వీటి ముందు మందులు కూడా పనికిరావు.. జస్ట్ రెండు రెబ్బలు రోగాలకే దడపుట్టిస్తాయ్..
ప్రతిరోజూ రెండు వెల్లుల్లి రెబ్బలు తినడం వల్ల అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. వెల్లుల్లిని సహజ యాంటీబయాటిక్‌గా పోలుస్తారు. ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది.. రక్తపోటును నియంత్రిస్తుంది.. ఒత్తిడిని తగ్గిస్తుంది.. శ్వాసకోశ సమస్యలకు ఉపశమనం అందిస్తుంది.. ఇంకా రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది.

వెల్లుల్లిలో (Garlic) పోషకాలతోపాటు.. ఎన్నో ఔషధ గుణాలు దాగున్నాయి.. అందుకే.. ఆరోగ్యానికి అత్యంత మేలు చేసే సహజ సిద్ధమైన ఔషధమని ఆయుర్వేద నిపుణులు చెబుతారు.. వెల్లులిలో ఉండే అల్లిసిన్, సల్ఫర్, జింక్, పొటాషియం వంటి ముఖ్యమైన పోషకాలు, ఖనిజాలు దాగున్నాయి.. అందుకే.. వెల్లుల్లిని తరచుగా సహజ యాంటీబయాటిక్‌గా పోలుస్తారు. అందుకే.. ఉదయాన్నే రెండు వెల్లుల్లి రెబ్బలను తినాలని సూచిస్తారు. దీనివల్ల ఆరోగ్యం మరింత మెరుగుపడుతుంది.
వెల్లుల్లి తినడం వల్ల కలిగే ప్రయోజనాలు..
వెల్లుల్లిని ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల శరీరంలో వ్యాధి నిరోధక శక్తి గణనీయంగా మెరుగుపడుతుంది. వెల్లుల్లిలో అలిసిన్ అనే అమినో యాసిడ్, విటమిన్ సి, సెలీనియం వంటి ఔషధ గుణాలు పుష్కలంగా ఉంటాయి.. ఇవి రోగనిరోధక శక్తిని పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తాయి.
సాధారణ జలుబు, ఇతర శ్వాసకోశ సమస్యలకు వెల్లుల్లి ఒక ఔషధంలా పనిచేస్తుంది. ఆస్తమా, శ్వాస పీల్చుకోవడంలో ఇబ్బంది వంటి ఊపిరితిత్తుల రుగ్మతలను తగ్గించడంలో ఇది చక్కగా ఉపయోగపడుతుంది.
వెల్లుల్లి రక్తనాళాల పనితీరును మెరుగుపరిచి, అధిక రక్తపోటును నియంత్రణలో ఉంచుతుంది. అంతేకాకుండా గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి..
జలుబు, దగ్గు వంటి సాధారణ ఇన్ఫెక్షన్లను వెల్లుల్లి తగ్గిస్తుంది..
వెల్లుల్లి మధుమేహాన్ని నియంత్రించడంలో, రక్తాన్ని శుద్ధి చేయడంలో ఇది కీలకపాత్ర పోషిస్తుంది. మధుమేహగ్రస్తుల రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో ఇది సహాయకారిగా ఉంటుంది.
నోటి వ్యాధులకు కూడా వెల్లుల్లి సమర్థవంతంగా పనిచేస్తుంది.. దీనిలోని రసాయనాలు నోటి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.
వెల్లుల్లిని ఎలా తీసుకోవాలి..
ప్రతిరోజూ రెండు వెల్లుల్లి రెబ్బలు తినడం వల్ల ఒత్తిడి దూరమవుతుందని పరిశీలనలు సూచిస్తున్నాయి. అందుకే.. వెల్లుల్లిని క్రమం తప్పకుండా తీసుకోవడం ద్వారా సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందవచ్చు.
వెల్లుల్లిని తేనెతో లేదా.. నీటిలో మరిగించి తీసుకోవచ్చు.. టీలా తాగవచ్చు.. ఇంకా నేరుగా కూడా వెల్లుల్లి రెబ్బలను తీసుకోవచ్చు.. అయితే.. దీని వాసన.. రుచి ఘాటుగా ఉంటుంది.
మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
