Mental Health: పరీక్షల సమయంలో మీ పిల్లలు టెన్షన్‌కు గురవుతున్నారా? ఆ ఒత్తిడిని ఇలా తగ్గించండి..
మరికొద్ది రోజుల్లో పిల్లలకు బోర్డ్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈ సమయంలో.. పిల్లలు మంచి మార్కులు పొందేందుకు చాలా కష్టపడి చదువుతుంటారు. అయితే, కొంతమంది పిల్లలు చదువుకునే..
మరికొద్ది రోజుల్లో పిల్లలకు బోర్డ్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈ సమయంలో.. పిల్లలు మంచి మార్కులు పొందేందుకు చాలా కష్టపడి చదువుతుంటారు. అయితే, కొంతమంది పిల్లలు చదువుకునే సమయంలో ఆందోళన వంటి మానసిక సమస్యలను ఎదుర్కొంటుంటారు. కుటుంబ సభ్యులు, తల్లిదండ్రుల అంచనాలే ఈ ఆందోళనకు కారణం అవుతుంది. బాగా స్కోర్ చేయాలనే ఒత్తిడి పిల్లల మనసుల్లో ఉంటుంది. మంచి మార్కులు తెచ్చుకోవాలనే ఒత్తిడి వల్ల విద్యార్థుల్లో ఆందోళన, భయం మొదలవుతాయి. దాని కారణంగా వారు మరింత ఆందోళనకు గురవుతారు. కొన్ని సందర్భాల్లో విద్యార్థులు డిప్రెషన్‌ను కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది.
పరీక్షల సమయంలో విద్యార్థులు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నట్లు క్లియర్‌గా కనిపిస్తోంది. ఈ పరిస్థితి నుంచి బయటకు రావడానికి పిల్లలకు వైద్యుల సలహా తప్పనిసరి అవుతుంది. సమస్య మరింత ఆందోళనకరంగా మారితే.. మందులు కూడా వాడాల్సి ఉంటుంది. అటువంటి పరిస్థితిలో తల్లిదండ్రులు తమ పిల్లల మానసిక ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలని వైద్యులు సలహా ఇస్తున్నారు. ఇటీవల ఈ అంశంపై పరిశోధన కూడా జరిగింది. చదువు విషయంలో విద్యార్థులు చాలా ఒత్తిడికి గురవుతున్నట్లు ఇది ఈ పరిశోధనలు చెబుతున్నాయి.
ఈ సమస్యను ఎలా నివారించవచ్చు?
సీనియర్ సైకియాట్రిస్ట్ డాక్టర్ జ్యోతి కపూర్ ప్రకారం.. విద్యార్థి పరీక్షకు సంబంధించి ఆందోళనతో ఉన్నప్పుడు అతను తన అభిప్రాయాన్ని ఎవరితోనూ ఈజీగా షేర్ చేసుకోలేడు. పరీక్షల సమయంలో పగలు, రాత్రుళ్లు చదువుల్లోనే నిమగ్నమై ఉంటారు. తద్వారా మానసికంగా, శారీరకంగా చాలా అలసిపోతుంటారు. అయితే, శరీరంతో పాటు మనసుకు కూడా విశ్రాంతి అవసరం. ఈ విషయాన్ని ఎవరూ విస్మరించొద్దు. మంచి మార్కులు సాధించాలనే ఒత్తిడి పిల్లలపై ఒత్తిడి కొనసాగితే, వారు డిప్రెషన్‌కు లోనవుతారు. ఇలాంటి పరిస్థితుల్లో పరీక్ష సమయంలో వాతావరణాన్ని తేలికగా ఉంచుకోవడానికి చదువుపై దృష్టి సారించడంతోపాటు ఇతర కార్యక్రమాలకు సమయాన్ని వెచ్చించాల్సి ఉంటుందని సలహా ఇస్తున్నారు నిపుణులు.
సమస్యను ఎలా ఎదుర్కోవాలి..
1. మంచి టైం టేబుల్‌ని తయారు చేసుకుని దానికి అనుగుణంగా చదువుకోవాలి.
2. చదువుతున్నప్పుడు చిన్న విరామం తీసుకోవాలి.
3. మంచి ఆహారాన్ని తినాలి. శరీరంలో నీటి కొరత ఉండనివ్వొద్దు.
4. రోజూ కనీసం 8 గంటలు నిద్రపోవాలి.
5. శారీరక శ్రమ కోసం సమయం కేటాయించాలి. వ్యాయామం చేయకపోవడం వల్ల కూడా సమస్య పెరుగుతుంది.
6. తల్లిదండ్రులతో క్రమం తప్పకుండా మాట్లాడాలి.
7. ఏదైనా సమస్య ఉంటే, దాన్ని కుటుంబ సభ్యులు, స్నేహితులతో పంచుకోవాలి.
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..