AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కరోనా బ్యాడ్ టైమ్‌లో మానసిక ఒత్తిడితో బాధపడుతున్నారా? ఈ టిప్స్ ఫాలో అయితే ఆ సమస్య ఫసక్..

Sleeping Benefits: కొవిడ్ పాండమిక్ కారణంగా చాలా మంది ఎదుర్కొంటున్న సమస్య మానసిక ఒత్తిడి. స్మార్ట్ ఫోన్లు, సోషల్ మీడియా ప్రభావంతో ఇప్పటికే చాలా మంది మానసిక ఆరోగ్యం దెబ్బతినగా...ఇప్పుడు కొవిడ్ పాండమిక్ వారిపై మరింత ప్రభావం చూపుతోంది.

కరోనా బ్యాడ్ టైమ్‌లో మానసిక ఒత్తిడితో బాధపడుతున్నారా? ఈ టిప్స్ ఫాలో అయితే ఆ సమస్య ఫసక్..
Brain Fog
Janardhan Veluru
| Edited By: Anil kumar poka|

Updated on: Jun 08, 2021 | 10:51 PM

Share

కొవిడ్ పాండమిక్ కారణంగా చాలా మంది ఎదుర్కొంటున్న సమస్య మానసిక ఒత్తిడి. స్మార్ట్ ఫోన్లు, సోషల్ మీడియా ప్రభావంతో ఇప్పటికే చాలా మంది మానసిక ఆరోగ్యం దెబ్బతినగా…ఇప్పుడు కొవిడ్ పాండమిక్ వారి మానసిక ఆరోగ్యంపై మరింత ప్రభావం చూపుతోంది. కరోనా వైరస్ భయాలతో ఇంటి గడప దాటలేని పరిస్థితి.. స్నేహితులు, సన్నిహితులను కలవలేని దుస్థితి.. మరో వైపు ఆర్థిక నష్టాలు, భవిష్యత్తుపై బెంగ తదితరాలు చాలా మంది మానసిక పరిస్థితిపై ప్రభావం చూపుతోంది. చాలా మంది జీవన శైలిపై పాండమిక్ ప్రభావం చూపుతోంది. అర్ధరాత్రి దాటే వరకు ఓటీటీలలో సినిమాలు చూడటం, స్మార్ట్ ఫోన్లలో గేమ్స్‌ ఆడుతూ గడిపేస్తున్నారు. రాత్రి ఒకటి, రెండింటికి నిద్రపోయి…బాగా పొద్దెక్కాక నిద్ర నుంచి మేల్కొని వెంటనే వర్క్ ఫ్రం హోంలో ఆఫీస్ పని మొదలుపెట్టేస్తున్నారు. ఆ తర్వాత తీరిక లేకుండా ల్యాప్‌టాప్‌‌లకు అతుక్కుపోతున్నారు.

పాండమిక్ పరిస్థితుల నేపథ్యంలో గతి తప్పుతున్న ఈ జీవన శైలి మెదడుపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. దీంతో ఒక అంశంపై ఏకాగ్రత చేయలేకపోవడం, స్పష్టంగా ఆలోచించలేకపోవడం, పర ధ్యానంలోకి వెళ్లిపోవడం వంటి సమస్యలను ఎదుర్కొంటున్నారు. కొందరు బాగా తెలిసిన వ్యక్తుల పేర్లు కొన్ని నిమిషాల పాటు మర్చిపోవడం వంటి సమస్యలతో సతమతమవుతున్నారు. ఈ సమస్యను బ్రెయిన్ ఫోగ్(మెదడు మంచుపొగ)గా మానసిక వైద్య నిపుణులు పరిగణిస్తారు.

Sleeping Benefits

Sleeping Benefits

బ్రెయిన్ ఫోగ్ సమస్యను ఎదుర్కొంటున్న వ్యక్తులు..దీన్ని అధిగమించేందుకు అంతర్జాతీయ ప్రసిద్ధ న్యూరో సైంటిస్ట్ డాక్టర్ సబినా బ్రెన్నన్ Beating Brain Fog అనే పుస్తకంలో కొన్ని కీలక సూచనలు చేశారు. ఈ సమస్యను అధిగమించేందుకు అన్నిటికంటే మించి ఆమె చేసిన కీలక సూచన ఒక్కటే.. రాత్రి త్వరగా నిద్రపోవడం, చాలినంత నిద్రపోవడం. జీవన శైలిలో మార్పుల కారణంగా కోల్పోయిన నిద్రను…తిరిగి పొందితే ఈ మానసిక సమస్యకు పరిష్కారం లభిస్తుందని సబినా బ్రెన్నన్ పేర్కొన్నారు. రాత్రిపూట వాహనాలు లేక రోడ్డు ఎంత క్లీన్‌గా కనిపిస్తుందో…అలాగే నిద్ర కూడా మానసిక సమస్యలను అధిగమించేందుకు తోడ్పడుతుందని సూచించారు.

మెదడులో పేరుకుపోయిన టాక్సిన్లను తొలగించేందుకు నిద్ర ఒక్కటే సరైన పరిష్కారమన్నారు. బ్రెయిన్ ఫోగ్‌‌ సమస్య పరిష్కారానికి ఒకే సమయంలో రోజూ నిద్రకు ఉపక్రమించడం చాలా ముఖ్యమన్నారు. మెదడు సమర్థవంతంగా పనిచేసేందుకు ఈ సూచనలు పాటించాలని ఆమె సూచించారు. న్యూరో సైంటిస్టులు చెబుతున్న ఈ టిప్స్‌‌ను మనం ఫాలో అయిపోతే మానసిక సమస్యలు ఫసక్ కావడం ఖాయం.

ఇవి కూడా చదవండి..

పిల్లలు జాగ్రత్త..! థర్డ్‌ వేవ్‌పై అప్పుడే మొదలైన దడ.. మూడో దశ ముప్పు నేపథ్యంలో చిల్డ్రన్‌ కేరింగ్‌పై ఆందోళన..!

క్యాబేజి తినడం వలన కలిగే ఆరోగ్యప్రయోజనాలు తెలిస్తే కష్టమైనా ఇష్టంగా తినడం అలవాటు చేసుకుంటాం..!