AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Moringa Benefits: జుట్టు రాలడం ఆగాలంటే ఈ నీళ్లు తాగాల్సిందే..! ఇది మంచి టానిక్‌ లా పని చేస్తుంది..!

ప్రతి ఒక్కరికి ఆరోగ్యంగా మెరిసే జుట్టు కావాలని ఉంటుంది. ఈ రోజుల్లో జుట్టు రాలడం, పెరగకపోవడం, బలహీనత వంటి సమస్యలు చాలా మందిలో కనిపిస్తున్నాయి. ఇలాంటి సమయంలో సహజమైన మునగ ఆకుల నీరు బాగా ఉపయోగపడుతుంది. దీన్ని తాగడం వల్ల జుట్టు బలంగా మారుతుంది.

Moringa Benefits: జుట్టు రాలడం ఆగాలంటే ఈ నీళ్లు తాగాల్సిందే..! ఇది మంచి టానిక్‌ లా పని చేస్తుంది..!
Drumstick Leaves
Prashanthi V
|

Updated on: May 19, 2025 | 2:57 PM

Share

మునగ ఆకులు విటమిన్ A, C, E, B లను అందిస్తాయి. ఇందులో ఐరన్, జింక్, అమైనో ఆమ్లాలు కూడా ఉంటాయి. ఇవి అన్ని కలిసి జుట్టు మూలాలను బలంగా మార్చడంలో సహాయపడతాయి. ఆకులలో ఉండే పోషకాలు జుట్టు ఎదుగుదలకు అవసరమైన సహజ మార్గం అందిస్తాయి. మునగ గింజలు కూడా శక్తివంతంగా పనిచేస్తాయి.

మునగ ఆకుల నీటిని తాగడం వల్ల శరీరానికి శక్తి వస్తుంది. జీర్ణక్రియ మెరుగవుతుంది. తల చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. జుట్టు బలంగా, మెత్తగా, ప్రకాశవంతంగా మారుతుంది. తలలో కొత్త జుట్టు మొదలవుతుంది. ఇది సాధారణంగా రసాయనాలు వాడకుండా చక్కగా పెరిగే సహజ మార్గం.

గుప్పెడు తాజా మునగ ఆకులను తీసుకొని శుభ్రంగా కడగాలి. వీటిలో ఉండే మురికి తొలగించాలి. తరువాత రెండు కప్పుల నీటిని మరిగించాలి. నీరు మరిగిన తర్వాత అందులో ఆకులను వేసి 10 నిమిషాలు ఇంకా మరిగించాలి. తరువాత వడకట్టి నీరు చల్లార్చి తాగాలి. దీనిని ఖాళీ కడుపుతో తీసుకుంటే బాగా పని చేస్తుంది.

మునగకాయలను చిన్న ముక్కలుగా రెండు కట్ చేసుకోవాలి. ఇప్పుడు రెండు కప్పుల నీటిని మరిగించి అందులో ఈ ముక్కలు వేసి 10 నిమిషాలు మరిగించాలి. తరువాత వడకట్టి చల్లబర్చాలి తాగాలి.

ఉదయం ఖాళీ కడుపుతో తాగాలి. ఒక కప్పుతో మొదలుపెట్టి, క్రమంగా రెండు కప్పుల వరకు తీసుకోవచ్చు. రుచి సరిగా అనిపించకపోతే తేనె లేదా నిమ్మరసం కొద్దిగా వేసుకోవచ్చు. దీన్ని వారంలో మూడుసార్లు తాగినా సరిపోతుంది. క్రమంగా రెండు నెలలు తాగితే మంచి ఫలితాలు కనిపిస్తాయి.

మునగ నీటిని తాగడమే కాకుండా.. తల కడుక్కోవడానికి కూడా వాడొచ్చు. తలపై ఈ నీటిని పోస్తే తల చర్మం చల్లగా ఉంటుంది. దీంతో తలలో రక్త ప్రసరణ మెరుగవుతుంది. జుట్టు బలంగా మారుతుంది. మునగ నీటిలో విటమిన్ C ఎక్కువగా ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది. శరీరంలో ఉన్న విషాలను బయటకు పంపుతుంది. చర్మానికి మెరుపు తీసుకువస్తుంది. జుట్టు ఎదుగుదల క్రమంగా మెరుగవుతుంది.

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)

ప్రభాస్ లేకపోతే చనిపోయేవాడిని.. చత్రపతి శేఖర్ ఎమోషనల్..
ప్రభాస్ లేకపోతే చనిపోయేవాడిని.. చత్రపతి శేఖర్ ఎమోషనల్..
ధర ఎక్కువైనా ఈ పండును కచ్చితంగా తినండి.. ఎందుకో తెలిస్తే..
ధర ఎక్కువైనా ఈ పండును కచ్చితంగా తినండి.. ఎందుకో తెలిస్తే..
సిమ్ కార్డులతో భారీ సైబర్ క్రైమ్.. చెక్‌ పెట్టిన ఏపీ సీఐడి!
సిమ్ కార్డులతో భారీ సైబర్ క్రైమ్.. చెక్‌ పెట్టిన ఏపీ సీఐడి!
విజయ్ హజారే ట్రోఫీకి విరాట్, రోహిత్ శాలరీ ఎంత?
విజయ్ హజారే ట్రోఫీకి విరాట్, రోహిత్ శాలరీ ఎంత?
ఇదో పవర్‌ ఫుల్‌ డిటాక్స్‌ డ్రింక్..!షాకింగ్‌ బెనిఫిట్స్‌ తెలిస్తే
ఇదో పవర్‌ ఫుల్‌ డిటాక్స్‌ డ్రింక్..!షాకింగ్‌ బెనిఫిట్స్‌ తెలిస్తే
థియేటర్లలో సంచలనం.. ఇప్పుడు ఓటీటీలోకి చిన్న సినిమా..
థియేటర్లలో సంచలనం.. ఇప్పుడు ఓటీటీలోకి చిన్న సినిమా..
ఛీ.. ఛీ.. చేతులెలా వచ్చాయ్‌ రా.. మనవరాలి వయసని కూడా చూడకుండా..
ఛీ.. ఛీ.. చేతులెలా వచ్చాయ్‌ రా.. మనవరాలి వయసని కూడా చూడకుండా..
దీప్తి శర్మ రికార్డుల వేట..రేణుకా సింగ్ వికెట్ల కోత
దీప్తి శర్మ రికార్డుల వేట..రేణుకా సింగ్ వికెట్ల కోత
దేశంలో అత్యంత సంపన్నుడైన చెఫ్‌ ఇతనే నట..ఆయన ఆస్తుల విలువ తెలిస్తే
దేశంలో అత్యంత సంపన్నుడైన చెఫ్‌ ఇతనే నట..ఆయన ఆస్తుల విలువ తెలిస్తే
వందేభారత్ ప్రయాణీకులకు తీపికబురు.. ఇకపై ఆ స్టేషన్‌లోనూ..
వందేభారత్ ప్రయాణీకులకు తీపికబురు.. ఇకపై ఆ స్టేషన్‌లోనూ..