బీచ్‌లు విశ్రాంతికు బెస్ట్.