ధనుష్కోడికి కాళరాత్రి మారిన ఆ నైట్.. తలచుకొంటేనే వెన్నులో వణుకు..
TV9 Telugu
06 March 2025
ధనుష్కోడి భారతదేశంలోని తమిళనాడు రాష్ట్రంలో పంబన్ ద్వీపనికి ఆగ్నేయ కోణం వద్ద ఉన్న ఒక పాడుబడిన పట్టణం.
ఈ ప్రాంతం పంబన్‌కు ఆగ్నేయంగా శ్రీలంకలోని తలైమన్నార్‌కు పశ్చిమాన 24 కిలోమీటర్లు (15 మైళ్ళు) దూరంలో ఉంది.
రామాయణంలోని రామసేతు ఉన్నది ఈ ప్రాంతంలోనే. ఏటా చాలామంది పర్యాటకులు ఇక్కడికి వస్తుంటారు. ఇక్కడ సరదాగా ఎంజాయ్ చేస్తారు.
అయితే సాయంత్రం 6:00 గంటలు దాటితే మాత్రం ఇక్కడికి నో ఎంట్రీ. దీనికి కారణం 60 ఏళ్ల క్రితం ఓ రాత్రి జరిగిన ఘటన.
ఆ రాత్రి సుందర నగరం ధనుష్కోడిని చరిత్ర పుస్తకాల్లో మాత్రమే మిగిల్చింది. ఇది తలచుకుంటే వెన్నులో వణుకు పెట్టాల్సిందే.
అది 17 డిసెంబర్ 1964, దక్షిణ అండమాన్ సముద్రంలో 5°N 93°E వద్ద ఉష్ణమండల అల్పపీడనం ఏర్పడింది. డిసెంబర్ 19 నాటికి తుఫానుగా తీవ్రమైంది.
21 డిసెంబర్ తర్వాత, అది పశ్చిమ దిశగా, దాదాపు సరళ రేఖలో, రోజుకు 400 నుండి 550 కిలోమీటర్లు (250 నుండి 340 మైళ్ళు) వేగంతో కదిలింది.
డిసెంబర్ 22న, అది శ్రీలంకలోని వవునియాను దాటి, డిసెంబర్ 22, 1964 రాత్రి ధనుష్కోడి వద్ద తీరాన్ని తాకింది. దీని గాలి వేగం గంటకు 280 కి.మీ. అలలు 7 మీటర్లు (23 అడుగులు) ఎత్తులో ఉన్నాయి.
డిసెంబర్ 22న సంభవించిన తుఫానులో 1,800 మంది మరణించారని అంచనా, ఇందులో పంబన్-ధనుష్కోడి ప్యాసింజర్ రైలులో ఉన్న 115 మంది ప్రయాణికులు ఉన్నారు.
ఒక్క రాత్రిలో మొత్తం ధనుష్కోడి పట్టణన్ని తనలో ఐక్యం చేసుకుంది సముద్రం. మద్రాస్ ప్రభుత్వం దాన్ని ఘోస్ట్ సిటీగా నివసించడానికి పనికిరానిదిగా ప్రకటించింది.