విరాట్ ధరించే వాచ్ ధర ఎంత?

TV9 Telugu

07 March 2025

తాజాగా ఛాంపియన్ ట్రోపీలో భాగంగా భారత్-ఆస్ట్రేలియా మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ ఖరీదైన వాచ్ ధరించి కనిపించాడు.

ఛాంపియన్ ట్రోపీలో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్ తర్వాత విరాట్ కోహ్లీ రోలెక్స్ కాస్మోగ్రాఫ్ డేటోనా వాచ్ ధరించాడు.

విరాట్ కోహ్లీ ధరించిన ఈ గడియారం అందరి దృష్టిని ఆకర్షించింది. అతను ధరించిన వాచ్ విలువ అక్షరాల రూ.45,36,000.

కోహ్లీ వద్ద దానికంటే విలువైన గడియారాలు ఉన్నాయి. విరాట్ ఇంతకు ముందు కూడా ఈ గడియారాన్ని ధరించి కనిపించాడు.

భారత క్రికెటర్ మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ సంపాదించిన మొత్తం ఆస్తుల నికర విలువ దాదాపు రూ. 1,050 కోట్లు.

విరాట్ కోహ్లీ ఆటతీరు గురించి మాట్లాడుకుంటే, ఛాంపియన్ ట్రోపీలో ఆస్ట్రేలియాపై భారత్ విజయంలో అతనే హీరో.

ఛాంపియన్ ట్రోఫీ సెమీ ఫైనల్‌లో విరాట్ 98 బంతుల్లో 84 పరుగులు చేసి మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడాడు.

2025 ఛాంపియన్స్ ట్రోఫీలో విరాట్ ఇప్పటివరకు 217 పరుగులు చేశాడు. ఇందులో అతను పాకిస్తాన్‌పై సాధించిన సెంచరీ కూడా ఉంది.