Inspiring Story: ఒకరు ఐఏఎస్..మరొకరు ఐఆర్ఎస్..తల్లిదండ్రి మరణించినా కష్టాలను అధిగమించి సత్తాచాటిన అక్కాచెల్లెళ్ల విజయ గాథ

Inspiring Story: తండ్రి సమాజాన్ని కాపాడుతూ.. ప్రజల ధనమాన ప్రాణాలకు రక్షణ కల్పించే పోలీసు ఉద్యోగి డిఎస్పీ .. అయితే కొంతమంది సబ్ అర్దినేట్స్ చేసిన దుర్మార్గానికి విధి నిర్వహణలో ప్రాణాలు పోగొట్టుకున్నాడు. అప్పుడు అతనికి భార్య..

Inspiring Story: ఒకరు ఐఏఎస్..మరొకరు ఐఆర్ఎస్..తల్లిదండ్రి మరణించినా కష్టాలను అధిగమించి సత్తాచాటిన అక్కాచెల్లెళ్ల విజయ గాథ
Inspiring Story
Follow us
Surya Kala

|

Updated on: Aug 26, 2021 | 6:50 PM

Inspiring Story IAS Kinjal Singh and IRS Pranjal Singh: తండ్రి సమాజాన్ని కాపాడుతూ.. ప్రజల ధనమాన ప్రాణాలకు రక్షణ కల్పించే పోలీసు ఉద్యోగి డిఎస్పీ .. అయితే కొంతమంది సబ్ అర్దినేట్స్ చేసిన దుర్మార్గానికి విధి నిర్వహణలో ప్రాణాలు పోగొట్టుకున్నాడు. అప్పుడు అతనికి భార్య .. లోకం తెలియని ఇద్దరు చిన్నారులున్నారు.. భర్త మరణం విషయంలో న్యాయపోరాటం చేస్తూ.. ప్రభుత్వం ఇచ్చిన ఓ చిన్న ఉద్యోగంతో ఇద్దరి ఆడపిల్లలను తానె తల్లిత్రండ్రి అయి పెంచింది. అయితే ఇక్కడ కూడా ఆ ఇద్దరి ఆడపిల్లల పట్ల విధి వెక్కిరించింది. పిల్లలు డిగ్రీలోకి అడుగు పెట్టిన తర్వాత డిఎస్పీ భార్యకు క్యాన్సర్ తెలిసింది. తల్లికి తాము ఇద్దరం UPSC లో ఉత్తీర్ణులవుతామని మాట ఇచ్చారు.. తల్లి మరణంలో ఒకరికొకరు తోడుగా నిలిచిన అక్కచెల్లెలు.. కష్టపడి చదువుకున్నారు.. ఇప్పడు ఒకరు IAS, IRSలుగా అధికారం చేపట్టారు. దేశం గర్వించదగ్గ ఈ సోదరీమణులు ఇద్దరు నేటి అనేక మంది పిల్లలకి ఆదర్శం. వారే కింజాల్ సింగ్ IAS, ప్రింజాల్ సింగ్ IRSలు వివరాల్లోకి వెళ్తే..

ముప్పై అయిదేళ్ళ క్రితం 12 మార్చి 1982 న మాదాపూర్ అనే గ్రామం లో ఉత్తర ప్రదేశ్ లోని గౌండ జిల్లాలో DSP ఎస్.పి. సింగ్ కు కొంతమంది క్రిమినల్స్ సంచరిస్తున్నారని సమాచారం అందింది. దీంతో డీఎస్పీ ఎస్పీ సింగ్ తన సబ్ అర్దినేట్స్ తో రాత్రి వేళ హుటాహుటిన వెళ్ళాడు. ఆటను శవమై మర్నాడు ఉదయం ప్రభుత్వ అసుపత్రికి చేరాడు. మరో 12 మంది దుండగులతో కలిసి అతను బాంబు దాడిలో మరణించారని భార్య విభాసింగ్ కి సమాచారం ఇచ్చారు. అయితే తన భర్త చావుకు కారణం బాంబ్ దాడి కాదని.. DSP సింగ్ ని అతని సబ్ ఆర్దినేట్స్ ఒక నకిలీ ఎన్కౌంటర్ లో చంపేశారని అప్పట్లో వార్తలు వినిపించాయి. అంతేకాదు తనను కలుస్తున్న సమయంలో సింగ్ “దయచేసి నన్ను కాల్చొద్దు. నాకు ఇద్దరు పసిపిల్లలు ఉన్నారు” అని చివరిగా వేడుకున్నారట.

