Health: పిల్లల్లో పెరుగుతోన్న మయోపియా సమస్య.. ఇంతకీ ఏంటిది.?
కంటి సంబంధిత సమస్యలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా చిన్న పిల్లల్లో ఈ సమస్య ఎక్కువవుతోంది. స్క్రీన్ టైమ్ పెరిగిన కారణంగా చాలా మంది చిన్నారుల్లో మయోపియా అనే సమస్య ఉత్పన్నమవుతున్నట్లు నిపుణులు చెబుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఈ సమస్య బారిన పడుతోన్న వారి సంఖ్య ఏకంగా 35 శాతానికి చేరిందని గణాంకాలు చెబుతున్నాయి..
పోషకాహార లోపం, స్క్రీన్ టైం పెరగడం కారణం ఏదైనా ఇటీవల కంటి సంబంధిత సమస్యలు పెరుగుతున్నాయి. ముఖ్యంగా చిన్నారుల్లో ఈ సమస్య తీవ్రమవుతోంది. ప్రస్తుతం ప్రపచంలో సుమారు 35 శాతం మంది మయోపియా సమస్యతో బాధపడుతున్నారు. మయోపియా అంటే కంటి చూపు శక్తి తగ్గడమే. దీనివల్ల దృష్టిలోపం ఏర్పడుతుంది. ఈ వ్యాధి బారిన పడిన వారిలో నలుపు లేదా ఆకుపచ్చ బోర్డులు కనిపించవు.
2050 నాటికి ప్రపంచవ్యాప్తంగా ఏకంగా 40 శాతం మంది ఈ సమస్య బారిన పడే అవకాశం ఉన్నట్లు గణంకాలు చెబుతున్నారు. అంటే ప్రతీ ముగ్గురిలో ఒకరి ఈ సమస్య బారిన పడనున్నారన్నమాట. ఈ సమస్యను సకాలంలో నియత్రించకపోతే తీవ్రమైన సమస్యకు దారి తీస్తుందని నిపుణులు చెబుతున్నారు. మయోపియా రావడానికి ఎన్నో రకాల కారణాలు వీటిలో ప్రధానమైనవి.. తల్లిదండ్రుల్లో ఒకరికి మయోపియా ఉంటే, అది పిల్లలలో సంభవించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
అలాగే గంటలతరబడి కంప్యూటర్, స్మార్ట్ ఫోన్‌లు ఉపయోగించే వారిలో కూడా ఈ సమస్య ఉంటుంది. అలాగే చెడు జీవనశైలి, ఆహారపు అలవాట్లు, డయాబెటిస్ వంటి సమస్యలు కూడా ఈ వ్యాధికి దారి తీసే అవకాశాలు ఉంటాయి. ఈ సమస్య వచ్చిన వారిలో కంటిలోని రెటీనా పక్కకు జరుగుతుంది. కంటిలోని ఆప్టిక్ నరాల దెబ్బతినడం వల్ల రెటీనా సన్నబడుతుంది. ఇక లక్షణాల విషయానికొస్తే.. దూరంగా ఉన్న వస్తువులు కనిపించకపోవడం, తలనొప్పి, కంటి ఒత్తిడి లేదా అలసట, కళ్లు మంటగా ఉండడం వంటివి కనిపిస్తాయి.
ఈ సమస్య బారిన పడకుండా ఉండాలన్నా.. త్వరగా కోలుకోవాలన్నా ఫోన్, ల్యాప్‌టాప్‌ను వీలైనంత వరకు తగ్గించాలి. కంప్యూటర్ స్క్రీన్ నుంచి కనీసం 12 అంగుళాల దూరంలో ఉండాలి. క్రమం తప్పకుండా కంటి రెప్పలను ఆడిస్తూ ఉండాలి. అదే పనిగా స్క్రీన్ వైపు చూడకుండా కాసేపు దూరంగా ఉన్న వస్తువులను గమనిస్తూ ఉండాలి. తీసుకునే ఆహారంలో కూడా మార్పులు చేసుకోవాలి. ముఖ్యంగా పండ్లు, కూరగాయలు మరియు ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి. ఆహారంలో విటమిన్ ఎ మరియు విటమిన్ సి ఉన్న పండ్లు, కూరగాయలను భాగం చేసుకోవాలి.
నోట్: పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..