AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hindu Belief: ఈ సమయంలో గోళ్లు కత్తిరిస్తున్నారా..? అయితే ఇది మీకోసమే..!

మన ఇంట్లో పెద్దవాళ్లు తరచూ చెప్పే మాట.. రాత్రిపూట గోళ్లు కత్తిరించవద్దని.. ఇది ఒక సాధారణ సూచనలా అనిపించినా.. దీని వెనుక ఉన్న కారణాలు శాస్త్రం, ఆరోగ్యం, సంప్రదాయ విశ్వాసాలతో చాలా అనుబంధం కలిగి ఉంటాయి. ఈ అలవాటు ఎందుకు వచ్చిందో అర్థం చేసుకోవాలి.

Hindu Belief: ఈ సమయంలో గోళ్లు కత్తిరిస్తున్నారా..? అయితే ఇది మీకోసమే..!
Nail Cutting
Prashanthi V
|

Updated on: May 19, 2025 | 3:02 PM

Share

పురాతన నమ్మకాల ప్రకారం రాత్రిపూట కొన్ని చెడు శక్తులు ఎక్కువగా తిరుగుతాయట. ఆ సమయంలో గోళ్లు కత్తిరిస్తే ఆ శక్తులు మనకు కష్టాలు కలిగిస్తాయని అనుకునేవారు. కొందరు రాత్రిపూట చంద్రుడి శక్తి చాలా ఎక్కువగా ఉంటుందని నమ్ముతారు. గోళ్లు తీసేస్తే ఆ శక్తి తగ్గిపోతుందని కూడా భావించేవారు. శాస్త్రంలో కూడా రాత్రిపూట గోళ్లు కత్తిరించడం వల్ల శరీరం సమతుల్యత దెబ్బతింటుందని చెబుతారు.

విద్యుత్ అందుబాటులో లేని రోజులలో రాత్రిపూట వెలుతురు చాలా తక్కువగా ఉండేది. అప్పుడు దీపాల వెలుతురులో గోళ్లు కత్తిరించడం ప్రమాదకరం. ఒక్కసారి తప్పుగా కత్తిరిస్తే వేళ్లకు గాయం అయ్యే అవకాశం ఉండేది. అందుకే రాత్రిపూట గోళ్లు కత్తిరించకూడదని చెప్పారు. ఇది పూర్తిగా భద్రతతో సంబంధం ఉన్న విషయం.

సాయంత్రం అయ్యాక మన శరీరం నిద్రపోవడానికి తయారవుతుంది. రోజంతా పని చేసి అలిసిపోయిన శరీరం అప్పుడు రెస్ట్ తీసుకోవాలనుకుంటుంది. అలాంటి టైమ్‌లో పదునైన వస్తువులు పట్టుకోవడం, జాగ్రత్తగా చేయాల్సిన పనులు చేయడం మంచిది కాదు. గోళ్లు కత్తిరించడం అంటే చాలా శ్రద్ధగా చేయాల్సిన పని. అలసటగా ఉన్నప్పుడు సరిగ్గా చేయకపోతే ప్రమాదం జరిగే ఛాన్స్ ఉంది.

గోళ్లు కత్తిరించినప్పుడు చిన్న చిన్న ముక్కలు కింద పడతాయి. వాటికి బ్యాక్టీరియా లేదా దుమ్ము అంటుకుని ఉండొచ్చు. పగటిపూట లైట్‌ లో అవి బాగా కనిపిస్తాయి కాబట్టి వాటిని తీసి పారేయొచ్చు. కానీ రాత్రిపూట మంచం మీద కూర్చొని గోళ్లు కత్తిరిస్తే అవి అక్కడే పడిపోతాయి. పొరపాటున అవి మనం తినే ఆహారంలో కలిసిపోయే ఛాన్స్ ఉంది. అలా జరిగితే ఆరోగ్యం పాడవుతుంది. అంతేకాదు ఆ గోళ్ల ముక్కలకు చీమలు, చిన్న పురుగులు కూడా వస్తాయి.

రాత్రిపూట గోళ్లు కత్తిరించకూడదనే సలహా కేవలం మూఢనమ్మకం కాదు. దీనివెనుక భద్రత, పరిశుభ్రత, ఆరోగ్యం, శారీరక స్థితి అన్నీ మిళితమై ఉన్నాయి. పగటిపూట వెలుతురులో గోళ్లు కత్తిరించడం వల్ల గాయాల ప్రమాదం తగ్గుతుంది. అదనంగా పరిశుభ్రంగా ఉండే అవకాశం కూడా ఎక్కువ. నేలపై కాగితం లేదా బట్టను పరచి ఆపై కత్తిరిస్తే గోళ్లు ఒక్కచోటే చేరుతాయి. మన పెద్దల సూచనను నిర్లక్ష్యం చేయకుండా వెలుతురు ఉన్న సమయంలో గోళ్లు కత్తిరించటం మంచి అలవాటు.