తన భర్త మరణం విషయంపై విచారణ సీబీఐ కి బదలాయించాలని సింగ్ భార్య ‘విభా సింగ్’ హై కోర్టుని ఆశ్రయించింది. తోటి ఉద్యోగులు క్రిమినల్స్ తో కలసి ఈ దారుణానికి పాల్పడినట్లు సిబిఐ చార్జ్ షీట్ ఫైల్ చేసింది. అప్పటి నుంచి సింగ్ హత్య కేసు విచారణ మొదలైంది. భర్త మరణించే సరికి విభా సింగ్ కు కింజాల్ అనే ఆర్నెళ్ళ పాప, ఇంకా లోకం చూడని (ప్రింజాల్ సింగ్) బిడ్డ ఉన్నారు. భర్త మరణంలో విభా సింగ్ కు వారణాసి ట్రెజరీ లో ప్రభుత్వం ఓ చిన్న ఉద్యోగం ఇచ్చింది. తన భర్త మరణాన్ని ప్రశ్నిస్తూ న్యాయం కోసం భార్య చేసిన పోరాటం నీరు కారి పోయింది. భర్త తో పాటు పని చేస్తున్న ఉద్యోగులు ఆమెకి ఎవరు సహకరించలేదు.

ఆమె ఉద్యోగం లో జాయిన్ అయింది. ఇద్దరు పిల్లలకి అన్నీ తానై చదివించడం మొదలెట్టింది. కొద్ది ఆదాయం, తండ్రి లేని ఒంటరి కుటుంబం గురించి ఇద్దరి ఆడపిల్లకు బాగా అర్ధమయింది. దీంతో తల్లితో పాటు తమకు ఎదురైన అన్ని రకాల గడ్డు సమస్యలని ఎదుర్కొన్నారు. పిల్లలిద్దరూ వారి చదువుల కోసం అనేక త్యాగాలు చేసారు. తండ్రి ఫోటో ని చూస్తూ.. అతన్నే ఇన్స్పిరేషన్ గా తీసుంటూ కష్టాన్ని ఇష్టంగా ఇష్టపడి చదువు సాగించారు.

పెద్దమ్మాయి కింజాల్ డిల్లీ లోని అత్యున్నతమయిన “లేడి శ్రీరాం కాలేజ్” లో సీటు సంపాదించింది. కింజాల్ డిగ్రీ మొదటి సంవత్సరం లో ఉన్న సమయంలో మరోసారి ఆ ఆడపిల్లలను విధి వెక్కిరించింది. కింజాల్ తన తల్లి కి కాన్సర్ అని తెలుసుకుంది. విభా ఎక్కువ కాలం జీవించే అవకాశం లేదని తెలిసిన రెండు రోజుల కి కింజాల్ పరీక్షలు రాసింది. అందులో కింజాల్ యునివర్సిటీ టాపర్ గా నిలిచి గోల్డ్ మెడల్ సాధించింది. 2004 లో తల్లి మరణించింది. అప్పుడు తల్లి మరణ శయ్య వద్ద కింజాల్ తామిద్దరు UPSC క్రాక్ చేస్తామని మాట ఇచ్చింది. దీంతో అక్కచెల్లెలు దేశ రాజధాని ఢిల్లీ బాట పట్టారు.

ముఖర్జీ నగర్ లో ఒక సాదారణ గది లో నివాసం ఉంటూ UPSC కి చదవటం మొదలెట్టారు. మిత్రుల వద్ద అరువు తెచ్చుకున్న పుస్తకాలతో వాళ్ళు యజ్ఞం మొదలెట్టారు. స్వగ్రామం మరిచి పోయారు. బందువులు లేరు. ఒక పండగ లేదు ఒక సరదా లేదు. ఒక విరామం లేదు. వాళ్లిద్దరు ఒకరి కొకరు అండ వాళ్ళిద్దరికీ తల్లి తండ్రి ప్రేరణ.

2007 లో కింజాల్ సింగ్ IAS, ప్రింజాల్ సింగ్ IRS ని సాధించారు. వారిద్దరి పట్టుదల విజయగాధ జ్యుడిషిల్ వ్యవస్థని తాకింది. తండ్రి ని చంపిన 31 ఏళ్ల తర్వాత, చార్జ్ షీట్ చేసిన 27 ఏండ్ల తర్వాత ఎనిమిది మంది పోలిస్ అధికారులని నిందితులుగా నిర్ధారించింది కోర్టు. ఎస్ పి సింగ్ నిజాయితీని, తల్లి ఆరోపణలని నిజమని ప్రపంచానికి కోర్టు రుజువు చేసింది. తీర్పు చెప్పినప్పుడు అప్పటి ‘లక్ష్మి పుర ఖేరి’ జిల్లా కలెక్టర్ అండ్ మేజిస్ట్రేట్ గా ఉన్న కింజాల్ సింగ్ దుఖం దాచుకోలేక పోయింది. కన్నీటి పర్యంతం అయింది. ఆడపిల్లలని తక్కువ గా చేసి .. వారిద్దరిని తక్కువగా చూసి మాట్లాడే వాళ్లకి కింజాల్ సింగ్, ప్రింజాల్ సింగ్ తమ ఉద్యోగాలకు సమాధానం చెప్పారు. నేటి యువతకు ఈ అక్కచెల్లెలు ఆదర్శంగా నిలిచారు.

Also Read: Software Engineer Suicide: పెళ్ళికావడం లేదని మనస్తాపంతో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ ఆత్మహత్య..