AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Blue Tea Benefits: బ్లూ టీ గురించి మీకు తెలుసా? దాని అద్భుత ప్రయోజనాలు తెలిస్తే అస్సలు వదలరు..

ఒత్తిడి, ఆందోళన, నిరాశతో బాధపడేవారికి బ్లూ టీ అద్భుతమైన మెడిసిన్‌లా పని చేస్తుంది. బ్లూ టీ రెగ్యులర్ వినియోగం వల్ల హైబీపీ, కొలెస్ట్రాల్ స్థాయిలు నియంత్రణలో ఉంటాయి.

Blue Tea Benefits: బ్లూ టీ గురించి మీకు తెలుసా? దాని అద్భుత ప్రయోజనాలు తెలిస్తే అస్సలు వదలరు..
Blue Tea
Shiva Prajapati
|

Updated on: Feb 10, 2023 | 8:21 AM

Share

ఒత్తిడి, ఆందోళన, నిరాశతో బాధపడేవారికి బ్లూ టీ అద్భుతమైన మెడిసిన్‌లా పని చేస్తుంది. బ్లూ టీ రెగ్యులర్ వినియోగం వల్ల హైబీపీ, కొలెస్ట్రాల్ స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..

కోన్ ఫ్లవర్ టీని సాధారణంగా బ్లూ టీ అంటారు. ఇందులో కెఫిన్ ఉండదు. ఈ హెర్బల్ టీ చాలా ఆరోగ్య ప్రయోజనాలు కలిగి ఉంది. క్లిటోరియా టెర్నేటియా మొక్క ఆకులు, పూల మొగ్గలను వేడి లేదా చల్లటి నీటిలో నానబెట్టడం ద్వారా బ్లూ టీని తయారు చేస్తారు. ఆగ్నేయాసియా దేశాల్లో ఈ టీ బాగా ప్రాచుర్యం పొందింది. అక్కడ ఇది సాధారణంగా భోజనం తర్వాత దీనిని తాగుతారు. శంఖం పువ్వులు తెలుపు రంగు, బ్లూ రంగులోనూ ఉంటుంది. ఒకసారి తయారుచేసిన ఈ టీ దాని pH లేదా ఆమ్లత స్థాయిని బట్టి ఎరుపు, ఊదా, ఆకుపచ్చ రంగులోకి మారుతుంది.

బ్లూ టీ వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు…

1. ఈ టీ యొక్క అందమైన నీలం రంగు కాకుండా, యాంటీఆక్సిడెంట్-రిచ్ టీ. ఆయుర్వేద వైద్య నిపుణులలో బాగా ప్రాచుర్యం పొందింది. అనేక వ్యాధుల చికిత్సకు దీనిని ఔషధంగా ఉపయోగిస్తారు.

2. బ్లూ టీలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఆక్సీకరణ ఒత్తిడికి కారణమయ్యే ఫ్రీ రాడికల్స్‌ను నిరోధించడంలో సహాయపడతాయి. ఈ ఫ్రీ రాడికల్స్ వ్యాధిని కలిగించే కణాల పెరుగుదలను ప్రోత్సహిస్తాయి.

3. ముదురు నీలం నుండి ఊదా రంగు ఎక్కువగా డెల్ఫినిడిన్ కారణంగా ఉంటుంది. ఇది టీలో కనిపించే వివిధ ఆంథోసైనిన్‌ల వల్ల వస్తుంది. గుండె సమస్యలు, మధుమేహం, కొన్ని రకాల క్యాన్సర్ వంటి వ్యాధులకు ఇది చెక్ పెట్టడంలో అద్భుతంగా పని చేస్తుంది.

4. బ్లూ టీ యాంటిపైరేటిక్ లక్షణాలను కలిగి ఉంటుంది. నొప్పి నివారిణి మాత్రల వలె పని చేస్తుంది. బ్లూ టీలోని ఆంథోసైనిన్లు రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడతాయి.

5. ఒత్తిడి, ఆందోళన, నిరాశతో బాధపడేవారికి బ్లూ టీ అద్భుతమైన మెడిసిన్‌లా పని చేస్తుంది. ఆరోగ్య నిపుణుల ప్రకారం.. ఈ టీ మీ మానసిక స్థితిని క్రమబద్ధీకరించడానికి, మనస్సును రిలాక్స్ చేయడానికి సహాయపడుతుంది. పడుకునే ముందు ఒక కప్పు బ్లూ టీ తాగడం వల్ల హాయిగా నిద్ర పడుతుంది. బ్లూ టీ రెగ్యులర్ వినియోగం రక్తపోటు, కొలెస్ట్రాల్ కంట్రోల్‌లో ఉంచుతుంది. గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..