AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నేను జైల్లో ఉన్నప్పుడు నాకు సపోర్ట్ చేసింది ఆ ముగ్గురే హీరోయిన్లే.. అసలు విషయం చెప్పిన సుమన్

సినీ నటుడు సుమన్ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో తన కెరీర్ ప్రయాణంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తనపై వచ్చిన తప్పుడు ఆరోపణలను ఖండించిన ఆయన, ఆ సమయంలో చిరంజీవి పేరు ప్రచారంలోకి వచ్చిందని కానీ అది అవాస్తవం అని అన్నారు.. చిరంజీవిలి తనకు ఆరోగ్యకరమైన పోటీ తప్ప ఎలాంటి శత్రుత్వం లేదని స్పష్టం చేశారు.

నేను జైల్లో ఉన్నప్పుడు నాకు సపోర్ట్ చేసింది ఆ ముగ్గురే హీరోయిన్లే.. అసలు విషయం చెప్పిన సుమన్
Suman
Rajeev Rayala
|

Updated on: Jun 15, 2026 | 1:17 PM

Share

ప్రముఖ నటుడు సుమన్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తన కెరీర్, వ్యక్తిగత జీవితంలోని కీలక విషయాలను పంచుకున్నారు. సినీ పరిశ్రమలో తనను అణచివేయడానికి ప్రయత్నాలు జరిగాయని, తప్పుడు ఆరోపణలు ఎదుర్కొన్నారని అప్పట్లో విస్తృతంగా ప్రచారం జరిగింది, ఆ ప్రచారంలో చిరంజీవి పేరు ఎక్కువగా వినిపించింది. దీనిపై సుమన్ స్పందిస్తూ, అది పూర్తిగా తప్పు అని, ఎటువంటి సాక్ష్యం లేదని స్పష్టం చేశారు. తనకూ చిరంజీవికీ మధ్య కేవలం ఆరోగ్యకరమైన పోటీ మాత్రమే ఉండేదని, ఎవరు బాగా ఫైట్ చేస్తారు, ఎవరు బాగా డాన్స్ చేస్తారు వంటి అంశాలపైనే పోటీ ఉండేది కానీ, చీప్ స్థాయికి ఎప్పుడూ దిగజారలేదని సుమన్ అన్నారు. చిరంజీవి లాంటి వ్యక్తి అలాంటి చర్యలను ఏ మాత్రం ప్రోత్సహించరని ఆయన అన్నారు.

ఇది కూడా చదవండి : కుర్రాళ్ల ఆల్ టైం ఫేవరెట్ మూవీ.. పెట్టింది రూ.4కోట్లు వచ్చింది రూ. 110కోట్లు.. ఇండస్ట్రీని షేక్ చేసిన చిన్న సినిమా

తన జీవితంలో అత్యంత క్లిష్టమైన సమయంలో, జైలులో ఉన్నప్పుడు, సినీ పరిశ్రమ నుండి కేవలం ముగ్గురు మాత్రమే బహిరంగంగా మద్దతు ప్రకటించారని సుమన్ వెల్లడించారు. వారు సుహాసిని, సుమలత, భానుప్రియ అని పేర్కొన్నారు. సుహాసిని అప్పట్లో ఓ మ్యాగజైన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సుమన్‌ను సమర్థిస్తూ, అతను అలాంటివాడు కాదని, అద్భుతమైన వ్యక్తి అని చెప్పిన విషయాన్ని సుమన్ గుర్తుచేసుకున్నారు. సుమలత, భానుప్రియలు కూడా అదే విధంగా ధైర్యంగా, బోల్డ్‌గా తనకు మద్దతు పలికారని తెలిపారు. వారి మద్దతు తన కేసు విచారణలో ఎంతో సహాయపడిందని, సాక్ష్యపరంగా ఉపయోగపడిందని, వారు తన మంచి స్నేహితులు కావడం వల్లే ఇది సాధ్యమైందని సుమన్ వివరించారు.

ఇది కూడా చదవండి : ఇంటర్వెల్ సీన్ మార్చేశారు.. కట్ చేస్తే ఇండస్ట్రీ రికార్డులను బద్దలు కొట్టేసింది

అలాగే సౌత్‌లో నటులలో అత్యుత్తమ డాన్సర్ చిరంజీవి అని సుమన్ అన్నారు. నేల చూడకుండా నృత్యం చేసే ఏకైక హీరో చిరంజీవి అని, కమల్ హాసన్ కూడా నేల చూస్తారని పేర్కొన్నారు. సంగీతం శరీరంలోకి ప్రవేశించి, ఆ ఫ్లో, మూమెంట్ రావడం ఒక గొప్ప బహుమతి అని, అది అందరికీ రాదని చిరంజీవి డాన్స్ నైపుణ్యాన్ని ప్రశంసించారు. డాన్స్ అంటే కేవలం బాడీ మూమెంట్స్ కాదని, రిథమ్, గ్రేస్ ఉండాలని, ఆధునిక డాన్స్ జిమ్నాస్టిక్స్ ఎక్కువగా ఉంటున్నాయని, దానిని తాను డాన్స్ అని పిలవనని సుమన్ అన్నారు. యాక్షన్ సన్నివేశాల విషయానికి వస్తే, చిరంజీవికి, తనకూ మధ్య గట్టి పోటీ ఉండేదని, ఫైట్ మాస్టర్లు కామన్ కాబట్టి, ఇద్దరి మధ్య టఫ్ ఫైట్ ఉండేదని సుమన్ వివరించారు. తాను బేసిగ్గా ఫైటర్ కాబట్టి, మార్షల్ ఆర్ట్స్ కిక్స్ ఒరిజినల్‌గా చేసేవాడినని, ఇది తనకు అడ్వాంటేజ్‌గా ఉండేదని తెలిపారు.

ఇది కూడా చదవండి : ఆ డాన్స్ ఏంటి అమ్మడు..! హ్యాపీ రీ రిలీజ్‌లో రచ్చ చేసిన హీరోయిన్.. థియేటర్ దద్దరిల్లిందిగా

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us