AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Men Health: జస్ట్ 2 పనులు చేస్తే ఆ సమస్యలన్నింటికీ చెక్.. ఇక అన్‌స్టాపబులే..!

ప్రస్తుత ఉరుకులు పరుగుల జీవితంలో.. చాలామందికి తినేందుకు కూడా సమయం దొరకడం లేదు. ఫలితంగా సమయపాలన లేని జీవనశైలితో అనారోగ్యం..

Men Health: జస్ట్ 2 పనులు చేస్తే ఆ సమస్యలన్నింటికీ చెక్.. ఇక అన్‌స్టాపబులే..!
Men Health
Shiva Prajapati
|

Updated on: Jan 12, 2023 | 11:27 AM

Share

ప్రస్తుత ఉరుకులు పరుగుల జీవితంలో.. చాలామందికి తినేందుకు కూడా సమయం దొరకడం లేదు. ఫలితంగా సమయపాలన లేని జీవనశైలితో అనారోగ్యం బారిన పడుతున్నారు. ముఖ్యంగా స్థూలకాయం, మధుమేహం వంటి సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యలు.. లైంగిక సామర్థ్యాన్ని కూడా దెబ్బతీస్తున్నాయి. ఫలితంగా చిన్న యవసులోనే లైంగిక పటుత్వాన్ని కోల్పోతున్నారు చాలామంది. ఈ సమస్యల్లో చాలామంది ఎదుర్కొనేది అంగస్తంభ. తమ సమస్యను బయటకు చెప్పుకోలేక చాలా మంది పురుషులు తమలో తామే కుంగిపోతూ.. మరింత వీక్ అవుతున్నారు. అంగస్తంభన సమస్యకు అనేక కారణాలు ఉన్నాయి. గుండె జబ్బులు, మధుమేహం, ఊబకాయం, తక్కువ టెస్టోస్టెరాన్ స్థాయిలు కూడా కారణం. అయితే, ఈ సమస్య తగ్గాలంటే ముందుగా మెంటల్‌గా స్ట్రాంగ్‌గా ఉండాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. అదే సమయంలో అంగస్తంభన సమస్య తగ్గడానికి వ్యాయమం చేయాలని సూచిస్తున్నారు. ఓ అధ్యయనంలో 40 శాతం మంది వ్యాయామం ద్వారానే అంగస్తంభన సమస్యలను అధిగమించారని తేలింది. మరో 33.5 శాతం మంది పురుషుల్లో అంగస్తంభన సమస్య దాదాపు తగ్గినట్లు గుర్తించారు. మరి ఇందుకోసం ఏ వ్యాయామాలు చేయాలి? ఎలా చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

1. ఏ రకమైన వ్యాయామం ఉత్తమం?

పెల్విక్ కండరాలను బలోపేతం చేయడానికి కెగెల్ వ్యాయామాలు ఉత్తమం. ఈ కెగెల్ వ్యాయామాలు లైంగిక ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో అద్భుతంగా సహాయపడుతాయి. కెగెల్ వ్యాయామాలు చేయడం వల్ల పురుషులు, మహిళలు ఇద్దరూ ప్రయోజనం పొందుతారు. ప్రధానంగా ఈ వ్యాయామం బుల్లోకావెర్నోసస్ కండరాలను బలోపేతం చేయడానికి సహాయపడుతుంది. ఇది అంగస్తంభన సమయంలో రక్తం పంపింగ్ చేయడంలో, మూత్రవిసర్జన తర్వాత మూత్రాశయాన్ని ఖాళీ చేయడంలో సహాయపడుతుంది.

2. ప్రాథమిక దశ కెగెల్ వ్యాయామాలు..

