దానిమ్మ ఆకుల కాషాయం.. ఆ సమస్యలకు యమపాశం.. 

TV9 Telugu

10 March 2025

దానిమ్మ పండులో ముఖ్యంగా మెగ్నిషియం, సెలీనియం, జింక్ ఉంటుంది. అందుకే దానిమ్మ తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి.

దానిమ్మ ఆకులతో తయారు చేసిన కషాయం తీసుకోవడం వల్ల కామెర్లు తగ్గిపోతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

అంతేకాదు ఈ కషాయం తీసుకోవడం వల్ల దీర్ఘకాలిక జలుబు, దగ్గు సమస్యల నుంచి బయటపడతారు. రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది.

ఈ కాలంలో ఎక్కువశాతం నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నారు. ఇది విపరీతమైన స్ట్రెస్, ఇతర ఆరోగ్య కారణాలు. మీరు కూడా నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నట్లయితే ఇలా చేయండి..

ముందుగా దానిమ్మ ఆకులను ఒక గ్లాసు నీటిలో వేసి మరిగించాలి. మనం పోసిన నీటికి సగం అయ్యే వరకు బాగా మరిగించుకోవాలి.

ఇలా తయారు చేసిన నీటిని రోజుకు రెండుసార్లు తాగాలి.ఇలా చేయడం వల్ల కామెర్లు, నిద్రలేమి సమస్యకు కూడా చెక్ పెట్టొచ్చు.

దానిమ్మ ఆకులతో కషాయం మరో విధంగా కూడా తయారు చేసుకోవచ్చు. ఈ దానిమ్మ ఆకులను ఎండబెట్టి పొడిలాగా చేసుకోవాలి.

వీటిని నీటిలో వేసుకుని మరగకాచి తాగాలి. ప్రాస్టేట్ కేన్సర్‌కు చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది. కేన్సర్ కణాలను సైతం నయం చేస్తుంది.

దానిమ్మ పండు మూత్రపిండాల పనితీరుని మెరుగ్గా చేస్తుంది. కిడ్నీలో రాళ్ళ సమస్యని దూరం చేయడంలో ఈ పండు చాలా బాగా పనిచేస్తుంది.

దానిమ్మలో ఎల్లాజిటానిన్స్ అనే యాక్సిడెంట్స్ శరీరంలోని వాపుని తగ్గిస్తాయి. ఇవి బ్రెయిన్ హెల్త్‌కి చాలా మంచిది. దీంతో అల్జీమర్స్, పార్కిన్సన్స్ సమస్యలు దూరమవుతాయి.