AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Nita Ambani: చీరలో మెరిసే అంబానీ కోడలు ఈసారి వెస్టర్న్‌ వేర్‌‌లో అదరగొట్టారు! .. బ్లేజర్ ధర తెలిస్తే కళ్లు తిరగాల్సిందే

ఆమె ఒక వ్యాపార సామ్రాజ్యానికి మహారాణి.. ఫ్యాషన్ ప్రపంచానికి నిలువుటద్దం వలె నిలుస్తారు. సాధారణంగా ఏ వేదికపై చూసినా భారతీయ సంప్రదాయం ఉట్టిపడేలా ఖరీదైన పట్టుచీరలు, రాజుల కాలం నాటి ఆభరణాలతో మెరిసిపోయే ఆ అగ్రశ్రేణి మహిళ.. ఈసారి రూట్ మార్చారు.

Nita Ambani: చీరలో మెరిసే అంబానీ కోడలు ఈసారి వెస్టర్న్‌ వేర్‌‌లో అదరగొట్టారు! .. బ్లేజర్ ధర తెలిస్తే కళ్లు తిరగాల్సిందే
Neeta Ambani With Ioc Person
Nikhil
|

Updated on: Feb 12, 2026 | 9:42 AM

Share

సంప్రదాయానికి స్వల్ప విరామం ఇచ్చి, పూర్తి స్థాయి కార్పొరేట్ లుక్ లో ప్రత్యక్షమై అందరినీ ఆశ్చర్యపరిచారు. అంతర్జాతీయ వేదికపై ఒక పవర్ ఫుల్ బాస్ లా కనిపిస్తూనే, తన ఫ్యాషన్ సెన్స్ తో మరోసారి ప్రపంచం దృష్టిని ఆకర్షించారు. ఆమె ధరించిన ఆ ఒక్క బ్లేజర్ ధర వింటే సామాన్యులకు కళ్లు తిరగడం ఖాయం. ఒక మధ్యతరగతి కుటుంబం కొనుగోలు చేసే విలాసవంతమైన కారు ధరతో సమానమైన ఆ కోటు ప్రత్యేకతలేంటి?

ఫ్యాషన్ స్టేట్‌మెంట్..

రిలయన్స్ ఫౌండేషన్ చైర్‌పర్సన్ నీతా అంబానీ లగ్జరీ దుస్తులకు, ఖరీదైన ఆభరణాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తారు. ఆమె ధరించే ప్రతి చీర ఒక అద్భుతంలా ఉంటుంది. భారతీయ వారసత్వాన్ని చాటిచెప్పే చేనేత కళాఖండాలను ధరించడం ఆమెకు ఇష్టం. అయితే ఈసారి ఆమె వెస్ట్రన్ వేర్‌లో అదుర్స్ అనిపించారు. అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (IOC)లో భారత ప్రతినిధిగా మిలానో-కోర్టినా వింటర్ ఒలింపిక్ గేమ్స్ 2026కి ముందు జరిగిన 145వ ఐఓసీ సెషన్‌కు ఆమె హాజరయ్యారు. ఎప్పుడూ చీరల్లో కనిపించే నీతా, ఈసారి ఒక పవర్ బ్లేజర్, చిక్ కోట్‌తో ఎంట్రీ ఇచ్చి అందరినీ మంత్రముగ్ధులను చేశారు.

నీతా అంబానీ ఈ సమావేశం కోసం ‘చానెల్ స్ప్రింగ్ సమ్మర్ 2026’ ప్రీ కలెక్షన్ నుంచి ఒక స్టైలిష్ నేవీ బ్లూ బ్లేజర్‌ను ఎంచుకున్నారు. ఈ బ్లేజర్‌కు డబుల్ కాలర్లు, ఫుల్ స్లీవ్స్, నాచ్ లాపెల్స్ తో పాటు రెండు సైడ్ పాకెట్స్ ఉన్నాయి. అధునాతన నేవీ బ్లూ రంగులో ఉన్న ఈ బ్లేజర్‌పై కుడివైపు కాలర్‌పై ఎరుపు పూల డైమండ్ బ్రూచ్ ఆ దుస్తులకు మరింత నిండుదనాన్ని ఇచ్చింది. ఇక ఈ బ్లేజర్ ధర వింటే ఎవరైనా నోరెళ్లబెట్టాల్సిందే. దీని ధర అక్షరాలా రూ. 7,38,800/-. కేవలం ఒక బ్లేజర్ కోసమే అంత మొత్తం వెచ్చించడం నీతా అంబానీ లగ్జరీ లైఫ్ స్టైల్ కు అద్దం పడుతోంది.

స్టైలిష్ అండ్ సింపుల్ లుక్..

ఈ ఖరీదైన బ్లేజర్‌కు జతగా నీతా నల్లటి ఫార్మల్ ప్యాంటును ధరించారు. ఆభరణాల విషయంలో ఈసారి చాలా సింపుల్ గా ఉండాలని నిర్ణయించుకున్న ఆమె, కేవలం డైమండ్ ఆకారపు చెవిపోగులు మాత్రమే ధరించి స్టైలిష్ గా కనిపించారు. మేకప్ కూడా సహజంగా ఉండటంతో ఆమె లుక్ ఎంతో హుందాగా, పవర్ ఫుల్ గా కనిపించింది. అంతర్జాతీయ వేదికపై ఒక వైపు భారత ప్రతినిధిగా బాధ్యతలు నిర్వర్తిస్తూనే, మరోవైపు గ్లోబల్ ఫ్యాషన్ ఐకాన్ గా తన ప్రత్యేకతను చాటుకున్నారు.

నీతా అంబానీ ఎప్పుడూ తన దుస్తుల ద్వారా ఒక సందేశాన్ని ఇస్తుంటారు. ఒకవైపు మన పూర్వ వైభవాన్ని గుర్తు చేసేలా పురాతన డిజైన్ల చీరలు ధరిస్తూనే, అవసరమైనప్పుడు ఇలాంటి వెస్ట్రన్ ఔట్‌ఫిట్స్‌తో ఆధునికతను ఆహ్వానిస్తుంటారు. ఆమె ధరించే ప్రతి వస్తువు వెనుక ఒక కథ, ఊహకందని డిజైన్ ఉంటుంది. ఈ చానెల్ బ్లేజర్ కూడా ఇప్పుడు ఇంటర్నెట్ లో సెన్సేషన్ గా మారింది. నీతా అంబానీ ధరించిన ఈ 7.4 లక్షల బ్లేజర్ ఫ్యాషన్ ప్రియులను ఆశ్చర్యపరుస్తోంది. ఒక వైపు తన హోదాకు తగ్గట్టుగా ఖరీదైన దుస్తులు ధరిస్తూనే, మరోవైపు అంతర్జాతీయ క్రీడా వేదికలపై భారతదేశానికి ప్రాతినిధ్యం వహించడం విశేషం.