పెల్విక్ ప్రాంతంలో కండరాలను బలోపేతం చేయడానికి ఒక సాధారణ వ్యాయామం మూత్రవిసర్జన చేసేటప్పుడు జననాంగాన్ని పదే పదే పట్టుకోవడం. అంటే ఆగి, ఆగి మూత్ర విసర్జన చేయాలన్నమాట. ఇలా చేయడం కూడా ఒక వ్యాయామమే. క్రమం తప్పకుండా ఈ రకమైన వ్యాయామం చేస్తే అంగస్తంభన సమస్య నుండి బయటపడవచ్చు. ఈ వ్యాయామం రోజుకు రెండు మూడు సార్లు చేయడం ఉత్తమం.

ఇవి కూడా చదవండి

3. ఒత్తిడికి గురికావద్దు..

కెగెల్ వ్యాయామాలు చేయడం మొదలు పెట్టినప్పుడు వరుసగా 10 సార్లు చేయడం అసాధ్యం. దీని గురించి పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు. ఒత్తిడి పెరిగితే శరీరంలో రక్త ప్రసరణకు ఆటంకం ఏర్పడుతుంది. అది అంగస్తంభన సమస్యను మరింత తీవ్రం చేస్తుంది. అందుకే.. ముందుగా ఒత్తిడిని తగ్గించుకోవాలి.

4. ఏరోబిక్, కెమెల్ వ్యాయామాలు..

పెల్విక్ ఫ్లోర్ చుట్టూ ఉన్న కండరాల బలోపేతం కోసం వ్యాయామం చేయాలి. ఇలా చేయడం వల్ల అంగస్తంభన సమస్యను అధిగమించొచ్చు. ఏరోబిక్స్ వ్యాయామాలు అంగస్తంభన సమస్యను తగ్గిస్తుంది. అదే సమయంలో మొత్తం శారీరక ఆరోగ్యాన్ని పెంచుతుంది. ఇక కెగెల్ వ్యాయామాలు కూడా అద్భుత ఫలితాలనిస్తాయి. ప్రతిరోజూ 30 నిమిషాలపాటు చురుగ్గా వాకింగ్ చేసినా మంచి మార్పు వస్తుంది.

5. మోసపోవద్దు..

హెర్బల్ సప్లిమెంట్స్ అంగస్తంభనను నయం చేస్తాయని నమ్మితే మీరు మోసపోయినట్లే. ఆన్‌లైన్‌లో చాలా మంది దీనిపై రకరకాల ప్రచారం చేస్తుంటారు. వాటిని విశ్వసించొద్దు. ఏవైనా అనారోగ్య సమస్యలు ఉంటే.. ముందుగా వైద్యులను సంప్రదించాలి. వారి సలహాలు, సూచనల మేరకు అవసరమైన చికిత్స తీసుకోవాలి.

6. ఇతర మార్గాలు..

అంగస్తంభన సమస్యను తగ్గించడంలో అద్భుతంగా పని చేసేవి కెగెల్, ఏరోబిక్స్ వ్యాయామాలు. ఈ వ్యాయామాలు చేసినప్పటికీ ఎలాంటి ఫలితం లేకపోతే.. వెంటనే వైద్యుడిని సంప్రదించి అవసరమైన చికిత్స పొందాలి.

7. నిరాశ వద్దు..

అంగస్తంభన సమస్య పరిష్కారానికి అనేక మార్గాలు ఉన్నాయి. చికిత్సలు కూడా అందుబాటులో ఉన్నాయి. అయినప్పటికీ, కెగెల్స్, ఏరోబిక్స్ మంచి ఫలితాలను అందిస్తాయి. మొత్తం ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. మీకు అంగస్తంభన సమస్య ఉంటే జీవితం ఇంతటితో ఖతం అని మాత్రం ఆలోచించొద్దు. ఆ సమస్యను అధిగమించే ప్రయత్నం చేయాలి. ధైర్యంగా ఉండాలి. చింత, నిరాశ వదిలి ప్రశాంతంగా ఉంటే.. ఆ సమస్య ఆటోమాటిక్‌గా తగ్గుతుంది.

మరిన్ని హెల్త్ సంబంధిత వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..