AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తల్లి గర్భంలో శిశువులు రోజంతా నిద్రపోతారా? పొట్టలో వీళ్లు చేసే పనులు చూస్తే షాక్ అవుతారు

గర్భంలోని శిశువులు రోజంతా నిద్రపోతారనుకుంటే పొరపాటే. అల్ట్రాసౌండ్ స్కాన్ల ప్రకారం శిశువులు గర్భంలోనే ఆవలించడం, బొటనవేలు చీకడం, కదలడం, తల్లిదండ్రుల స్వరాలకు స్పందించడం వంటి ఎన్నో ఆసక్తికరమైన చర్యలు చేస్తుంటాయి. అంతేకాకుండా, పుట్టిన తర్వాత అవసరమయ్యే నైపుణ్యాలకు ముందస్తు సాధనగా ప్రాక్టీస్ చేస్తారట..

తల్లి గర్భంలో శిశువులు రోజంతా నిద్రపోతారా? పొట్టలో వీళ్లు చేసే పనులు చూస్తే షాక్ అవుతారు
Unborn Baby Activities In Womb
Srilakshmi C
|

Updated on: Jun 15, 2026 | 1:11 PM

Share

గర్భంలో ఉన్న శిశువులు రోజంతా నిద్రపోతూనే ఉంటారని చాలా మంది భావిస్తారు. కానీ ఆధునిక వైద్య సాంకేతికత అందించిన అధునాతన అల్ట్రాసౌండ్ స్కాన్లు ఆ అభిప్రాయాన్ని పూర్తిగా మార్చేశాయి. గర్భంలోని శిశువులు కేవలం విశ్రాంతి తీసుకోవడమే కాకుండా, ఎన్నో ఆసక్తికరమైన కదలికలు చేస్తూ తమ ఎదుగుదలకు అవసరమైన సాధన చేస్తుంటారని అధ్యయనాలు చెబుతున్నాయి. అల్ట్రాసౌండ్ చిత్రాల ద్వారా గర్భంలోని శిశువులు చేతులు, కాళ్లు కదపడం, ఆవలించడం, ఒళ్లు చాచుకోవడం వంటి చర్యలు చేస్తున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. అంతేకాదు, కొంతమంది శిశువులు బొటనవేలు చీకుతూ కనిపిస్తారు. ఇవి కేవలం సాధారణ కదలికలు కాకుండా, పుట్టిన తర్వాత అవసరమయ్యే నైపుణ్యాలకు ముందస్తు సాధనగా నిపుణులు చెబుతున్నారు. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే గర్భంలోని శిశువులు వివిధ రకాల ముఖ కవళికలను కూడా ప్రదర్శిస్తుంటాయి. నవ్వినట్లుగా, ఆశ్చర్యపోయినట్లుగా, ఇతర భావోద్వేగాలను వ్యక్తపరిచేలా కనిపించే ముఖ కదలికలు అల్ట్రాసౌండ్ స్కాన్లలో నమోదవుతున్నాయి.

తల్లిదండ్రుల స్వరాలకు స్పందించే శిశువు

గర్భంలోని శిశువు కేవలం తన కదలికలకే పరిమితం కాదు. బయటి ప్రపంచం నుంచి వచ్చే శబ్దాలను కూడా గుర్తించగలదని పరిశోధనలు సూచిస్తున్నాయి. ముఖ్యంగా తల్లి, తండ్రి స్వరాలు లేదా మృదువైన సంగీతం వినిపించినప్పుడు శిశువు కదలికల్లో మార్పులు కనిపిస్తాయని శాస్త్రవేత్తలు గుర్తించారు. కొన్ని సందర్భాల్లో ప్రేమగా మాట్లాడినప్పుడు లేదా సంగీతం వినిపించినప్పుడు శిశువు గర్భంలో కదలడం, తన్నడం వంటి ప్రతిస్పందనలు ఇస్తుంది. ఇది పుట్టుకకు ముందే తల్లి-బిడ్డల మధ్య భావోద్వేగ బంధం ఏర్పడుతుందనే విషయాన్ని సూచిస్తుందని నిపుణులు పేర్కొంటున్నారు.

ఇవి కూడా చదవండి

ఎదుగుదలకు సహాయపడే సహజ ప్రక్రియ

గర్భంలో శిశువు చేసే ప్రతి చిన్న కదలిక కూడా దాని శారీరక, మానసిక ఎదుగుదలకు దోహదపడుతుంది. కాళ్లతో తన్నడం, చేతులు కదపడం వంటి చర్యలు కండరాలు, ఎముకలు బలపడేందుకు సహాయపడతాయి. అలాగే బొటనవేలు చీకడం వంటి అలవాట్లు నాడీ వ్యవస్థ అభివృద్ధికి తోడ్పడతాయి. ఈ విధమైన సాధన వల్ల శిశువు జన్మించిన తర్వాత తల్లి పాలను తాగడం, శరీర కదలికలను నియంత్రించడం వంటి ప్రక్రియలకు మరింత సిద్ధంగా ఉంటుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఈ సమాచారం సోషల్ మీడియాలోని “World of Biology VOB” అనే ఖాతా ద్వారా ప్రచారంలోకి వచ్చిన వివరాలు మరియు ఇతర నివేదికల ఆధారంగా రూపొందించబడింది. ఇది వైద్య సలహాకు ప్రత్యామ్నాయం కాదు. గర్భధారణకు సంబంధించిన సందేహాల కోసం వైద్యులను సంప్రదించడం ఉత్తమం.

Follow Us