Mosquito Repellent: టైల్స్ ని తుడిచే నీటిలో ఇవి కలిపితే చాలు.. ఒక్క దోమ కూడా ఇంట్లోకి రాదు..!
వర్షాకాలం వచ్చే సరికి దోమల సమస్య మరింత ఎక్కువ అవుతుంది. మలేరియా, డెంగ్యూ, చికున్ గున్యా వంటి వ్యాధు లను వ్యాప్తి చేసే దోమల ను నియంత్రించడానికి చాలా మంది కాయిల్స్, స్ప్రేలు వాడతారు. కానీ వాటి రసాయనాలు ఆరోగ్యానికి హానికరం.

వర్షాకాలం మొదలవగానే దోమల సమస్య ఎక్కువవుతుంది. దోమల వల్ల దురద మాత్రమే కాకుండా.. మలేరియా, డెంగ్యూ, చికున్‌గున్యా లాంటి తీవ్రమైన జబ్బులు కూడా వస్తాయి. దోమలను తరిమేందుకు చాలా మంది కాయిల్స్, స్ప్రేలు వాడతారు. కానీ వాటిలోని రసాయనాలు ఆరోగ్యానికి హాని చేస్తాయి. అందుకే వాటిపై ఆధారపడకుండా.. సహజమైన పద్ధతులు ఉపయోగించడం మంచిది. ముఖ్యంగా ఇంటిని తుడిచే నీటిలో కొన్ని పదార్థాలు కలిపితే దోమల సమస్య తగ్గిపోతుంది. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
దాల్చిన చెక్క
మన వంటింట్లో ఉండే దాల్చిన చెక్క వాసన దోమలకు నచ్చదు. 2 నుంచి 3 ముక్కల దాల్చిన చెక్కను నీటిలో మరిగించి ఆ నీటిని ఇంటిని తుడిచే నీటిలో కలపండి. దీని వాసన దోమలు, చీమలు వంటి చిన్న కీటకాలను దూరం చేస్తుంది.
వెనిగర్
తక్కువ ఖర్చులో దొరికే వెనిగర్ కూడా బాగా పనిచేస్తుంది. ఒక బకెట్ నీటిలో ఒక కప్పు వెనిగర్ వేసి ఇంటిని తుడిచేస్తే దోమలు దరిచేరవు. అలాగే నేల కూడా మెరుస్తూ శుభ్రంగా కనిపిస్తుంది.
సువాసన నూనెలు
లావెండర్ లేదా పిప్పరమెంట్ వంటి నూనెల వాసన కూడా దోమలకు నచ్చదు. ఒక బకెట్ నీటిలో 8 నుంచి 10 చుక్కలు వేసి ఇంటిని తుడి చేస్తే దోమలు లోపలికి రావు. అలాగే ఇల్లు మంచి వాసనతో ఉంటుంది.
ఈ సహజ పద్ధతులు తక్కువ ఖర్చుతో ఉంటాయి. ఆరోగ్యానికి ఎలాంటి హాని కలిగించవు. పిల్లలు, పెద్దలు, పెంపుడు జంతువులకు కూడా ఇవి సురక్షితమైనవి. ఈ వర్షాకాలంలో దోమల సమస్య తగ్గించుకోవడానికి ఈ చిట్కాలు చాలా ఉపయోగపడతాయి.




